వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే పోసాని కృష్ణ మురళి తాజాగా కమల్ హాసన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమల్ కంటే రాజేంద్ర ప్రసాద్ గొప్ప నటుడు అని అన్నారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
భారత దేశం గర్వించదగ్గ నటుల్లో కమల్ హాసన్ ఒకరు. విలక్షణ నటనతో కమల్ హాసన్ దశాబ్దాలుగా ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నారు. తాను పోషించే ప్రతి పాత్రలో వైవిధ్యం, నటనకు ప్రాధాన్యం ఉండాలి అని భావించే నటుడు కమల్ హాసన్. ఈ లోక నాయకుడు ఎలాంటి ఎమోషన్ ని అయినా ఇట్టే పలికించగలడు. అయితే కమల్ హాసన్ ని మించే నటుడు టాలీవుడ్ లోనే ఉన్నాడు అని పోసాని కృష్ణ మురళి అంటున్నారు.
25
కమల్ కంటే అతడే గొప్ప నటుడు
రీసెంట్ ఇంటర్వ్యూలో పోసాని చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా ఉన్నాయి. పోసాని మాట్లాడుతూ.. కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్ లలో ఎవరు గొప్ప నటుడు అంటే నేను రాజేంద్ర ప్రసాద్ గారి పేరు మాత్రమే చెబుతా. దానికి కారణం ఉంది.
35
రాజేంద్ర ప్రసాద్ కి అది చాలా ఈజీ
రాజేంద్ర ప్రసాద్ తన కామెడీతోనే అభిమానులని సొంతం చేసుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ షూటింగ్ లో పొట్ట చెక్కలయ్యే కామెడీ సన్నివేశం లో నటించారు అనుకుందాం. వెంటనే నెక్స్ట్ సీన్ కన్నీళ్లు పెట్టించాల్సిన ఎమోషనల్ సీన్ ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారు ఏం చేస్తారు అంటే ఒక టీ, లేదా కాఫీ తాగి వచ్చేస్తారు.
ఎమోషనల్ సీన్ లో ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టించేలా నటించగలరు. అది రాజేంద్ర ప్రసాద్ కి అంత సులభం. ఒక కామెడీ సీన్ చేసి వెంటనే వేరే ఎమోషన్ ఉన్న సీన్ లో నటించడం అందరికీ సాధ్యం కాదు. ఆ పని రాజేంద్ర ప్రసాద్ మాత్రమే చేయగలరు అంటూ పోసాని ప్రశంసలు కురిపించారు.
55
కమల్ హాసన్ కి ప్రిపరేషన్ కావాలి
ఆ విధంగా కమల్ హాసన్ చేయాలి అంటే అతడికి ప్రిపరేషన్ కావాలి. కానీ రాజేంద్ర ప్రసాద్ కి అవసరం లేదు అని పోసాని అన్నారు. ఎన్నో కామెడీ చిత్రాలతో కడుపుబ్బా నవ్వించి కామెడీ కింగ్ గా రాజేంద్ర ప్రసాద్ గుర్తింపు పొందారు. అదే విధంగా ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి లాంటి చిత్రాల్లో కన్నీళ్లు పెట్టించారు.