రాజమౌళి చాలా షై పర్సన్ అని విన్నాం, ఎలా కలిసిపోయారని యాంకర్ ప్రశ్నించగా, ఆయనకు సిగ్గేం లేదు. అంత అమాయకుడేం కాదు. అయితే వర్క్ పట్ల ఫోకస్‌గా ఉంటాడు, ఆ విషయంలో రాజీ లేదు. అయితే అదే సమయంలో మంచి పార్టనర్ కావాలని, మంచి భార్య కావాలని ఉంటుంది. అలా తనని ఎంచుకున్నాడని చెప్పింది రమా. మరి మీ మధ్య ఏవైనా మనస్పర్థాలు వస్తుంటాయా? ఎలా ఉంటారనే ప్రశ్నకి రమా రాజమౌళి స్పందిస్తూ, తమ అభిప్రాయాలు కలిసిపోతాయని, 99శాతం తేడా ఉండదని, ఒక్క శాతం కూడా ఏంచెప్పాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. వ్యక్తిగతంగా, ఫ్యామిలీలో డిఫరెన్సెస్ ఉండవని, ఏదైనా వర్క్ విషయంలోనే ఉంటుందన్నారు. ఇద్దరం ఒకే ఒపీనియన్‌తో వెళ్లిపోతామని తెలిపారు.