సినిమాకు 12 కోట్లు, సౌత్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే టాప్ 5 మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరో తెలుసా?

Published : May 05, 2025, 12:28 PM IST

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో  సినిమాకు 12 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే మ్యుజిక్ డైరెక్టర్ ఎవరు?  అత్యధిక పారితోషికం పొందుతున్న టాప్ 5 సంగీత దర్శకుల గురించి  ఇప్పుడు చూద్దాం. 

PREV
16
సినిమాకు 12 కోట్లు, సౌత్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే టాప్ 5 మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరో తెలుసా?
టాప్ 5 సంగీత దర్శకుల జీతాలు

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో  సంగీత దర్శకులకు కొదవలేదు. ముఖ్యంగా తమిళ పరిశ్రమలో ఇప్పుడు ఎక్కువగా మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు.  ప్రతి దశాబ్దానికి కొత్త కొత్త సంగీత దర్శకులు వస్తున్నారు. ఆ విధంగా ఇళయరాజా తర్వాత ఎ.ఆర్.రెహమాన్ వచ్చారు. ఆయన తర్వాత హారిస్ జయరాజ్ దేవిశ్రీ ప్రసాద్, తమన్ సత్తా చూపించారు. 

ఆ తర్వాత అనిరుధ్ వచ్చి సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు లేటెస్ట్‌గా మ్యూజిక్ సెన్సేషన్‌గా సాయి అభయంకర్ ఎదిగారు. ఆయన చేతిలో అర డజను సినిమాలు ఉన్నాయి. ఇలా సంగీత దర్శకులు నిండిపోయిన ఇండస్ట్రీలో  అత్యధిక పారితోషికం పొందుతున్న టాప్ 5 సంగీత దర్శకులు ఎవరో  చూద్దాం.

26
5. యువన్ శంకర్ రాజా జీతం

అత్యధిక పారితోషికం పొందుతున్న సంగీత దర్శకుల జాబితాలో యువన్ శంకర్ రాజా 5వ స్థానంలో ఉన్నారు. ఆయన సంగీతంలో చివరిగా స్వీట్‌హార్ట్ సినిమా విడుదలైంది. ఆ సినిమా పెద్దగా విజయం సాధించలేదు. యువన్ చివరిగా హిట్ ఇచ్చిన ఆల్బమ్ అంటే అది విజయ్ గోట్ సినిమానే. ఆ సినిమా విజయం తర్వాత ఆయన సంగీతంలో వచ్చిన పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. ఆయన ఒక సినిమాకు సంగీతం అందించడానికి రూ.5 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారు.

36
4. జివి ప్రకాష్ కుమార్ జీతం

కోలీవుడ్‌లో నటుడిగా అడుగుపెట్టిన తర్వాత సంగీత దర్శకత్వంపై పెద్దగా దృష్టి పెట్టలేదు జివి ప్రకాష్ కుమార్. కాని ఈమధ్య  నటనను తగ్గించుకుని సంగీత దర్శకత్వంపై దృష్టి సారించారు. ఈ ఏడాది ఆయన సంగీతంలో వణంగాన్, కింగ్‌స్టన్, నీక్, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో గుడ్ బ్యాడ్ అగ్లీ తప్ప మిగతావన్నీ ప్లాప్ అయ్యాయి. ఆయన ఒక సినిమాకు సంగీతం అందించడానికి రూ.6 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారు.

46
3. తమన్ జీతం

కోలీవుడ్‌లో అత్యధిక పారితోషికం పొందుతున్న సంగీత దర్శకుల జాబితాలో తమన్ 3వ స్థానంలో ఉన్నారు. ఆయన ఒక సినిమాకు రూ.8 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారు. విజయ్ వారసుడు సినిమాకు ఆయన అందించిన సంగీతం బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాకు సంగీతం అందిస్తున్నారు తమన్. తమిళంలో చాలా తక్కువ సినిమాలు చేస్తుూ.. ఎక్కువగా తెలుగు సినిమాలకు సంగీతం అందిస్తున్నారు తమన్. 

56
2. ఎ.ఆర్.రెహమాన్ జీతం

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 30 ఏళ్లకు పైగా తన సంగీతంతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసిన వ్యక్తి ఎ.ఆర్.రెహమాన్. ఆయన తర్వాత వచ్చిన హారిస్ జయరాజ్, విద్యాసాగర్ వంటి సంగీత దర్శకులు ఫామ్ అవుట్ అయినా ఎ.ఆర్.రెహమాన్ ఇప్పటికీ ముందు వరుసలో ఉన్నారు. ఆయన ఒక సినిమాకు రూ.10 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారు.

66
1. అనిరుధ్ జీతం

కోలీవుడ్‌లో అత్యధిక పారితోషికం పొందుతున్న సంగీత దర్శకుడు  అనిరుధ్. ఈ ఏడాది ఆయన సంగీతంలో కూలి, జన నాయగన్, జైలర్ 2, కింగ్‌డమ్, మదరాసి, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. అర డజను సినిమాలతో చాలా బిజీగా ఉన్న సంగీత దర్శకుడిగా వెలుగొందుతున్న అనిరుధ్, ఒక సినిమాకు రూ.12 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories