క్లింట్ ఈస్ట్‌వుడ్ దర్శకత్వం వహించిన సల్లీ, హడ్సన్ నదిపై US ఎయిర్‌వేస్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసిన కెప్టెన్ చెస్లీ "సల్లీ" సల్లెన్‌బెర్గర్ రియల్ స్టోరీ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో టామ్ హాంక్స్ ప్రధాన పాత్రలో మెరిశారు.
25
కాస్ట్ ఎవే (2000)
విమాన ప్రమాదంలో బతికి, జనసంచారం లేని ద్వీపంలో చిక్కుకున్న FedEx ఎగ్జిక్యూటివ్‌గా టామ్ హాంక్స్ నటించారు. ఈ చిత్రం ఒంటరితనం, ఓర్పు, మనుగడ సాగించి ఇంటికి తిరిగి రావాలనే మానవ సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుంది.
35
ది గ్రే (2011)
అలాస్కాలో విమాన ప్రమాదం తర్వాత, లియామ్ నీసన్ ప్రకృతి , తోడేళ్ళతో పోరాడుతున్న చమురు కార్మికులకు నాయకత్వం వహిస్తాడు. ఈ చిత్రం సర్వైవల్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంటుంది.