పాపులర్ నవలల ఆధారంగా తెరకెక్కిన 5 బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల లిస్ట్ ఇది. ఊహించని ట్విస్టులు, మైండ్ బెండింగ్ స్టోరీలతో ఉండే ఈ సినిమాలు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. థ్రిల్లర్ లవర్స్ కచ్చితంగా చూడాల్సిన సినిమాలివే.
OTT - నవలల ఆధారంగా వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు
నవలల ఆధారంగా సినిమాలు తీయడం ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. ఎప్పటినుంచో డైరెక్టర్లు బెస్ట్ సెల్లర్ నవలలను బేస్ చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతున్నారు. ఈరోజు మనం అలాంటి కొన్ని సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాలన్నీ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉన్నాయి.
26
1. గాన్ గర్ల్ (Gone Girl)
ఈ సినిమాకు ఐఎమ్‌డీబీ (IMDb)లో 8.1 రేటింగ్ ఉంది. పెళ్లైన ఐదో యానివర్సరీ రోజున భార్య సడెన్‌గా మిస్ అవుతుంది. ఆమె మిస్సింగ్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. గిలియన్ ఫ్లిన్ రాసిన పాపులర్ థ్రిల్లర్ నవల ఆధారంగా ఈ సినిమాను తీశారు. ఇదొక అద్భుతమైన సైకలాజికల్ థ్రిల్లర్. కథలో వచ్చే ఊహించని ట్విస్టులు ఆడియన్స్‌ను ఆశ్చర్యపరుస్తాయి. సస్పెన్స్, మిస్టరీ ఇష్టపడేవాళ్లకు ఈ సినిమా బెస్ట్ ఆప్షన్. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది.
36
2. ద పేల్ బ్లూ ఐ (The Pale Blue Eye)
లూయిస్ బాయర్డ్ రాసిన చారిత్రక మిస్టరీ నవల ఆధారంగా ఈ హారర్ మిస్టరీ థ్రిల్లర్ తెరకెక్కింది. 1830ల కాలంలో ఈ కథ జరుగుతుంది. ఒక మిలిటరీ అకాడమీలో జరిగిన దారుణ హత్యను దర్యాప్తు చేయడానికి ఒక డిటెక్టివ్ వస్తాడు. ఈ మర్డర్ మిస్టరీని ఛేదించడానికి అతను అదే అకాడమీకి చెందిన ఒక యువ క్యాడెట్ సాయం తీసుకుంటాడు. ఆ యువ క్యాడెట్ తర్వాత కాలంలో పెద్ద రైటర్ అవుతాడు. ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగేకొద్దీ ఎన్నో రహస్యాలు బయటపడతాయి. మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవాళ్లు నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న ఈ సినిమాను చూసేయొచ్చు.
రుమాన్ ఆలం రాసిన నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఐఎమ్‌డీబీలో దీనికి 6.4 రేటింగ్ ఉంది. రిలీజ్ అయ్యాక ఈ సినిమా గురించి చాలా చర్చే జరిగింది. న్యూయార్క్ సిటీకి దగ్గర్లో ఉన్న ఒక అందమైన వెకేషన్ హోమ్‌ను అద్దెకు తీసుకుని ఒక ఫ్యామిలీ హాలిడే ఎంజాయ్ చేయడానికి వెళ్తుంది. కానీ, అనుకోకుండా జరిగిన సైబర్ ఎటాక్ వల్ల ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ సిస్టమ్ మొత్తం ఆగిపోయిందని వాళ్లకు తెలుస్తుంది. ఆ తర్వాత ఒకదాని వెంట ఒకటిగా ఎన్నో వింత సంఘటనలు జరుగుతాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ కుప్పకూలినప్పుడు ఎదురయ్యే భయం, ప్రాణాలు దక్కించుకునే పోరాటాన్ని ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. ఇదొక డిఫరెంట్ సర్వైవల్ థ్రిల్లర్. నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
56
4. మోనికా, ఓ మై డార్లింగ్ (Monica, O My Darling)
రాజ్‌కుమార్ రావ్, రాధికా ఆప్టే, సికందర్ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కూడా ఒక నవల స్ఫూర్తితోనే వచ్చింది. జపనీస్ రైటర్ కీగో హిగాషినో రాసిన 'బురుటాసు నో షింజో' నవల ఆధారంగా ఈ హిందీ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్‌ను తెరకెక్కించారు. కథ విషయానికొస్తే.. ఒక రోబోటిక్స్ ఎక్స్పర్ట్ తన కంపెనీలోనే పనిచేసే యువతితో ఎఫైర్ పెట్టుకుంటాడు. కానీ, ఆ తర్వాత ఆమె అతన్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెడుతుంది. దీంతో అతను ఊహించని సమస్యల్లో ఇరుక్కుంటాడు. కామెడీ, క్రైమ్, సస్పెన్స్, అదిరిపోయే ట్విస్టులు ఈ సినిమాకు హైలైట్. ఐఎమ్‌డీబీలో 7.4 రేటింగ్ ఉన్న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.
66
5. గాడ్స్ క్రూకెడ్ లైన్స్ (God's Crooked Lines)
టోర్క్యూటో లూకా డి టెనా నవల ఆధారంగా వచ్చిన ఈ సినిమా ఒక అద్భుతమైన మైండ్-గేమ్ థ్రిల్లర్. ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ మానసిక చికిత్సాలయంలో పేషెంట్‌గా చేరడంతో కథ మొదలవుతుంది. అక్కడ ఒక పేషెంట్ అనుమానాస్పద మృతి వెనుక ఉన్న నిజాన్ని కనిపెట్టడమే ఆమె టార్గెట్. కానీ, దర్యాప్తు ముందుకు సాగేకొద్దీ హాస్పిటల్ డాక్టర్లు చెప్పే మాటలు, ఆలిస్ మానసిక స్థితిపై వచ్చే అనుమానాలు.. నిజం ఏది, భ్రమ ఏది అనే కన్ఫ్యూజన్ను క్రియేట్ చేస్తాయి. ఏది నిజం, ఏది అబద్ధం అని ఆడియన్స్ కూడా బుర్ర గోక్కుంటారు. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగే ఈ సినిమా మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్ లవర్స్‌కు పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.