రాజశేఖర్ ఒకప్పుడు చిరంజీవి స్థాయిలో రాణించారు. కానీ ఆ తర్వాత కెరీర్ డౌన్ అయ్యింది. దానికి రకరకాల కారణాలు, వివాదాలు అని అంటుంటారు, కానీ అసలు నిజం ఏంటనేది రాజశేఖర్ వెల్లడించారు.
యాంగ్రీయంగ్ మ్యాన్‌గా రాణించారు రాజశేఖర్. వరుసగా యాక్షన్ చిత్రాలతో అదరగొట్టారు. టాలీవుడ్‌లో ఒక్కసారిగా తిరుగులేని స్టార్‌గా ఎదిగారు. `అంకుశం`, `ఆహుతి`, `అన్న`, `అల్లరి ప్రియుడు` చిత్రాలతో రాజశేఖర్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అప్పట్లో టాలీవుడ్‌లో నెంబర్ 1 అని ఎవరూ లేరు. రాజశేఖర్ ఆ సమయంలో వరుస విజయాలతో దూసుకుపోయారు. టాలీవుడ్‌లో ఎవరికీ సాధ్యం కాని కలెక్షన్లు ఆయన సినిమాలకు వచ్చేవి. మాస్ ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. దీంతో ఆ సమయంలో చిరంజీవి స్థాయిలో స్టార్‌గా ఎదిగారు రాజశేఖర్. ఇంకా చెప్పాలంటే నువ్వా, నేనా అనేలా ఉండేది.
24
అనూహ్యంగా కెరీర్ డౌన్.. కారణం చెప్పిన రాజశేఖర్
కానీ రాజశేఖర్ అనూహ్యంగా డౌన్ అయ్యారు. చాలా రోజులు చిరుకి గట్టి పోటీ ఇచ్చినా క్రమంగా ఆయన కెరీర్ డౌన్ అవుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా రాజశేఖర్ స్పందించారు. తన కెరీర్ ట్రాక్ తప్పిన మాట నిజమే అని ఒప్పుకున్నారు. అందుకు అసలు కారణాలు చెప్పారు. ``అంకుశం`, `ఆహుతి`, `అన్న`, `అల్లరి ప్రియుడు` వంటి హిట్లతో తాను టాప్‌లోకి వెళ్లిన మాట నిజమే, చిరంజీవికి పోటీగా వస్తున్నారని ఆ సమయంలో అంతా మాట్లాడుకున్నారు. కానీ ఆ తర్వాత నా కెరీర్ అంత బాగా సాగలేదు. ఫెయిల్యూర్స్ ఎక్కువగా చూడాల్సి వచ్చింది. అందుకు కారణం సరైన ప్లానింగ్ లేకపోవడమే. చిరంజీవిగారు వరుసగా హిట్ల నేపథ్యంలో నెక్ట్స్ ఎవరితో సినిమా చేయాలని, పెద్ద బ్యానర్, పెద్ద దర్శకులు, పెద్ద టెక్నీషియన్లు ఇలా సరైన ప్లానింగ్‌గా, సెలక్టీవ్‌గా సినిమాలు చేశార`ని తెలిపారు రాజశేఖర్.
34
ప్లానింగ్ లేకపోవడమే మెయిన్ రీజన్
`కానీ నాకు అలాంటి ప్లానింగ్ లేదు. ఎవరైనా వచ్చి కథ చెబితే నచ్చితే చేసేవాడిని, ఆ దర్శకుడు చేయగలడా? ఆ నిర్మాత బాగా తీయగలడా అనేది చూడలేదు. మెయిన్‌గా దర్శకులు, నిర్మాతల విషయంలో పెద్దగా ఫోకస్ చేయలేదు, కొత్తవాళ్లతో ఎక్కువగా చేశాను, పెద్ద దర్శకులు, నిర్మాతలతో రిపీట్ చేయలేకపోయాను, కథల ఎంపికలోనూ ప్లానింగ్ మిస్ అయ్యింది` అని చెప్పారు రాజశేఖర్. వచ్చిన సినిమా, నచ్చిన కథలు చేసుకుంటూ రావడంతో అవి సరిగ్గా ఆడలేదని, కొన్ని సరిగ్గా తీయలేకపోయారని, ప్రొడక్షన్స్ పరంగానూ ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చిందని తెలిపారు రాజశేఖర్. దీంతో కెరీర్ ఆశించిన స్థాయిలో రన్ కాలేదని వెల్లడించారు. తన కెరీర్ గాడి తప్పడానికి సరైన ప్లానింగ్ లేకపోవడమే పెద్ద మిస్టేక్ అని ఆయన స్పష్టం చేశారు. ఆర్కే టాక్ షోలో రాజశేఖర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇదే కాదు, దీనికితోడు మరో మెయిన్ రీజన్ కూడా ఉంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో గొడవ కూడా మరో కారణంగా చెప్పొచ్చు. తన మరదలి విషయంలో దర్శకుడు తప్పు చేస్తున్నాడని, ఇతరులు చెబితే విన్న రాజశేఖర్ తాగిన మత్తులో ఆయన ఇంటికెళ్లి గొడవ పెట్టుకున్నాడట. పెద్దగా అరిచాడట. దీంతో రాఘవేంద్రరావు హర్ట్ అయ్యారని తెలిపారు. ఆ విషయంలో తనదే మిస్టేక్ అని, ఆ తర్వాత ఆయన్ని కలిసి సారీ చెప్పామని, బతిమాలమని, కానీ ఆయన తనతో సినిమాలు చేయలేదని చెప్పారు. రాఘవేంద్రరావు `అల్లరి ప్రియుడు` మూవీతో తన ఇమేజ్‌ని మార్చేశారని, ఆ తర్వాత ఆయనతో మరికొన్ని సినిమాలు చేసి ఉంటే కెరీర్ మరోలా ఉండేదనే అభిప్రాయాన్ని రాజశేఖర్ వెల్లడించారు.