నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో ఉన్న టాప్ 10 సినిమాలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది వార్ 2 హిందీ వెర్షన్ మూవీ. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీ నటించిన ఈ సినిమా హిందీ, తమిళ వెర్షన్లు మొదటి స్థానంలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ స్పై యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది.