బామ్మర్ది కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్.. రెండు అదిరిపోయే బహుమతులు, దెబ్బకు నితిన్ కెరీర్ సెట్ ?

Published : Oct 14, 2025, 09:20 AM IST

రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ బామ్మర్ది, టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్ పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది. అయితే తన భార్య తమ్ముడికి తారక్ రెండు అదిరిపోయే గిఫ్ట్ లు ఇచ్చాడట. బామ్మర్ధి కెరీర్ సెట్ చేయడానికి ఎన్టీఆర్ ఏం చేశాడో తెలుసా?

PREV
14
బామ్మర్ది పెళ్లిలో ఎన్టీఆర్ సందడి

రీసెంట్ ఎన్టీఆర్ భార్య తమ్ముడు, టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్ పెళ్ళి చాలా ఘనంగా జరిగింది. ఏడాది క్రితం ఎంగేజ్మెంట్ అవ్వగా.. చాలా గ్యాప్ తరువాత నితిన్ పెళ్లి జరిగింది. కాగా నార్నే ఇంటి పెద్దల్లుడు, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దగ్గరుండి బామ్మర్ది పెళ్లిని జరిపించారు. పెళ్లిపనులన్నీ స్వయంగా చూసుకున్నారు ఎన్టీఆర్, పెళ్లి మండపంలో కూడా తారక్ జంటగా కనిపించి ఫ్యాన్స్ కు కనువిందు చేశాడు. పెళ్లి జరిగినంతసేపు అక్కడి బంధువులను పలకరిస్తూ.. సెలబ్రిటీలా కాకుండా, సామాన్యుడిలా ప్రవర్తించాడు జూనియర్ ఎన్టీఆర్. పెళ్లి తరువాత ఎన్టీఆర్ దంపతులు నితిన్ దంపతులను ఆశీర్వదించారు. ఇక దీనికి సబంధించిన ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

24
బామ్మర్దికి ఎన్టీఆర్ అదిరిపోయే బహుమతులు

తన బామ్మర్ది వివాహాన్ని దగ్గరుండి నిర్వహించిన ఎన్టీఆర్, అంతకంటే అదిరిపోయేలా రెండు బహుమానాలు కూడా అందించాడట. ఎన్టీఆర్ ఫ్యాన్స , సోషల్ మీడియాల్ జరుగుతున్న ప్రచారం ప్రకారం.. జూనియర్ ఎన్టీఆర్ నార్నే నితిన్‌కు ఒక ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చినట్టు సమాచారం. అంతే కాదు కారుతో పాటు నితిన్ కెరీర్ సెట్ అయ్యే విధంగా మరో భారీ సర్ప్రైజ్‌ను కూడా ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. హీరోగా చిన్న సినిమాలు చేసుకుంటున్న నార్నే నితిన్ కు ఒక స్టార్ డైరెక్టర్‌తో సినిమా చేయించేందుకు జూనియర్ ఎన్టీఆర్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అంతే కాదు తన బామ్మర్ది కోసం తారక్ కొన్ని కథలు కూడా విన్నాడట. ఫేమస్ దర్శకుడితో నితిన్ చేత సినిమా చేయిస్తే.. టాలీవుడ్ లో అతని కెరీర్ సెట్ అవుతుందని భావిస్తున్నాడట యంగ్ టైగర్. అయితే ఈ విషయాన్ని త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

34
నార్నే నితిన్ సినిమాలు

ఎన్టీఆర్ సపోర్ట్ తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన నార్నే నితిన్, నాలుగు సినిమాల్లో హీరోగా నటించాడు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ తో పాటు ఆయ్, శ్రీశ్రీశ్రీ రాజావారు సినిమాల్లో హీరోగా నటించి మెప్పించాడు. అందులో మ్యాడ్, మ్యాడ్ స్కవేర్ సినిమాలు సక్సెస్ సాధించాయి. హీరోగా తనను తాను నిరూపించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు నితిన్. అందులో భాగంగా మంచి మంచి కథలను ఎంచుకుని సినిమాలు చేస్తున్నాడు. ఈక్రమంలో ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ తో నితిన్ కు సినిమా సెట్ చేస్తే, అతని కెరీర్ కు అది ప్లస్ అవుతుంది. ఇప్పటికే హీరోగా తన టాలెంట్ ఏంటో చూపించాడు నితిన్. సినిమా కోసం కష్టపడి పనిచేయడం అలవాటు చేసుకున్నాడు.

44
జూనియర్ ఎన్టీఆర్ ప్లానింగ్స్

ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్, దేవర సినిమాతో మరోసారి సత్తా చాటారు. తర్వాత హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 సినిమాలో నటించారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, జూనియర్ ఎన్టీఆర్‌కి బాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపు తీసుకువచ్చింది. ఈసినిమా ప్లాప్ అయినా, తారక్ కు నార్త్ లో ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఇక ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈసినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత వెంటనే ఆయన దేవర 2 సెట్స్ లోకి వెళ్లబోతున్నాడు. దేవర సినిమాతో పాటు ఎన్టీఆర్ ఖాతాలో మరో మూడు సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories