Actress: 8 సినిమాలు చేస్తే అందులో మూడే హిట్స్.. అందం ఉన్నా అదృష్టం లేని ఈ చిన్నది ఎవరంటే.?

Published : Oct 14, 2025, 09:45 AM IST

Actress: ఈ చిన్నది తెలుగులో చేసినవి ఎనిమిది చిత్రాలు మాత్రమే.. కానీ అందులో బాక్సాఫీస్ దగ్గర హిట్స్ సాధించినవి కేవలం మూడు మూవీస్. మరిన్ని ఆఫర్స్ రాక ఇప్పుడు వేరే ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఆమె ఎవరంటే.?

PREV
15
అందం ఉన్నా అదృష్టం లేదు..

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త అందాలకు కొదవలేదు. ప్రతీ రెండు చిత్రాలకు ఓ అందం పరిచయమవుతోంది. అయితే ఆ హీరోయిన్ మాత్రం ఫేమస్ అవ్వట్లేదు గానీ.. ఒకట్రెండు చిత్రాలకే మాయమవుతోంది. స్క్రిప్ట్ సెలక్షనో లేక ఆఫర్స్ అందిపుచ్చుకోవాలనే తొందరో తెలియదు గానీ.. వరుసగా అట్టర్ ప్లాప్స్ అందుకుని ఇండస్ట్రీకి దూరమవుతున్నారు. ఆ కోవకు చెందినది ఈ భామ. ఆమె మరెవరో కాదు కృతి శెట్టి.

25
'ఉప్పెన'తో ఎంట్రీ..

మెగా హీరో సరసన తెలుగులోకి పరిచయమైంది హీరోయిన్ కృతి శెట్టి. బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన 'ఉప్పెన' సినిమాలో బేబమ్మగా ప్రేక్షకులను తన నటనతో మెప్పించింది. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ కావడంతో కృతి శెట్టికి వరుసగా ఆఫర్స్ తలుపు తట్టాయి.

35
హిట్స్ మూడు చిత్రాలే..

శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, కస్టడీ, మనమే వంటి చిత్రాల్లో నటించింది కృతి శెట్టి. అయితే ఈ చిత్రాల్లో ఒకట్రెండు మినహా మిగిలినవన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గ ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. అంతకముందు హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన సూపర్ 30 చిత్రంలో ఓ చిన్న రోల్ చేసింది కృతి.

45
ఇండస్ట్రీకి దూరం..

వరుసగా ఫ్లాప్స్ రావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో కృతి శెట్టి మార్కెట్ డల్ అయిపోయింది. ఆమె ఎంచుకున్న వీక్ స్క్రిప్ట్ సెలక్షన్.. తెలుగులో మరే ఆఫర్స్ రాకుండా చేశాయి. దీంతో గతేడాది మలయాళంలో డెబ్యూ ఇచ్చి 'ఆర్మ్' అనే చిత్రంలో నటించింది.

55
తమిళ సినిమాపైనే ఆశలు..

ఇక ఇప్పుడు తమిళనాట కృతి శెట్టి వరుసగా మూడు సినిమాల్లో నటిస్తోంది. కార్తి సరసన 'వా వాథియార్', ప్రదీప్ రంగనాథన్ సరసన 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ', రవి మోహన్ సరసన 'జీని' చిత్రాల్లో నటిస్తోంది. అటు ఇటీవల జీనీ నుంచి విడుదలైన ఓ పాట ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ పాటలో కృతి శెట్టి తన డ్యాన్స్ మూవ్స్‌తో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories