
ప్రతి వారం టీవీ సీరియల్స్, టీవీ షోస్‌కి సంబంధించిన రేటింగ్ వస్తుంటుంది. అందులో భాగంగా తాజాగా తెలుగు టీవీ షోస్, స్పెషల్ ఎపిసోడ్స్ కి సంబంధించిన టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది.
అయితే ఈ సారి అనసూయ, శ్రీముఖిల జోరు వేరే లెవల్‌లో ఉంది. వీరి ముందు యాంకర్ రష్మి షో వెనకబడిపోయింది. మరి ఏ షో టాప్‌లో ఉంది. ఏ షో వెనకబడిపోయిందనేది చూద్దాం.
లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌లో తెలుగు టీవీ షోస్‌లో శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరిస్తున్న `కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్` షో టాప్‌లో ఉంది. ఇది అర్బన్, రూరల్ కలిపి 5.14 రేటింగ్ తెచ్చుకోగా, అర్బన్‌లో 5.8 రేటింగ్ దక్కించుకుని నెంబర్ వన్‌గా ఉంది.
ఇందులో అనసూయ, శేఖర్ మాస్టర్ జడ్జ్ లుగా ఉన్నారు. బాయ్స్, గర్ల్స్ టీమ్‌లకు లీడర్లుగా ఉన్నారు. బుల్లితెర సెలబ్రిటీలు ఇందులో కంటెస్టెంట్లుగా ఉంటారు. వారు చేసే రచ్చ వేరే లెవల్ అని చెప్పొచ్చు. ఇది స్టార్ మాలో రన్ అవుతుంది.
ఇక రెండో స్థానంలో శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరిస్తున్న `ఆదివారం స్టార్ మా పరివారం` ఉండటం విశేషం. శ్రీముఖి హోస్ట్ గా ఉండే ఈ షోలో కూడా టీవీ సెలబ్రిటీలు సందడి చేస్తున్నారు. సీరియల్స్ ఆర్టిస్ట్ లు, జబర్దస్త్ ఆర్టిస్ట్ లు ఇందులో పాల్గొంటారు.
విభిన్నమైన గేమ్స్ తో వీరంతా అలరిస్తుంటారు. ఇందులో హైపర్ ఆది కూడా ఉండటం విశేషం. ఆయన వల్ల ఈ రేటింగ్ ఎక్కువగావస్తుందని చెప్పొచ్చు. ఇది అర్బన్, రూరల్‌లో కలిపి 4.72 రేటింగ్, అర్బన్‌లో 4.52 రేటింగ్ దక్కించుకుంటుంది. ఇది స్టార్ మాలో ప్రసారమవుతుంది.
మూడో స్థానంలో రోజా, దర్శకుడు అనిల్ రావిపూడి జడ్జ్ లుగా ఉన్న `డ్రామా జూనియర్స్` నిలిచింది. చిన్నపిల్లలు పెద్ద వాళ్లలాగా మారి వేసే స్కిట్లు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. సుడిగాలి సుధీర్ హోస్ట్ గా ఉన్న ఈ షోకి అర్బన్, రూరల్ కలిపి 4.32 రేటింగ్ రాగా, అర్బన్‌లో 5.6 రేటింగ్ దక్కించుకుంది.
ఈ షో జీ తెలుగులో రన్ అవుతుంది. నాల్గో స్థానంలో రాత్రి 9కి వచ్చే ఈటీవీ న్యూస్ బులెటిన్ ఉంది. అర్బన్, రూరల్‌లో కలిపి ఇది 3.38 రేటింగ్‌ని సాధించింది. అర్బన్‌లో 2.89 రేటింగ్ సొంతం చేసుకుంది.
ఇక ఐదో స్థానంలో యాంకర్ రష్మి హోస్ట్ గా వ్యవహరిస్తున్న `శ్రీదేవి డ్రామా కంపెనీ` నిలిచింది. దీనికి అర్బన్, రూరల్ కలిపి 3.23 రేటింగ్ రాగా, అర్బన్ మాత్రం 3.38 రేటింగ్ సొంతం చేసుకుంది. ఈ షోలో ఇంద్రజ జడ్జ్ గా వ్యవహరిస్తారు.
ఇందులో జబర్దస్త్ కమెడియన్లు, ఈటీవీ ఆర్టిస్ట్ లు పాల్గొంటారు. ఇందులోనూ హైపర్ ఆది సందడి చేస్తారు. ఆయన కామెడీ వేరే లెవల్ అని చెప్పొచ్చు. ఆరో స్థానంలో జబర్దస్త్ మాజీ కంటెస్టెంట్, హీరో సుడిగాలి సుధీర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న `ఫ్యామిలీ స్టార్స్` నిలవడం విశేషం. ఈటీవీలో ప్రసారమవుతుంది.
ఇందులోనూ టీవీ సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు. సుడిగాలి సుధీర్ డబుల్ మీనింగ్ డైలాగ్‌లకు సెలబ్రిటీల రచ్చ తోడు కావడం ఇది మంచి ఆదరణ పొందుతుంది. ఇది అర్బన్, రూరల్ కలిపి 2.98 రేటింగ్, అర్బన్‌లో 2.43 రేటింగ్ సొంతం చేసుకుంది.
ఏడో స్థానంలో రష్మి గౌతమ్ యాంకర్‌గా వ్యవహరిస్తున్న `జబర్దస్త్` షో నిలిచింది. ఇది అర్బన్, రూరల్‌లో కలిపి 2.01 రేటింగ్, అర్బన్‌లో 2.41 రేటింగ్ సొంతం చేసుకుంది. జబర్దస్త్ కమెడియన్లు కామెడీ స్కిట్లతో చాలా ఏళ్లుగా అలరిస్తూనే ఉన్నారు.
అయితే గతంతో పోల్చితే ఈ షోకి అంతగా ఆదరణ దక్కడం లేదు. దీనికి ఖుష్బూ, శివాజీ జడ్జ్ లుగా ఉన్నారు. ఎనిమిదో స్థానంలో `ఢీ` డాన్స్ లో ఉంది. దీనికి అర్బన్, రూరల్ కలిసి 1.93 రేటింగ్ వచ్చింది. 9వ స్థానంలో ఈటీవీలో మార్నింగ్ 7 గంటలకు వచ్చే న్యూస్ బులెటిన్ నిలిచింది. దీనికి 1.68 రేటింగ్ వచ్చింది.
ఇక పదో స్థానంలో సుమ యాంకర్‌గా వ్యవహరించే `సుమ అడ్డా` షో నిలిచింది. దీనికి అర్బన్, రూరల్ కలిపి 1.40 రేటింగ్ వచ్చింది. ఒకప్పుడు టాప్ యాంకర్‌గా నిలిచింది. టాప్ షోస్‌తోరచ్చ చేసిన సుమ ఇప్పుడు ఇలా డీలా పడిపోవడం ఆశ్చర్యపరుస్తుంది. ఈ మొత్తం అనసూయ, శ్రీముఖిల జోరు వేరే లెవల్ అనేలా ఉందని చెప్పొచ్చు.