`కుబేర` నాలుగు రోజుల రియల్‌ కలెక్షన్లు, సోమవారం డౌన్‌.. నాగార్జున ప్లాన్‌ వర్కౌట్‌ అయినట్టేనా?

Published : Jun 24, 2025, 05:28 PM IST

నాగార్జున, ధనుష్‌, రష్మిక మందన్నా కలిసి నటించిన `కుబేర` మూవీ కలెక్షన్లు సోమవారం డౌన్‌ అయ్యాయి. వీకెండ్‌లో సత్తా చాటిన ఈ చిత్రం సోమవారం తగ్గాయి. మరి ఇంతకి ఇప్పటి వరకు ఎంత వసూలు చేశాయంటే? 

PREV
15
`కుబేర` మూవీ నాలుగు రోజుల కలెక్షన్లు

ధనుష్‌, నాగార్జున, రష్మిక మందన్నా ముఖ్య పాత్రల్లో నటించిన `కుబేర` చిత్రం గత శుక్రవారం విడుదలై ఆకట్టుకుంటోంది. మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రానికి కలెక్షన్లు మాత్రం ఫర్వాలేదనిపిస్తున్నాయి. యావరేజ్‌ టాక్‌ని బట్టే కలెక్షన్లు కూడా యావరేజ్‌గానే ఉన్నాయి.

 చిత్ర బృందం హడావుడి చేస్తున్నా, అవన్నీ ఫేక్‌ కలెక్షన్లని తెలుస్తోంది. ఎగ్జిబిటర్ల నుంచి, ట్రేడ్‌ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీ 60శాతం బిజినెస్‌లో రికవరీ అయినట్టు సమాచారం. ఏదేమైనా సినిమాకి అయిన బిజినెస్‌ని బట్టి చూస్తే ఇవి మంచి కలెక్షన్లే అని చెప్పొచ్చు.

25
`కుబేర` వాస్తవ కలెక్షన్లు ఇవే

తాజాగా `కుబేర` వాస్తవ కలెక్షన్లు బయటకు వచ్చాయి. ఈ చిత్రం నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.65కోట్లు వసూలు చేసింది. ఈ లెక్కన ఇది రూ.38 కోట్ల నెట్‌ రాబట్టింది. `కుబేర` సినిమా థియేట్రికల్‌ బిజినెస్‌ రూ. 63కోట్లు. 

ఇందులో సుమారు అరవై శాతం రాబట్టిందని చెప్పొచ్చు. మరో రూ. 25కోట్లు వస్తే ఈ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ అవుతుంది. కొన్న బయ్యర్లు సేఫ్‌ అవుతారు. అయితే సోమవారం కలెక్షన్లు భారీగా తగ్గిపోయాయి. మండే రోజు కేవలం ఆరున్నర కోట్లు మాత్రమే వచ్చాయి.

అంతేకాదు వీక్‌ డేస్‌లో ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఇదే కొనసాగితే బ్రేక్‌ ఈవెన్‌ కావడం కష్టమనే చెప్పొచ్చు. అయితే ఎలాంటి పోటీ లేకపోతే లాంగ్‌ రన్‌లో రికవరీకి ఛాన్స్ ఉంది. మరి ఏమేరకు సత్తా చాటుతుందో చూడాలి.

35
సేఫ్‌ జోన్‌లో `కుబేర` నిర్మాతలు

`కుబేరా` సినిమాని నిర్మాతలు సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌, శేఖర్‌ కమ్ముల దాదాపు రూ.120కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాకి థియేట్రికల్‌ బిజినెస్‌ రూ. 63కోట్లు కాగా, ఓటీటీ ద్వారా రూ.50కోట్ల వరకు రికవరీ అయినట్టు సమాచారం. 

అమెజాన్‌ ప్రైమ్‌లో ఇది స్ట్రీమింగ్‌ కానుంది. ఇక మ్యూజిక్‌ రైట్స్ ద్వారా కూడా బాగానే వచ్చాయి. ఈ లెక్కన నిర్మాతలు రిలీజ్‌కి ముందే సేఫ్‌లో ఉన్నారు. కానీ కొన్న బయ్యర్లు సేఫ్‌ అవుతారా? లేదా అనేది చూడాలి. 

నిర్మాత సునీల్‌ నారంగ్‌కి నైజాంలో చాలా సొంత థియేటర్లున్నాయి.  ఇది వారికి కలిసొచ్చే అంశం. ఫైనల్‌గా కలెక్షన్లు స్టడీగా ఉంటే, మరో వారం కూడా ఇదే కొనసాగితే ఈజీగానే బయటపడతారు. లేదంటే తక్కువ నష్టాలతో బయటపడే ఛాన్స్ ఉంది. అంతిమంగా మాత్రం `కుబేరా`సేఫ్‌ ప్రాజెక్ట్ కాబోతుందని చెప్పొచ్చు.

45
ధనుష్‌, నాగార్జునల నటనకు ప్రశంసలు

ఇదిలా ఉంటే `కుబేరా` చిత్రానికి సంబంధించి సోషల్‌ మీడియాలో మరో చర్చ నడుస్తుంది. ఇందులో హీరో ఎవరనే చర్చ సినిమా రిలీజ్‌ అయినప్పట్నుంచి వినిపిస్తుంది. అంతా ధనుష్‌ నటన గురించే మాట్లాడుతున్నారు. 

సినిమాకి ఏదైనా పాజిటివ్‌గా ఉందంటే ఆ ఒక్కటి మాత్రమే. అలాగే నాగార్జునకి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇన్నాళ్ల కెరీర్‌లో ఆయన ఎన్నో రకాల చిత్రాలు చేశారు. ప్రయోగాత్మక చిత్రాలు చేశారు. విభిన్నమైన పాత్రలు కూడా పోషించారు. 

అయితే నటుడిగా ఆయన్ని మరో కోణంలో ఆవిష్కరించిన మూవీ `కుబేర` అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలాగే రష్మిక మందన్నా పాత్ర కూడా సర్‌ప్రైజ్‌ చేస్తోంది.

55
నాగార్జున అనుకున్నది సాధించారా?

`కుబేర` మూవీ తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువగా వసూళ్లని రాబడుతుంది. నాగార్జున, శేఖర్‌ కమ్ముల ప్రభావం ఇక్కడ చాలా ఉందని చెప్పొచ్చు. కానీ కోలీవుడ్‌ ఆడియెన్స్ మాత్రం ఈ మూవీని పట్టించుకోవడం లేదు. 

ధనుష్‌ అద్భుతమైన నటన ప్రదర్శించినా, ఆయనకు నేషనల్‌ అవార్డు వస్తుందని చిరంజీవి లాంటి వాళ్లు ప్రశంసించినా అక్కడి ఆడియెన్స్ పెద్దగా కేర్‌ చేయడం లేదు. ఇది ఓ రకంగా ధనుష్‌కి అవమానమనే చెప్పాలి. బేసిక్‌గా తమిళ ఆడియెన్స్ కి భాషాభిమానం ఎక్కువ. 

సొంత భాషలకు చెందిన సినిమాలు తప్ప మిగిలిన సినిమాలను పెద్దగా ఆదరించరు, `బాహుబలి`, `ఆర్‌ఆర్‌ఆర్‌`, `కేజీఎఫ్‌` లాంటి చిత్రాలు తప్ప మరే ఇతర సినిమాలు అక్కడ లేదు. ఇప్పుడు `కుబేరా`లో ధనుష్‌ హీరో అయినా, వాళ్లు దీన్ని తెలుగు సినిమాగానే భావిస్తున్నారని ఈ కలెక్షన్లని బట్టి తెలుస్తోంది. 

ఈ విషయంలో అటు ధనుష్‌ ఫ్యాన్స్ కి, ఇటు నాగార్జున ఫ్యాన్స్ కి మధ్య వార్‌ కూడా నడిచిన విషయం తెలిసిందే. కానీ ఏదేమైనా ఈ మూవీ ధనుష్‌ కంటే నాగార్జునకే ఎక్కువ ప్లస్‌ అవుతుందని తాజా కలెక్షన్లు చెబుతున్నాయి. 

నాగ్‌కి మంచి ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. మరో నలభై ఏళ్లు తనకు తిరుగులేదని ఇటీవల సక్సెస్‌ మీట్‌లో చెప్పారు. అదే నిజం కాబోతుందని తెలుస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories