సమంత - రష్మిక ఇన్స్టాగ్రామ్ లో టాప్ ఎవరు..? ఫాలోయింగ్ లో టాప్ 10 హీరోయిన్స్ వీళ్ళే..?

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్ అత్యధికంగా ఫాలో అవుతున్న టాప్ 10  స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా..? చిత్రం ఏంటంటే.. ఈ లిస్ట్ లో  త్రిష, నయనతార లేకపోవడం.. మరి టాప్ లో ఉన్నది ఎవరో తెలుసా..? 

ఒకప్పుడు సినిమాలు చూసి మాత్రమే హీరో హీరోయిన్లకు ఫ్యాన్స్ గా మారేవారు జనాలు. కాని ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ వచ్చిన తరువాత స్టార్స్ కు .. ఫ్యాన్స్ కు మధ్య దూరం తగ్గిపోయింది. ఏదున్నా నెట్టింట్లో కామెంట్లు, చిట్ చాట్ ల రూపంలో అది తీర్చుకుంటున్నారు. ఈక్రమంలో సోషల్ మీడియాలో పోటీ పెరిగిపోయింది. దాంతో నెట్టింట ఎక్కువ ఫాలోయింగ్ ఉంటే.. ఆ హీరో కాని.. హీరోయిన్ ను కాని.. స్టార్ గా చూడటం స్టార్ట్ చేశారు. ఈక్రమంలో ఇన్ స్టా గ్రామ్ లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.. టాప్ టెన్ లో ఎవరెవరు ఉన్నారో కూడా ఈ లిస్ట్ లో చూద్దాం. 

42 ఏళ్ళ అల్లు అర్జున్ ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటి..? బన్నీ డైట్ లో అది తప్పనిసరి..?

ప్రస్తుతం సౌత్ హీరోయిన్లలో ఇన్ స్టా ఫాలోవర్స్ లో టాప్ టెన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది రష్మిక మదన్నా. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు.. వరుస విజయాలతో దూసుకుపోతోంది రష్మిక మదన్నా. ప్రస్తుతం పుష్ప సీక్వెల్ లో నటిస్తోన్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం  43.9 మిలియన్ల ఫాలోవర్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇక రష్మిక మందన్న తరువాత ప్లేస్ లో ఉంది సమంత. గతంలో టాప్ లో ఉన్న సమంత.. టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోలందరి సరసన మెరిసింది.సమంత 35.3 మిలియన్ల ఫాలోవర్లతో రెండో స్థానంలో ఉంది. నాగచైతన్యతో విడాకులు తరువాత కెరీర్ పై దృష్టి పెట్టిన సమంత.. ఏడాదిపాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. 

నాగచైతన్య ‌‌- శోభిత మధ్య ఏజ్ గ్యాప్ ఎంత..? వీరి ప్రేమ ఎక్కడ మొదలయ్యిందో తెలుసా..?


ఇక సినిమాలు లేకపోయినా.. ఈలిస్ట్ లో మూడో స్థానం సంపాధించింది హీరోయిన్ పూజా హెగ్డే. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ అన్న పేరు తెచ్చకుంది పూజా. వరుసగా డబుల్ హ్యాట్రిక్ ఫెయిల్యూర్స్ తో పాటు.. పూజా రెండు సినిమాలు కమిట్ అయ్యి ఆగిపోయాయి. దాంతో ఆమె అన్ లక్కీ అన్న పేరు పడింది. కాని ఆమె సోషల్ మీడియాలో మాత్రం విజృంబిస్తోంది.ఇన్‌స్టాగ్రామ్‌లో  27.2 మిలియన్ల మంది ఫాలోవర్లుతో మూడో ప్లేస్ లో ఉంది. ఇక నాలుగో స్థానం కైవసం చేసుకుంది మాజీ స్టార్ హీరోయిన్ కాజల్. పెళ్ళి, పిల్లల తరువాత కూడా కాజల్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. రీసెంట్ గా  ఉన్నారు. శంకర్‌-కమల్‌హాసన్‌ల ఇండియన్‌ 3లో కాజల్‌ హీరోయిన్ గా నటించింది. ఆమె 26.9 మిలియన్ల ఫాలోవర్లతో నాలుగో స్థానంలో నిలిచింది

ఇక మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా.. ఇన్ స్టా ఫాలోవర్ల లిస్ట్ లో 5వ స్థానం సంపాదించుకుంది. ఒకప్పుడు టాలీవుడ్ లో జోరు చూపించిన తమ్ము బేబీ.. ఇఫ్పుడు బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకుంటుంది. కాగా ఆమె 25.9 మిలియన్ల ఇన్ స్టా ఫాలోవర్లతో 5వ స్థానంలో ఉంది. తమన్నా తరువాత ఆరోస్థానంలో నిలిచింది హీరోయిన్ శృతీ హాసన్. కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చిన శృతీ.. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా నిలిచింది.  ప్రస్తుతం రజనీకాంత్ కూలీ చిత్రంలో నటిస్తున్న శృతీ హాసన్ . 25.8 మిలియన్ల ఇన్ స్టా  ఫాలోవర్లను కలిగి ఉంది. 
 

ఇక రీసెంట్ గా పెళ్ళి చేసుకున్న స్టార్ హీరోయిన్  రకుల్ ప్రీత్ సింగ్ 23.7 మిలియన్ల ఫాలోవర్లతో 7వ స్థానంలో ఉంది. సినిమాలు లేకపోయినా.. ఆమె ఫాలోయింగ్ మాత్రం ఏం తగ్గలేదు. ఇక ఈలిస్ట్ లో 8వ స్థానంలో నిలిచింది.. పంజాబీ బ్యూటి తాప్సీ పన్ను. టాలీవుడ్ లోకలిసి రాక.. బాలీవుడ్ కు వెళ్ళి.. అక్కడ రాణిస్తుంది తాప్సీ.. బోల్డ్ కామెంట్స్ లో.. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సాధించిన తాప్సీ కి  ఇన్‌స్టాగ్రామ్‌లో 20.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
 

ఇక కీర్తి సురేష్ ఈ లిస్ట్ లో 9వ స్థానం సంపాదించుకుంది. సినిమాలతోపాటు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది కీర్తి సురేష్.  ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు  17.8 మిలియన్ల ఫాలోవర్స్ ఉండటం విశేషం. ఇక టాప్ 10ప్లేస్ లో కూర్చుకుంది మలయాళ ముద్దు గుమ్మ..  అనుపమ పరమేశ్వరన్‌. ఈ మలబారు బ్యూటీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 16.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.  ఈ టాప్ టెన్ లిస్ట్ లో స్టార్ హీరోయిన్లు గా కొనసాగుతున్న నయనతార, త్రిష,  లేకపోవడం ఆశ్చర్యం. 

Latest Videos

click me!