అక్కినేని నాగచైతన్య రెండో వివాహం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నటి శోభిత ధూళిపాళతో ఈ ఉదయం 9.42 గంటలకు నాగార్జున నివాసంలో ఈ జంటకు సింపుల్గా ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ విషయాన్ని చైతన్య తండ్రి, హీరో అక్కినేని నాగార్జున ధ్రువీకరిస్తూ, శోభితను ఎంతో సంతోషంగా తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. "చైతన్య, శోభితలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ రోజు అనంతమైన ప్రేమకు ఆరంభం" అంటూ చైతన్య, శోభిత నిశ్చితార్థం ఫొటోలను ఎక్స్ లో పంచుకున్న నాగార్జున వారిద్దరు జీవితాంతం ప్రేమగా, సంతోషంగా కలకాలం ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.