ఓటీటీలో దుమ్మురేపుతోన్న టాప్ 10 సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే?

Published : Mar 07, 2025, 10:27 AM IST

Top 10 OTT Hits: ఓటీటీలో ఇండియన్ సినిమాలు దుమ్మురేపుతున్నాయి. టాప్  లో కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఓటీటీలో అదరగొట్టిన టాప్ 10 సినిమాలు వెబ్ సిరీస్ ల గురించి చూద్దాం. 

PREV
14
ఓటీటీలో దుమ్మురేపుతోన్న  టాప్ 10 సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే?

Top 10 OTT Hits: కరోనా తర్వాత ఓటీటీలకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఓటీటీల కోసమే సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీస్తున్నారు. థియేటర్లలో చూసేవాళ్ల కన్నా ఓటీటీల్లోనే ఎక్కువ మంది చూస్తున్నారు. అలా ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజైన సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో ఎక్కువ మంది చూసిన వాటి లిస్టును ఓర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది.

Also Read: అల్లు అర్జున్ - స్నేహ రెడ్డి ఆస్తులు ఎన్ని కోట్లు? బన్నీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎక్కడ? ఐకాన్ స్టార్ సీక్రేట్ ఇవే

24
ఏక్ బద్నామ్ ఆశ్రమ్ సీజన్ 3

ఈ లిస్టులో వెబ్ సిరీస్, సినిమాలు ఉన్నాయి. వెబ్ సిరీస్ అయితే కనీసం ఒక్క ఎపిసోడ్ అయినా చూసి ఉండాలి. సినిమా అయితే కనీసం 30 నిమిషాలైనా చూసి ఉండాలి. ఇండియా మొత్తం తీసిన సర్వేలో హిందీ వెబ్ సిరీస్‌లు, సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 2 వరకు తీసిన లిస్ట్ ఇది. 

Also Read: 70 ఏళ్ల వయసులో 29 ఏళ్ల చిన్నఅమ్మాయిని, 4 వ పెళ్లి చేసుకున్న ముసలి నటుడు ఎవరు?

 

34
డబ్బా కార్టెల్

ఇందులో ‘ఏక్ బద్నామ్ ఆశ్రమ్’ సీజన్ 3 అనే హిందీ వెబ్ సిరీస్‌ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్‌లో రిలీజైన ఈ సిరీస్‌ను వారం రోజుల్లో 9.6 మిలియన్ల మంది చూశారు. జియో హాట్‌స్టార్ వెబ్ సిరీస్ ‘ఊప్స్ అప్ క్యా’ రెండో ప్లేస్‌లో ఉంది. దీన్ని 46 లక్షల మంది చూశారు.

సోనీ లివ్ రియాలిటీ షో ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ సీజన్ 4 మూడో ప్లేస్‌లో ఉంది. దీనికి 38 లక్షల వ్యూస్ వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ‘ధూమ్ ధామ్’ సినిమా నాలుగో ప్లేస్‌లో ఉంది. ఈ సినిమాను వారం రోజుల్లో 33 లక్షల మంది చూశారు. హాట్‌స్టార్ ‘పవర్ ఆఫ్ పంచ్’ సినిమా 31 లక్షల వ్యూస్‌తో ఐదో ప్లేస్‌లో ఉంది. 

Also Read:గోల్డెన్ స్పూన్ తో పుట్టిన టాలీవుడ్ రిచ్చెస్ట్ హీరో, స్టార్ డమ్ కు మాత్రం దూరంగా ఉన్న యంగ్ స్టార్ ఎవరు ?

44
దిల్ దోస్తీ ఔర్ డాగ్స్ పోస్టర్

నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘డబ్బా కార్టెల్’ ఆరో ప్లేస్‌లో ఉంది. జ్యోతిక నటించిన ఈ వెబ్ సిరీస్‌ను 26 లక్షల మంది చూశారు. హాట్‌స్టార్‌లో వచ్చిన ‘కౌషల్జీస్ వెర్సెస్ కౌషల్’ సినిమా ఏడో ప్లేస్‌లో ఉంది. దీనికి 25 లక్షల వ్యూస్ వచ్చాయి.

అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ వెబ్ సిరీస్ ‘స్కూల్ ఫ్రెండ్స్ సీజన్ 3’ 22 లక్షల వ్యూస్‌తో ఎనిమిదో ప్లేస్‌లో ఉంది. హాట్‌స్టార్ సినిమా ‘దిల్ దోస్తీ ఓర్ డాగ్స్’ 21 లక్షల వ్యూస్‌తో తొమ్మిదో ప్లేస్‌లో ఉంది. జీ 5 వెబ్ సిరీస్ ‘క్రైమ్ బీట్’ వారం రోజుల్లో 2 మిలియన్ వ్యూస్‌తో పదో ప్లేస్‌లో ఉంది. ఇలా ఓటీటీ కంటెంట్ టాప్ లో దూసుకుపోతూ.. ఆడియన్స్ ను అలరిస్తుంది. 

Also Read: 2500 కోసం రోడ్డు మీద డాన్స్ చేసిన హీరోయిన్, స్టార్ హీరో కూతురికి ఆ పరిస్థితి ఎందుకొచ్చింది?

 

Read more Photos on
click me!

Recommended Stories