ఓటీటీలలో కంటెంట్ ఎప్పటికప్పడు పెరిగిపోతుంది. ఆడియన్స్ నుంచి వస్తున్న డిమాండ్ తో ఓటీటీలు రెచ్చిపోతున్నాయి. తెలుగు సినిమాలకు ఓటీటీల్లో డిమాండ్ భారీగా పెరిగిపోయింది. నెట్ ఫ్లిక్స్ ల్లో టాప్ ప్యూస్ సాధించిన తెలుగు సినిమాలు ఏవో తెలుసా?
నెట్‌ఫ్లిక్స్ లో ఎక్కువ వ్యూస్ సాధించిన తెలుగు సినిమాలు
ఓటీటీలకి ఆడియన్స్ ఎక్కువైపోయారు..ఫ్యామిలీ ఆడియన్స్ అంతా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో సినిమాలు, సిరీస్ లు చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగా కంటెంట్ ను పెంచుకుంటూ వెళ్తున్నాయి ఓటీటీలు. ఏదైనా సినిమా, సిరీస్ రిలీజ్ అయితే... దాన్ని ఎక్కువగా ఆడియన్స్ ఉన్న అన్ని భాషల్లోకి అందుబాటులో ఉంచుతున్నారు. ఈవిషయంలో నెట్‌ఫ్లిక్స్ సంస్థ కాస్త ముందుంది. నెట్‌ఫ్లిక్స్ లో టాప్ ప్యూస్ సాధించిన తెలుగు సినిమాలు ఏమున్నాయంటే?
1) ఆర్ఆర్ఆర్
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా, ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీ స్టారర్ పాన్ ఇండియా మూవీ RRR. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆస్కార్ కూడా సాధించిన ఈ చిత్రానికి సంబంధించిన హిందీ వెర్షన్‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఇండియన్ ఆడియన్స్ తో పాటు పాటు విదేశాల్లో కూడా ఈసినిమాకు మంచి ఆదరణ లభించింది. నెట్‌ఫ్లిక్స్ లో ఈసినిమాను చాలా దేశాల్లో ఆదరించారు. దాంతో ఆర్ఆర్ఆర్ కు నెట్‌ఫ్లిక్స్‌లో 45 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి.
210
2) లక్కీ భాస్కర్
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘లక్కీ భాస్కర్’ సినిమా థియేటర్ల కంటే నెట్‌ఫ్లిక్స్‌లోనే ఎక్కువ విజయాన్ని సాధించింది. 2024లో రిలీజ్ అయిన ఈసినిమా ఇప్పటి వరకూ వరకు 29.5 మిలియన్ వ్యూస్ ను సాధించింది. రీసెంట్‌గా రిలీజ్ అయిన పెద్ద సినిమాలు కూడా ఇంత ఫలితాన్ని సాధించలేకపోయాయి.
310
3) హాయ్ నాన్న
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న సినిమాకు కూడా నెట్‌ఫ్లిక్స్ లో మంచి ఆదరణ లభించింది. ఈసినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా హాయ్ నాన్న సినిమాను ఆడియన్స బాగా ఆదరించారు. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఆడియన్స్ కు ఈ సినిమా బాగా నచ్చింది. నెట్‌ఫ్లిక్స్ లో ఈమూవీకి మొత్తంగా 21 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
చిత్రమైన విషయం ఏంటంటే.. థియేటర్లలో దుమ్మురేపిన పుష్ప2 సినిమా.. చిన్న సినిమాల ఫ్యూస్ ను కూడా సాధించలేకపోయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమా బాక్సాఫీస్ వద్ద 1800 కోట్ల గ్రాస్ వసూళ్లతో సంచలనం సృష్టించింది. థియేటర్లలోనే కాదు, నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఇప్పటి వరకు ఈ సినిమా 20.2 మిలియన్ వ్యూస్ సాధించింది.
510
5) గుంటూరు కారం
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సినిమా థియేటర్లలో యావరేజ్ మూవీగా నిలిచింది. అయితే నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రం ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. నెట్‌ఫ్లిక్స్ రికార్డ్స్ ప్రకారం గుంటూరు కారం సినిమాకు 20.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
610
6) సలార్ ది సీజ్ ఫైర్
ప్రభాస్ నటించిన ‘సలార్’ సినిమా థియేటర్లలో 600 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. చాలా కాలం తరువాత ప్రభాస్ కు హిట్ సినిమా దక్కింది. హిందీ వెర్షన్ లేకుండానే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన సలార్.. 19.1 మిలియన్ వ్యూస్ ను సాధించడం విశేషం.
710
7) దేవర
RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా దేవర. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్లలో కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఆర్ఆర్ఆర్ స్థాయిలో కాకపోయినా.. తారక్ అభిమానులను సంతృప్తి పరిచింది. ఈసినిమాకు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా మంచి స్పందన లభించింది. మొత్తంగా ఈమూవీ 17.8 మిలియన్ వ్యూస్ సాధించింది.
810
8) హిట్ 3
నాని హీరోగా నటించి, నిర్మించిన సినిమా హిట్ 3. ఈ సినిమా థియేటర్లలో యావరేజ్ గా నడిచింది. కానీ , నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రం దుమ్మురేపింది. సైకో థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈసినిమాకు నెట్‌ఫ్లిక్స్ లో సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.14.7 మిలియన్ వ్యూస్ ను నాని సినిమా నమోదుచేసింది.
910
9) సరిపోదా శనివారం
నెట్‌ఫ్లిక్స్ లో తెలుగు సినిమాల లిస్ట్ లో నాని సినిమాలకే ఎక్కువగా ఆదరణ ఉన్నట్టు తెలుస్తోంది. హయ్ నాన్న, హిట్ 3 తరువాత.. నాని నుంచి 2024లో విడుదలైన ‘సరిపోదా శనివారం’ సినిమాకు నెట్‌ఫ్లిక్స్ లో మంచి ఆదరణ లభించింది. నాని కెరీర్‌లో రెండో 100 కోట్ల గ్రాస్ మూవీగా నిలిచిన ఈసినిమా.. నెట్‌ఫ్లిక్స్‌లో 13.9 మిలియన్ వ్యూస్ ను సాధించింది
1010
10) కల్కి 2898 AD
ఇక చివరిగా టాప్ 1 ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ సినిమా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. నెట్‌ఫ్లిక్స్‌లో కేవలం హిందీ వెర్షన్ మాత్రమే విడుదలై, 12.5 మిలియన్ వ్యూస్ సాధించింది.ఇక గత ఏడాది చివర్లో విడుదలైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమాకు 8.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాకు 8.2 మిలియన్ వ్యూస్ రావడం, అదే సమయంలో వాల్తేరు వీరయ్య సినిమాకు కేవలం 7 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి.