
ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో విశ్వక్.. అమూల్య ఫోన్ ఎంతకీ ఎత్తకపోవడంతో వల్లికి ఫోన్ చేస్తాడు. వల్లిని బెదిరించి ఆ ఫోను అమూల్యకు ఇవ్వమని చెబుతాడు. వల్లి హాల్లో నడుచుకుంటూ అమూల్య గది వైపు వెళుతుంటే వేదవతి పిలుస్తుంది. వేదవతి, రామరాజు హాల్లో కూర్చుని ఉంటారు. దాంతో వల్లి గాభరాలో విశ్వ ఫోను కట్ చేస్తుంది. వేదవతి స్టవ్ కట్టేసి రమ్మని వల్లికి చెబుతుంది. ఈ లోపు వల్లికి విశ్వ మళ్లీ ఫోన్ చేస్తాడు. దీంతో వల్లి కంగారుపడుతుంది. మా అమ్మ ఫోన్ చేసింది మాట్లాడి వస్తానని చెబుతుంది. దానికి వేదవతి తన ముందే మాట్లాడమని అంటుంది. రామరాజు వద్దులే దూరంగా వెళ్లి మాట్లాడుకో అని చెబుతాడు. దాంతో వల్లి అమూల్య దగ్గరికి వెళుతుంది. అమూల్య విశ్వక్ తో కోపంగా మాట్లాడుతుంది. ‘ఏమైంది అమూల్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవేంటి.. ఈ రోజు రాత్రి మనం వెళ్ళిపోదాం. అందుకు అన్ని ఏర్పాట్లు చేశాను’ అని అంటాడు.
దాంతో అమూల్య ‘సారీ విశ్వక్ నేను నీతో రాలేను. మా ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధమే చేసుకుంటాను. నన్ను మర్చిపో. ఇంకెప్పుడు ఫోన్ చేయకు’ అని కట్ చేస్తుంది. దానితో ఏమైందోనని గాభరా పడుతూ ఉంటాడు విశ్వక్. వల్లికి మళ్లీ ఫోన్ చేస్తాడు. అమూల్య కోపంగా ఇంకెప్పుడూ విశ్వక్ నాకోసం ఫోన్ చేసినా ఫోన్ ఇవ్వకు, ఇక వెళ్ళు అని వల్లితో అంటుంది. దాంతో వల్లి ఫోన్ పట్టుకొని వెళ్ళిపోతుంది. లాస్ట్ మినిట్లో ఇలాంటి షాక్ ఇచ్చిందేంటి? ఏం చేసినా సరే దీన్ని రాత్రికి ఎత్తుకెళ్లి పోవాలి కానీ ఎలా? అని ఆలోచిస్తూ ఉంటాడు విశ్వక్.
ఇక్కడ నుంచి సీన్ ధీరజ్, ప్రేమ దగ్గరికి మారుతుంది. ధీరజ్ కార్ డ్రైవ్ చేస్తుంటే ప్రేమ పాటలు పెట్టి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ‘నేను నీ పక్కన లేకపోతే నీ పరిస్థితి ఏంటి? నేను నీ పక్కన లేకపోతే ఎంగేజ్మెంట్ రింగ్ సెలెక్ట్ చేయలేకపోయే వాడివి. ఇప్పుడు శుభలేఖలు కూడా సెలెక్ట్ చేసేందుకు నేనే రావాల్సి వస్తోంది. నేను లేకపోతే నువ్వెలా బతుకుతావో’ అని అంటుంది ప్రేమ. ఇద్దరూ కాసేపు కారులోనే గొడవలు పెట్టుకుని తిట్టుకుంటారు. ఈలోపు ప్రేమ తన బ్యాగులో ఫోన్ లేదన్న విషయం చూస్తుంది. దాన్ని ధీరజ్ తీసి దాస్తాడు. దానికి మావయ్య గారికి ఫోన్ చేస్తానని ప్రేమ బెదిరిస్తుండడంతో ఇలా ఫోన్ దాచేసినట్టు చెబుతాడు. చివరికి ప్రేమ ఫోన్ ప్రేమకు ఇచ్చేస్తాడు.
ఇక ఇక్కడి నుంచి సీన్.. సేనాపతి ఇంటికి మారుతుంది. విశ్వక్ చాలా కోపంగా ఉండడాన్ని భద్రావతి చూస్తుంది. అమూల్య చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకొని విశ్వక్ చాలా కోపంగా ఉంటాడు. భద్రావతి వచ్చి ఏమైందని అడుగుతుంది. ‘అమూల్య నా చేతి నుంచి పూర్తిగా జారిపోయింది. నా కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళనే కాదు.. ఆ దేవున్ని కూడా ఎదిరించేలా మాయ చేసాను. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు దాని మనసును పూర్తిగా మార్చేశారు. వాళ్ళ నాన్న చూసిన సంబంధాన్ని చేసుకుంటానని ఇంకెప్పుడూ నాకు ఫోన్ చేయొద్దని తేల్చి చెప్పేసింది.అమూల్యను అడ్డుపెట్టుకొని ఆ రామరాజు మీద పగ తీర్చుకునేలా చేస్తానని నీకు మాటిచ్చాను. కానీ ఆ మాట నిలబెట్టుకోలేకపోతున్నాను. నన్ను క్షమించు అత్తా’ అని భద్రావతితో అంటాడు.
కానీ భద్రావతి మాట్లాడుతూ పెళ్లికి ఇంకా ఒకరోజు టైమ్ ఉంది. అంటే 24 గంటలు. ఒక్క నిమిషంలోనే ఓడలు బళ్లవుతాయి...మనకి 24 గంటల సమయం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా చేయాలన్నది ఆలోచించాలి. కానీ ఇంకేం చేయలేము అని నీరసపడకూడదు. ప్లాన్ ఏ మిస్ అయితే ప్లాన్ బి ఉంది కదా.. అది చేద్దాం’ అని చెబుతుంది భద్రావతి. ఆ ప్లాన్ బి ఏంటో వాళ్లిద్దరూ మాట్లాడుకుంటారు. కానీ ప్రేక్షకులకు మాత్రం అప్పుడే తెలియనివ్వరు. భద్రావతి చెప్పిన ప్లాన్ విశ్వక్ కు చాలా నచ్చుతుంది. ఆ పని చేసేందుకు సిద్ధమవుతాడు.
ఇక ఇక్కడి నుంచి సీన్ ఇడ్లీ బాబాయ్ దగ్గరికి మారుతుంది. ఇడ్లీ బాబాయ్ కాసేపు డాన్సులు వేస్తాడు. ఇడ్లీ రవ్వ తెచ్చేందుకు ఇడ్లీ బాబాయ్ వెళుతూ ఉంటాడు. ఈ లోపు కారులో ముగ్గురు బౌన్సర్లు దిగి ఇడ్లీ బాబాయ్ ను ఫాలో అవుతూ ఉంటారు. వాళ్లని చూసి తన కూతురు సెక్యూరిటీ కోసం పెట్టిందని అనుకుంటాడు ఇడ్లీ బాబాయ్. ఇంటికి వచ్చాక భాగ్యంతో జరిగింది చెబుతాడు. కానీ భాగ్యం మాత్రం వాళ్ళని చూసి అనుమానిస్తుంది. ఈలోపు ఆ బౌన్సర్లు ఇడ్లీ బాబాయ్ ను కిడ్నాప్ చేసి కారెక్కించి తీసుకెళ్లి పోతూ ఉంటారు. ఆ కారు వెంట భాగ్యం పరిగెత్తుకుంటూ వస్తుంది. కానీ వాళ్ళు ఆగకుండా వెళ్ళిపోతారు.
ప్రేమ, ధీరజ్ కలిసి శుభలేఖల కోసం షాప్ కి వస్తారు. ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చక కాసేపు గొడవపడతారు. చివరికి ఆ షాపులో ఉన్న శుభలేఖలు అన్ని పడేస్తూ ఉంటారు. చివరికి ఒక శుభలేఖ వారి ఇద్దరికీ చాలా బాగా నచ్చుతుంది. చివరికి ఆ శుభలేఖకు ఓకే చెబుతారు. వీరిద్దరి పేరుతో ఒక కార్డును క్రియేట్ చేసి ఉదాహరణగా చూపిస్తాడు షాపు ఓనర్. అది చూసి ప్రేమ ఊహల్లో తేలిపోతుంది. ఇక్కడతో ఎపిసోడ్ ముగిసిపోతుంది.