మన శంకర వరప్రసాద్ గారు మూవీపై కొరటాల శివ ఫస్ట్ రియాక్షన్..హిట్ టాక్ రాగానే ఆచార్య డైరెక్టర్ ఏమన్నారంటే

Published : Jan 23, 2026, 11:11 AM IST

మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమాపై కొరటాల శివ స్పందించారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో కొరటాల ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
మన శంకర వరప్రసాద్ గారు 

మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం మెగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. చిరంజీవి వింటేజ్ స్క్రీన్ ప్రెజెన్స్, అనిల్ రావిపూడి మ్యాజిక్ బాగా వర్కౌట్ అయ్యాయి. దీనితో ఈ చిత్రం 300 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రాన్ని చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల, సాహు గారపాటి కలసి నిర్మించారు. చాలా ఏళ్ళ తర్వాత చిరంజీవి తన స్టైల్ స్వాగ్, కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో చూపించారు. దీనితో తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్ మొదలైంది. 

25
ఇండస్ట్రీ ప్రముఖుల ప్రశంసలు

దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్ర సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. మన శంకర వరప్రసాద్ చిత్రానికి హిట్ టాక్ రాగానే ఇండస్ట్రీ నుంచి తన ఫోన్ కాల్స్, మెసేజ్ లు చేసిన హీరోలు దర్శకుల గురించి అనిల్ రావిపూడి తెలిపారు.

35
ఫస్ట్ మెసేజ్ హీరో నితిన్ నుంచి 

తనకి మొట్ట మొదటగా హీరో నితిన్ మెసేజ్ చేశారు అని అనిల్ అన్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్,అందులో అనుమానం లేదు.. ఎక్కడికి వెళ్లి ఆగుతుందో చూడాలి అని నితిన్ అన్నారు. ఆ తర్వాత కిరణ్ అబ్బవరం, మనోజ్, నిఖిల్, విజయ్ దేవరకొండ లాంటి వారంతా మెసేజ్ చేసి కంగ్రాట్స్ తెలిపారు అని అనిల్ అన్నారు. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. మేము చాలా సేపు సినిమా గురించి మాట్లాడుకున్నాం. 

45
చిరంజీవి మూవీపై కొరటాల శివ ఫస్ట్ రియాక్షన్ 

రాంచరణ్ గారు ఎలాగూ పర్సనల్ గా కలిసి సినిమా చూశారు. అదే విధంగా టాప్ డైరెక్టర్స్ అందరూ నాతో మాట్లాడారు. వివి వినాయక్ గారు, సుకుమార్ గారు ఫోన్ చేసి మాట్లాడినట్లు అనిల్ రావిపూడి తెలిపారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఆచార్య డైరెక్టర్ కొరటాల శివ కూడా అనిల్ రావిపూడికి ఫోన్ చేశారట. మన శంకర వరప్రసాద్ గారు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో కొరటాల శివ చాలా సంతోషించారు అని.. నన్ను తన బ్రదర్ లాగా భావించి కంగ్రాట్స్ చెప్పారు అని అనిల్ రావిపూడి తెలిపారు. 

55
అల్లు అర్జున్ రివ్యూ 

అల్లు అర్జున్ ఫోన్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన ఒక్కో సీన్ ఎంత అద్భుతంగా ఉందో వివరించారు. ముఖ్యంగా అత్తాకోడళ్ల మధ్య వచ్చే సీన్ తో నీ రైటింగ్ ప్రతిభ ఏంటో అర్థం అయింది అని.. అసలు నీ నుంచి ఇలాంటి సినిమా ఊహించలేదు అని అల్లు అర్జున్ తెలిపారు.  

Read more Photos on
click me!

Recommended Stories