డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం 'లోకా చాప్టర్ 1' ఇంకా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. కళ్యాణి ప్రియదర్శన్, నస్లేన్, శాండీ మాస్టర్ నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 249 కోట్లు వసూలు చేసింది. స్టార్ హీరోలు, భారీ బడ్జెట్ లేకుండానే.. ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా ఈ రేంజ్ లో దూసుకుపోవడం అందరికి ఆశ్చర్యపరుస్తోంది.