చిన్న సినిమాలకు ఫిదా అయిపోతున్నారు పెద్ద హీరోలు. తమ మనసును తాకాయంటు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా లిటిల్ హార్ట్స్ టీమ్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు సర్ ప్రైజ్ ఇచ్చాడు.
ఈమధ్య కాలంలో చిన్న సినిమాలు సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. కంటెంట్ ఉంటే చాలు అద్భుతం చేయవచ్చు అని నిరూపిస్తున్నాయి చిన్న సినిమాలు. అంతే కాదు పెద్ద పెద్ద దర్శకులు, స్టార్ హీరోల మనసు దోచుకుంటున్నాయి చిన్న మూవీస్. ఈ క్రమంలో రీసెంట్ గా వచ్చి లిటిల్ హార్ట్స్ మూవీకి కూడా ఇదే రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు.
26
సంచలన విజయం
చిన్న బడ్జెట్‌తో రూపొందిన ‘లిటిల్ హార్ట్స్’ సినిమా టాలీవుడ్‌లో సంచలన విజయం సాధిస్తూ, పెద్ద సినిమాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. కేవలం ర2.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, రిలీజ్ అయిన పదిరోజుల్లోనే 32 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా, ఈ విజయంపై తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇచ్చిన సర్ ప్రైజింగ్ రెస్పాన్స్ కు మూవీ టీమ్ ఉబ్బితబ్బిబ్బు అయిపోతున్నారు.
36
మహేశ్ బాబు స్పందన
సూపర్ స్టార్ మహేశ్ బాబు సోషల్ మీడియా వేదికగా ‘లిటిల్ హార్ట్స్’ సినిమాపై స్పందిస్తూ, “సినిమా చాలా సరదాగా, కొత్తగా, అద్భుతంగా ఉంది. నటీనటులందరూ అద్భుతంగా నటించారు” అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా చిత్ర సంగీత దర్శకుడు సింజిత్ ఎర్రమల్లి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం.
ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో సింజిత్ మాట్లాడుతూ, “నా దేవుడు మహేశ్ అన్న మా సినిమాపై ఒక్క ట్వీట్ చేస్తే చాలు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వారం రోజులు ఎక్కడికైనా వెళ్లిపోతాను” అని అన్న సంగతి మహేష్ బాబు వరకూ వెళ్లింది. దీనిపై ఆయన స్పందిస్తూ, “సింజిత్, ఫోన్ ఆఫ్ చేసి ఎక్కడికీ వెళ్లకు బ్రదర్. నీకు ముందు చాలా బిజీ రోజులు వస్తాయి. రాకింగ్ చేస్తూ ఉండాలి. మొత్తం టీంకి నా అభినందనలు” అంటూ ప్రేమతో, స్మైలీ ఎమోజీలతో కూడిన మెసేజ్‌ను పోస్టు చేశారు.
56
ఊహించిన దాని కంటే చాలా ఎక్కువ
ఈ ట్వీట్‌తో సింజిత్ ఉబ్బితబ్బిబ్బయ్యారు. మహేష్ బాబుకు బదులుగా, “నేను ఎక్కడికీ వెళ్లను మహేష్ అన్నా” అని ట్వీట్ చేస్తూ, ‘గుంటూరు కారం’ సినిమాలో మహేశ్ డ్యాన్స్ చేస్తున్న వీడియోను సృష్టించి పోస్ట్ చేశారు. ఇది అభిమానుల మనసులను గెలుచుకుంది. చిత్ర దర్శకుడు సాయి మార్తాండ్ కూడా మహేష్ బాబుకు థ్యాంక్స్ చెబుతూ, “ఇది ఊహించిన దాని కంటే చాలా ఎక్కువ” అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
66
స్టార్ హీరోల ప్రశంసలు
ఇప్పటికే ఈ సినిమాపై అల్లు అర్జున్, రవితేజ, నాని, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా మహేశ్ బాబు ఇచ్చిన ఈ ప్రశంసలు సినిమాకు మరింత ప్రచారం తీసుకొచ్చాయి. చిన్న సినిమాలకు ఓ ప్రేరణగా నిలుస్తున్న ‘లిటిల్ హార్ట్స్’ ఇప్పుడు టాలీవుడ్ లో దూసుకుపోతోంది.