Narendra Modi Birthday: భారత ప్రధాని నరేంద్ర మోదీకి అక్కినేని నాగార్జున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాగార్జున కొన్ని ఆసక్తికర విషయాలు రివీల్ చేశారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు సెప్టెంబర్ 17 బుధవారం రోజు తన 75 వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దేశం మొత్తం సినీ రాజకీయ ప్రముఖులు ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా మోదీకి బర్త్ డే విషెస్ అందుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీతో సాన్నిహిత్యం ఉన్న టాలీవుడ్ హీరోలలో అక్కినేని నాగార్జున ఒకరు. నాగార్జున సందర్భం వచ్చిన ప్రతిసారి మోదీ గురించి మంచి విషయాలు చెబుతుంటారు.
25
మోదీకి నాగార్జున బర్త్ డే విషెస్
మోదీ బర్త్ డే సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు చెబుతూ నాగార్జున సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు ఈ వీడియోలో నాగార్జున తాను తొలిసారి మోదీని ఎప్పుడు ఎలా కలిసింది ? మోదీతో తన సాన్నిహిత్యం ఎలాంటిది ? లాంటి విషయాలని రివీల్ చేశారు.
35
2014లో తొలిసారి మోదీని కలిసిన నాగార్జున
నాగార్జున మాట్లాడుతూ 2014లో తాను తొలిసారి మోదీని గాంధీనగర్ లో మీట్ అయినట్లు తెలిపారు. ఆయనకి నేను పెద్ద అభిమానిని. గుజరాత్ ని ఎంతగా అభివృద్ధి చేశారో అప్పుడే తెలుసుకున్నాను. మోదీని కలవడానికి పిలుపు వచ్చినప్పుడు చాలా సంతోషించాను. ఆయన నా గురించి చెప్పిన ఒక విషయం విని ఆశ్చర్యపోయాను. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కొంతమంది మిమ్మల్ని మైసూరులో కలిశారు అని మోదీ అన్నారు. సౌత్ స్టార్ నాగార్జునని మీట్ అయినట్లు వాళ్ళు నాతో చెప్పారు.
ఫ్యామిలీ లో చిన్న పిల్లలు మీతో ఫోటో కావాలని అడిగారు. వాళ్ళు మీకు ఎవరో తెలియనప్పటికీ, మీ చుట్టూ సెక్యూటిరీ ఉన్నప్పటికీ ఎంతో వినయంగా ఫోటో అవకాశం ఇచ్చారని తెలిపారు. వాళ్ళ మాటల్లో మీ మంచితనం తెలుసుకున్నాను. అదే వినయం ఎప్పుడూ కొనసాగించండి. మనిషికి కావలసింది అదే అని మోదీ నాతో అన్నారు. మన్ కీ బాత్ లో మోదీ గారు మా నాన్న ఏఎన్నార్ గారి గురించి చెప్పినట్లు చాలా సంతోషంగా అనిపించింది.
55
మరోసారి ఈ దేశానికి మోదీ అవసరం ఉంది
మోదీ గారు మరోసారి ఈ దేశానికి సేవలందించాలి. దేశం కోసం మోదీ తన పర్సనల్ లైఫ్ లో ఎన్నో త్యాగాలు చేశారు. ఇండియాని గొప్ప దేశంగా తీర్చి దిద్దడమే మోదీగారి లక్ష్యం అని నాగార్జున అన్నారు. ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు అని నాగార్జున తెలిపారు.