Top 10 Heroines: పడిపోయిన రష్మిక, దీపికా దుమ్ములేపిన నయనతార, త్రిష.. ఇండియాలో నెంబర్‌ 1 ఈమెనే

Published : Feb 21, 2026, 07:22 AM IST

జనవరి నెలకు సంబంధించి ఇండియా మోస్ట్ పాపులర్‌ టాప్‌ 10 హీరోయిన్ల జాబితాని ఓర్మాక్స్ మీడియా ప్రకటించింది. ఈ సారి రష్మిక మందన్నా, దీపికా పదుకొనె పడిపోవడం ఆశ్చర్యపరిస్తే, నయనతార, త్రిష మాత్రం దుమ్ములేపారు. 

PREV
110
ఇండియా టాప్‌ 10 హీరోయిన్లు

ప్రతి నెల ఇండియాలోని హీరోలు, హీరోయిన్లకి సంబంధించిన టాప్‌ 10 జాబితాని ఓర్మాక్స్ మీడియా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. జనవరి నెలకు సంబంధించిన లిస్ట్ వచ్చింది. ఇందులో నయనతార, త్రిష దుమ్ములేపారు. ఊహించిన విధంగా వాళ్లు టాప్‌లోకి వచ్చారు. అలాగే ఎప్పుడూ టాప్‌లో ఉండే దీపికా పదుకొనె పడిపోయింది. రష్మిక మందన్నా సైతం డౌన్‌ అయ్యింది. ఇక అనుష్క అడ్రస్సే లేదు. తమన్నా లిస్ట్ లోకి రావడం విశేషం. టాప్‌ 10 లిస్ట్ చూద్దాం.

210
నెంబర్‌ 1 సమంత

ఓర్మాక్స్ మీడియా ప్రకటిస్తున్న ఇండియా మోస్ట్ పాపులర్‌ హీరోయిన్ల జాబితాలో సమంత టాప్‌ 1లోనే ఉంటుంది. ఆమెని కొట్టే హీరోయిన్‌  రావడం లేదు. చాలా నెలలుగా ఆమె మొదటి స్థానాన్ని ఫిక్స్ చేసుకుంది. దుమ్ములేపుతుంది. సమంత ఇప్పుడు `మా ఇంటి బంగారం` మూవీతో రాబోతుంది.

310
నెంబర్‌ 2 అలియా, నెంబర్‌ 3 నయనతార

బాలీవుడ్‌ హీరోయిన్‌ అలియాభట్‌ రెండో స్థానంలో నిలిచింది. ఈ అమ్మడు కూడా చాలా నెలలుగా టాప్‌ 2లో ఉంటుంది. ఈ సారి కూడా రెండో స్థానంలో నిలిచింది. ఇక మూడో స్థానంలో నయనతార ఉంది. ఆమె ఒక్కసారిగా టాప్‌లోకి దూసుకురావడం విశేషం. డిసెంబర్లో నయన్‌ ఐదో స్థానంలో ఉండగా, రెండు స్థానాలు పెరిగి, మూడో స్థానంలోకి వచ్చింది. జనవరిలో `మన శంకరవర ప్రసాద్‌ గారు` మూవీలో నటించింది నయన్‌. ఇది పెద్ద హిట్‌ కావడంతో ఆమె క్రేజ్‌ పెరిగిపోయింది.

410
నెంబర్‌ 4 త్రిష

నాల్గో స్థానంలోకి త్రిష వచ్చింది. ఆమె డిసెంబర్‌లో ఏడో స్థానంలో ఉండగా, ఇప్పుడు జనవరి నెలకు మూడు స్థానాలు మెరుగుపడి నాల్గో స్థానంలోకి వచ్చింది. విజయ్‌ తో ఎఫైర్స్ రూమర్‌ విషయంలో త్రిష చర్చల్లో నిలిచింది. 

510
నెంబర్‌ 5 రష్మిక మందన్నా

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ఊహించని విధంగా పడిపోయింది. డిసెంబర్‌ లో మూడో స్థానంలో ఉండగా, జనవరి నెలలో ఐదో స్థానానికి పడిపోవడం ఆశ్చర్యపరుస్తుంది. త్వరలో రష్మిక విజయ్‌ దేవరకొండని మ్యారేజ్‌ చేసుకోబోతుంది. అలాగే లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలతో రాబోతుంది.

610
నెంబర్‌ 6 కాజల్‌

కాజల్‌ మాత్రం ఆరో స్థానంలో సెటిల్‌ అయ్యింది. కాజల్‌కి చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. గతేడాది `కన్నప్ప`లో మెరిసింది. ఇప్పుడు అంత క్రేజ్‌ కూడా లేదు. కాకపోతే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. కమర్షియల్‌ యాడ్స్ తో మెరుస్తూ అందరిని ఆకట్టుకుంటుంది.

710
నెంబర్‌ 7 దీపికా పదుకొనె

దీపికా పదుకొనె ఏడో స్థానానికి పడిపోయింది. లాస్ట్ టైమ్‌ వచ్చిన లిస్ట్ లో ఆమె నాల్గో స్థానంలో ఉండగా, ఇప్పుడు ఏడో స్థానానికి పడిపోవడం ఆశ్చర్యపరుస్తుంది. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్‌తో అట్లీ మూవీలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

810
నెంబర్‌ 8 సాయిపల్లవి

సాయిపల్లవి ఎనిమిదో స్థానంలో నిలిచింది. గత రెండు మూడు నెలలుగా సాయిపల్లవి స్థానం సేమ్‌ ఉంటుంది. ప్రస్తుతం సాయిపల్లవి బాలీవుడ్‌ లో `రామాయణ్‌`లో నటిస్తుంది. మరో బాలీవుడ్‌ మూవీ చేస్తుంది. తమిళంలో ధనుష్‌తో ఓ సినిమా చేస్తుంది.

910
నెంబర్‌ 9 శ్రీలీలా

శ్రీలీల తొమ్మిదో స్థానంలో ఉంది. డిసెంబర్‌లో పదో స్థానంలో ఉండగా ఇప్పుడు ఒక స్థానం మెరుగుపడింది. ప్రస్తుతం ఆమె పవన్‌ కళ్యాణ్‌ తో `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`లో నటిస్తోంది. వచ్చే నెలలో ఇది రిలీజ్‌ కానుంది.

1010
నెంబర్‌ 10 తమన్నా

ఇక పదో స్థానంలో తమన్నా ఉంది. మొదటిసారి తమన్నా ఈ లిస్ట్ లోకి రావడం విశేషం. గతంలో అనుష్క ఈ స్థానంలో ఉండగా, ఆమె పడిపోయింది. అసలు అడ్రస్సే లేదు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories