Nilave Movie Collections: బాక్సాఫీసు వద్ద నిలవే సినిమా రచ్చ.. రూ.11కే టికెట్‌.. టీమ్‌ బంపర్‌ ఆఫర్‌

Published : Feb 20, 2026, 11:12 PM IST

Nilave Movie Collections: యంగ్‌ టీమ్‌ కలిసి రూపొందించిన చిత్రం `నిలవే`. ఈ మూవీ గత వారం ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలయ్యింది. డీసెంట్‌ కలెక్షన్లతో దూసుకుపోతుంది. దీంతో టీమ్‌ సంతోషం వ్యక్తం చేసింది. 

PREV
14
`నిలవే` మూవీకి పాజిటివ్‌ టాక్‌

గత వారం ఆడియెన్స్ ముందుకు వచ్చిన లవ్‌ స్టోరీ `నిలవే`. `ఫంకీ`, `కపుల్‌ ఫ్రెండ్లీ`కి పోటీగా ఈ చిత్రం వచ్చింది. విమర్శకుల ప్రశంసలందుకుంది. కొత్త టీమ్‌ రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కూడా మంచి ఆదరణ రాబట్టుకుంటోంది. డీసెంట్‌ వసూళ్లతో రచ్చ చేస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ ప్రీమియర్స్ తో మంచి బజ్‌ని ఏర్పర్చుకుంది. అది వసూళ్లకి హెల్ప్ అయ్యింది.  

24
వారంలో కోటీకిపైగా వసూళ్లు, థియేటర్ల పెంపు

`నిలవే` మూవీలో సౌమిత్‌ పోలాడి హీరోగా నటించగా, శ్రేయాసి సేన్‌ హీరోయిన్‌గా నటించింది. సౌమిత్‌, సాయి కే వెన్నం సంయుక్తంగా దర్శకత్వం వహించారు. POV ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం నిర్మించారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ నెల 13న ఈ చిత్రం విడుదలైంది. వారం రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి  కోటీకిపైగా గ్రాస్‌ వసూలు చేసింది. రూ.65 లక్షల షేర్‌ వచ్చిందట.  సుమారు రెండు కోట్లతో రూపొందిన ఈ మూవీకి ఈ రేంజ్‌లో వసూళ్లు రావడం విశేషం. అంతేకాదు ఇప్పుడు థియేటర్లు పెరిగాయి. మొదటి వారం 60థియేటర్లలో విడుదలయితే, రెండో వారం 75 థియేటర్లు పెరగడం విశేషం. ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్ పెరుగుతుందనేదానికి ఇది నిదర్శనంగా చెప్పొచ్చు. 

34
రూ.11కే టికెట్‌.. నిలవే టీమ్‌ బంపర్‌ ఆఫర్‌

ఈ క్రమంలో చిత్ర బృందం మంచి ఆఫర్‌ ప్రకటించింది. ఈ శనివారం రూ.11 కే టికెట్‌ అని ప్రకటించింది. 11 పాటలు, 11 ఎమోషన్స్ ఉన్నాయని చెప్పి, పదకొండు రూపాయలకే టికెట్‌ని ప్రకటించారు. దీంతో హౌజ్‌ ఫుల్‌ నడుస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది. 

ఇక సినిమాకి వస్తోన్న స్పందనపై హీరో సౌమిత్‌ మాట్లాడుతూ, `కొత్త వాళ్లమైనా మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మూడేళ్ల కష్టమే ఈ సినిమా. రాజమౌళి కూడా ‘బాహుబలి’ని ఆడియెన్స్ ముందుకు తీసుకురావడానికి మూడేళ్లు పట్టింది. మా ‘నిలవే’ మాకు ‘బాహుబలి’ లాంటిది. ఈ జర్నీలో మాకెన్ని ఇబ్బందులొచ్చినా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ముందుకెళ్లాం. ఇప్పుడు ఆడియెన్స్ నుంచి వస్తోన్న రెస్పాన్స్ చాలా సంతోషాన్ని ఇస్తుంది. జెన్యూన్‌ హిట్‌గా మా చిత్రం నిలిచింది. నాలుగు రోజులుగా ఆడియెన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్, హౌస్‌ఫుల్ బోర్డ్స్‌ చూసి సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం` అని చెప్పారు.

44
`నిలవే` సినిమాపై టీమ్‌ రియాక్షన్‌

దర్శకుడు సాయి కే వెన్నం మాట్లాడుతూ, `మమ్మల్ని బ్లెస్ చేసిన అందరికీ థ్యాంక్స్. మూడేళ్ల క్రితం మొదలైన ఈ జర్నీ ఇక్కడవరకు వచ్చింది. ఈ మూవీ మేకింగ్‌లో చాలా విషయాలు నేర్చుకున్నా. మన ఇంటెన్షన్ ప్యూర్‌‌గా ఉంటే అన్నీ నెరవేరుతాయి అనేది ఈ చిత్రంతో తెలుసుకున్నాను. సినిమా ఎందుకు తీయాలనే కారణం తెలుసుకుంటే అన్ని బాగుంటాయని కొత్తగా వచ్చే మేకర్స్‌కు చెప్పగలను. మా కారణం గట్టిగా ఉంది కాబట్టే ఇక్కడవరకు వచ్చాం. టీమ్ అందరి సపోర్ట్‌తోనే సక్సెస్‌ వచ్చింది` అని వెల్లడించారు.

నిర్మాత రాజ్ అల్లాడ భార్య మాధూరి మాట్లాడుతూ, `మా సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కడం చాలా ఆనందంగా ఉంది. సినిమా చూసిన వారంతా కొత్త వాళ్లు తీసినట్టు లేదని చెబుతున్నారు. ముఖ్యంగా మ్యూజిక్‌ మా మూవీకి మరింత ప్లస్ అయ్యింది. అందరి మనసుకు హత్తుకునేలా మా చిత్రం ఉంటుంది` అని చెప్పారు. మరో నిర్మాత రాజ్ అల్లాడ మాట్లాడుతూ, మంచి స్పందన వచ్చింది. చక్కటి మ్యూజికల్ లవ్ స్టోరీ. కొత్తవారైనా అందరూ బాగా నటించారు. హీరో కమ్ దర్శకుడు కూడా పాత్రలో లీనమై మురిపించాడు. ఇందులో నటించిన నటీనటులకు, సాంకేతితిక సిబ్బంది పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నా` అని తెలిపారు. అతిథిగా హాజరైన దర్శకులు వి సముద్ర మాట్లాడుతూ, ‘ఈ వాలెంటైన్స్ డేకి విడుదలైన ఆరేడు చిత్రాల్లో ‘నిలవే’ సక్సెస్‌ఫుల్ టాక్ తెచ్చుకుంది. డీసెంట్ కలెక్షన్స్‌తో సైలెంట్ హిట్‌గా నిలిచింది. ఇందులోని హీరో హీరోయిన్ భవిష్యత్తులో కచ్చితంగా సూపర్ స్టార్స్ అవుతారు` అని చెప్పారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories