ఏఐ ప్రకారం టాలీవుడ్ లో టాప్ 5 హీరోయిన్ల లిస్ట్ ఈ విధంగా ఉంది. నెంబర్ 1 హీరోయిన్ ఎవరు ? సమంత, రష్మిక లాంటి హీరోయిన్లు ఏ స్థానంలో ఉన్నారో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి.
ప్రముఖ ఏఐ చాట్ బోట్లు చాట్ జిపిటి, గ్రోక్, జెమినీ ఏఐ తెలుగులో ప్రభాస్ నెంబర్ 1 హీరో అని తేల్చేశాయి. టాప్ 5 లో మహేష్, అల్లు అర్జున్, రాంచరణ్, ఎన్టీఆర్ ఉన్నట్లు ఏఐ తేల్చేసింది. ఇప్పుడు టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ ఎవరు ? టాప్ 5 లో ఉండే హీరోయిన్లు ఎవరు ? అనే దానిపై చర్చ మొదలైంది. దీనికి కూడా ఏఐ ద్వారా సమాధానం దొరికేసింది. టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ రష్మిక మందన్న అని చాట్ జిపిటీ, జెమిని ఏఐ తేల్చేశాయి. గ్రోక్ మాత్రం ఊహించని విధంగా సమంత నెంబర్ 1 అని పేర్కొంది. గత కొంత కాలంగా సమంతకి టాలీవుడ్ లో సినిమాలే లేవు.
27
టాప్ 5 హీరోయిన్ల లిస్ట్
ఏఐ ప్రకారం టాలీవుడ్ లో టాప్ 5 హీరోయిన్ల లిస్ట్ ఇదే:
1. రష్మిక మందన్న
2.సాయి పల్లవి
3. శ్రీలీల
4. పూజా హెగ్డే
5. మీనాక్షి చౌదరి
ఇది చాట్ జీపీటీ ప్రకారం టాప్ 5 లిస్ట్. జెమినీ ఏఐ ప్రకారం మీనాక్షి చౌదరికి టాప్ 5 లో చోటు లభించలేదు. ఆమెకి బదులుగా రెండవ స్థానంలో సమంత పేరుని ప్రకటించింది. గ్రోక్ అయితే ఏకంగా సమంతకి నెంబర్ 1 స్థానం కట్టబెటింది. టాప్ 5లో పూజా హెగ్డే పేరు ఉండడం కూడా షాకింగ్ అనే చెప్పాలి ఆమెకి ఇటీవల సరైన సక్సెస్ లేదు. ఏది ఏమైనా వీళ్లంతా టాప్ 5 లో ఉండడానికి కారణాలు ఈ విధంగా ఉన్నాయి.
37
రష్మిక మందన్న
రష్మిక భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లు అందుకుంటోంది. యువత, మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది.
ప్రతిభ పరంగా తిరుగులేని హీరోయిన్ సాయి పల్లవి. అద్భుతమైన నటన, డ్యాన్స్ లతో యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా మెప్పిస్తోంది.
57
శ్రీలీల
యువతని మెప్పించే ఫ్రెష్ లుక్స్, డ్యాన్స్, క్యూట్ నెస్ శ్రీలీల బలాలు. టాప్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటోంది. సక్సెస్ లు తక్కువే అయినప్పటికీ ఆమె ట్రెండ్ కొనసాగుతోంది.
67
పూజా హెగ్డే
పూజా హెగ్డేకి ఇటీవల సరైన సక్సెస్ లేదు. కానీ స్పెషల్ సాంగ్స్, కొన్ని చిత్రాలతో ఏదో విధంగా ట్రెండ్ లో ఉంటోంది. ఆమె తన గ్లామర్ తో విశేషంగా ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది.
77
మీనాక్షి చౌదరి
మీనాక్షి చౌదరి ఇటీవల కాలంలో లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం లాంటి భారీ హిట్లు అందుకుంది. ప్రస్తుతం నాగ చైతన్య వృషకర్మ అనే చిత్రంలో నటిస్తోంది.