50 లక్షల బడ్జెట్.. 200 రెట్లు లాభం.. 2025లో అత్యధిక లాభాలిచ్చిన సినిమా ఏంటో తెలుసా?

Published : Nov 28, 2025, 03:50 PM IST

Laalo Krishna Sada Sahaayate : కేవలం 50 లక్షల బడ్జెట్‌తో తీసిన ఓ సినిమా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి 2025లో అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన సినిమాగా నిలిచింది. 

PREV
14
2025 లో కాంతార 1 ను మించిన హిట్ సినిమా

2025లో అతిపెద్ద హిట్ సినిమా అంటే వెంటనే  'కాంతార చాప్టర్ 1' అని అనుకుంటారు. కానీ దానికంటే ఎక్కువ లాభాలు తెచ్చిన సినిమా మరొకటి ఉంది అని మీకు తెలుసా? కానీ ఆ సినిమా పేరు చాలామందికి తెలియదు. అది ఒక గుజరాతీ సినిమా.

24
అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన సినిమా ఏది?

2025లో అత్యంత లాభదాయకమైన సినిమాగా 'లాలో కృష్ణ సదా సహాయతే' రికార్డు క్రియేట్ చేసింది. అంకిత్ సాకియా దర్శకత్వంలో వచ్చిన ఈ ఆధ్యాత్మిక సినిమాను కేవలం 50 లక్షల బడ్జెట్‌తో తీశారు. అక్టోబర్ 10న రిలీజ్ అయిన ఈ మూవీ  నిర్మాతకు ఏకంగా 200 రెట్ల లాభాన్ని తెచ్చిపెట్టింది.

34
లాలో కృష్ణ సదా సహాయతే సినిమా వసూళ్లు

'లాలో కృష్ణ సదా సహాయతే' సినిమా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇండియాలో 95.5 కోట్లు, విదేశాల్లో 5.5 కోట్లు రాబట్టింది మూవీ. అంతే కాదు  గుజరాతీలో 100 కోట్లు కలెక్షన్స్  దాటిన మొదటి సినిమాగా ఇది రికార్డు క్రియేట్ చేసింది. 

44
200 రెట్ల లాభం పొందిన గుజరాతీ సినిమా

'కాంతార' బడ్జెట్‌పై 90 రెట్ల లాభం తెస్తే, 'లాలో కృష్ణ సదా సహాయతే' 200 రెట్ల లాభం తెచ్చింది. గుజరాతీ ఫిల్మ్ ఇండస్ట్రీకి గేమ్ ఛేంజర్‌గా నిలిచిన ఈ సినిమా 125 కోట్లు వసూలు చేస్తుందని అంచనా.

Read more Photos on
click me!

Recommended Stories