చిరంజీవి సినిమా ఎఫెక్ట్ తో మద్రాసులో ఆస్తులు అమ్ముకున్న టాలీవుడ్ నటుడు.. తన కొడుకుని కూడా ఎదగనివ్వకుండా..

First Published | Aug 7, 2024, 4:34 PM IST

చిరంజీవి సినిమా ప్రభావం వల్ల టాలీవుడ్ సీనియర్ నటుడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళాడు. ఆయన ఫ్యామిలీ మొత్తం వీధిన పడే పరిస్థితి ఏర్పడింది. 

మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుందంటే థియేటర్స్ లో ఒక పండగ వాతావరణం ఉండేది. 80, 90 దశకాల్లో చిరంజీవి తిరుగులేని విధంగా బాక్సాఫీస్ ని శాసించారు. ఆ టైంలో చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుంటే మిగిలిన వాళ్ళు తమ చిత్రాలని వాయిదా వేసుకునే పరిస్థితి. 

ఆ సమయంలో చిరంజీవి సినిమా ప్రభావం వల్ల టాలీవుడ్ సీనియర్ నటుడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళాడు. ఆయన ఫ్యామిలీ మొత్తం వీధిన పడే పరిస్థితి ఏర్పడింది. ఆ నటుడు ఎవరో కాదు గిరిబాబు. గిరిబాబు విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో తనదైన ముద్ర వేశారు. దర్శకుడిగా, నిర్మాతగా కూడా కొన్ని చిత్రాలు చేశారు. 

Also Read: టాలీవుడ్ స్టార్ హీరోల మేనల్లుళ్లు చాలా రిచ్ గురూ..వాళ్ళిద్దరి ఆస్తి గురించి తెలిస్తే మైండ్ పోతుంది


గిరిబాబు తనయుడు రఘుబాబు ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రధాన కమెడియన్ గా రాణిస్తున్నారు. మరో తనయుడు బోస్ బాబు గతంలో హీరోగా చేశారు. కానీ బోస్ బాబు సక్సెస్ కాలేదు. గిరిబాబు తన కొడుకు బోస్ బాబు హీరోగా 1990లో ఇంద్రజిత్ అనే చిత్రాన్ని నిర్మించారు. అది కౌబాయ్ చిత్రం. దాదాపు 45 లక్షల భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. అప్పట్లోనే 45 లక్షలు అంటే మాటలు కాదు. కానీ క్వాలిటీలో కాంప్రమైజ్ కాకూడదని గిరిబాబు అంత బడ్జెట్ పెట్టారట. 

Also Read: ఇండియాలో ఉండొద్దు, వెళ్ళిపో..కొడుకు చేసిన పనికి పెద్ద రచ్చ చేసిన హరికృష్ణ, ఇద్దరి మధ్య మాటల్లేవ్

సినిమా పూర్తయి రిలీజ్ కి రెడీ అవుతోంది. పార్లల్ గా మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక కౌబాయ్ చిత్రంలో నటిస్తున్నారు. అది కొదమసింహం చిత్రం. ఇంద్రజిత్ తర్వాత కొదమసింహం రిలీజ్ కావాల్సింది. గిరిబాబు మాట్లాడుతూ ఇంద్రజిత్ సెన్సార్ కి రెడీ అవుతోంది. బయ్యర్లు కూడా సినిమాని కొనడానికి వస్తున్నారు. ఆ టైంలో కొదమసింహం చిత్రాన్ని యుద్ధ ప్రాతిపదికన ఎడిటింగ్ పూర్తి చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు. మా చిత్రం రిలీజ్ కావాల్సిన డేట్ ని వాళ్ళు లాగేసుకున్నారు. 

Also Read: ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్, మెగా ఫ్యామిలీతో దూరపు బంధుత్వం..అయినా చిరంజీవిలో అది నచ్చదు, స్టార్ హీరో కామెంట్స్

దీనితో బయ్యర్లంతా వెళ్లిపోయారు. తప్పని పరిస్థితుల్లో ఇంద్రజిత్ చిత్రాన్ని 2 నెలలు వాయిదా వేయాల్సి వచ్చింది. కొదమ సింహం చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. బయ్యర్లకి డబ్బు రాలేదు. నష్టాలు వచ్చాయి. వాళ్ళు సినిమా హిట్ అని చెప్పుకున్నారేమో నాకు తెలియదు. కానీ ఆ సినిమా అయితే ఫ్లాప్. మా చిత్రం రిలీజ్ కి రెడీ అవుతుండగా.. బయ్యర్లు వచ్చారు. చిరంజీవి లాంటి పెద్ద హీరోనే కౌబాయ్ గా నటిస్తే ఆడలేదు. ఇక మీ అబ్బాయి హీరోగా కొత్తగా వస్తున్నాడు. జనాలు పట్టించుకుంటరా అని బయ్యర్లు అనుమానం వ్యక్తం చేశారు. అంతకు ముందు చెప్పిన రేట్ కన్నా సగం తగ్గించి కొంటాం అని చెప్పారు. సినిమాకి 45 లక్షలు ఖర్చు చేస్తే.. వాళ్ళు కొన్నది కేవలం 20 లక్షలతో మాత్రమే. సగానికిపైగా నాకు లాస్. 

సినిమా రిలీజ్ అయింది. బయ్యర్లు చాలా తక్కువ ధరకు కొన్నారు కాబట్టి వాళ్ళకి లాభం వచ్చింది. నాకు ఒక్క రూపాయి కూడా రాలేదు అని గిరిబాబు అన్నారు. అది కాకుండా మా సినిమా ఫ్లాప్ అంటూ ఇండస్ట్రీ మొత్తం కొందరు ప్రచారం చేశారు. నా కొడుకు హీరోగా ఎదగకూడదని ఆ రకమైన కుట్ర చేశారని గిరిబాబు అన్నారు. గిరిబాబు తనయుడు రఘుబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ సినిమాతో వచ్చిన నష్టాల కారణంగా టెక్నీషియన్లకి, కొంతమంది ఆర్టిస్టులకి బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వడానికి మా దగ్గర డబ్బు లేదు. ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ వీధిన పడింది. 

ఆ టైంలో నాన్నగారు 20 ఏళ్ళు తాను కష్టపడి చెన్నైలో సంపాదించిన ఆస్తులని అమ్మేశారు. మీరు నాకు డబ్బు ఇవ్వాలి అని మన ఇంటి గేటు దగ్గరకి ఎవరూ రాకూడదు. వాళ్ళకి ఎంత ఇవ్వాలో వడ్డీతో సహా ఆస్తులు అమ్మేసి నాన్నగారు ఇచ్చేశారు. ఈ విషయం నేను గర్వంగా చెప్పకుంటా అని రఘుబాబు అన్నారు. ఆ టైంలో తాము తీవ్రమైన ఆర్థిక సంక్షోభం చూసాం అని రఘుబాబు గుర్తు చేసుకున్నారు. 

Latest Videos

click me!