రష్మిక మందన్నా, జాన్వీ కపూర్‌ ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారు? ఏఐ ఏం చెప్పిందో తెలుసా? మతిపోవాల్సిందే

First Published | Aug 7, 2024, 4:25 PM IST

నేషనల్ క్రష్‌ రష్మిక మందన్నా, అతిలోక సుందరి శ్రీదేవి తనయలో ఎవరు బాగా అందంగా ఉన్నారని అడిగితే ఏఐ ఏం చెప్పిందో తెలుసా? మైండ్‌ బ్లాక్‌.
 

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా, జాన్వీ కపూర్‌ ప్రస్తుతం క్రేజీ హీరోయిన్లుగా నిలిచారు. రష్మిక పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతుంది. జాన్వీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి పాన్‌ ఇండియా చిత్రాలు చేస్తూ క్రేజీ హీరోయిన్‌గా నిలిచింది. ఇప్పుడు వరుసగా భారీ ఆఫర్లని అందుకుంటూ దూసుకుపోతుంది. ఈ ఇద్దరు ఇప్పుడు కుర్రాళ్ల డ్రీమ్‌ హీరోయిన్లుగా మారారు. 
 

ఇదిలా ఉంటే ఈ ఇద్దరు భామల గురించి ఏఐ ఆసక్తికర విషయాలను పంచుకుంది. చాట్‌ జీపీటీలో ఈ ఇద్దరు భామల ఫోటోలను పంచుకోగా, ఇద్దరి గురించి, వారి ప్రత్యేకతల గురించి చెప్పింది ఏఐ(ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్). ఈ ఇద్దరు భామలు ఎలా ఉన్నారో వెల్లడించింది. ఒక విషయంలో మాత్రం కన్‌ఫ్యూజ్‌ అయ్యింది. కానీ ఫైనల్‌గా తన బెస్ట్ ఇచ్చింది. 
 


rashmika

అందులో భాగంగా రష్మిక మందన్నా గురించి.. క్యూట్‌గా, కాజ్వల్‌ లుక్‌లో కనిపిస్తుందని, ఆమె చిరు నవ్వు చాలా ఆకర్షణీయంగా ఉందని, రష్మిక స్వచ్ఛమైన చర్మం, సహజమైన అందం ఆమెకి ప్రత్యేక ఆకర్షణని ఇస్తుందని, ఆమె కాన్ఫిడెన్స్, మేకప్‌ లేకుండా ఆమె అందం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పి ఆశ్చర్యపరిచింది. 

actress janhvi kapoor

మరోవైపు జాన్వీ కపూర్‌ గురంచి చెబుతూ, జాన్వీ కపూర్‌ సాంప్రదాయ చీర ధరించి, మోడర్న్ లక్‌లో కూడా ఫ్యాషన్‌ స్టయిల్ లో కనిపిస్తుందని, ఆమె సున్నితమైన ఫేస్‌ కట్‌, కళ్లలోని కాంతితో అందంగా ఉంద. జాన్వీ ఆత్మ విశ్వాసం, ధైర్యవంతమైన నడక ఆమెని ప్రత్యేకంగా నిలుపుతుంది అని పేర్కొంది. 

అయితే మొదట ఈ ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారనేది తెలిపే విషయంలో తర్జన భర్జన పడుతుందట. ఇద్దరూ ప్రత్యేకైన ఫ్యాషన్‌స్టయిల్‌, స్వచ్ఛమైన అందంతో ఆకర్షించేలా ఉన్నారని, జాన్వీ కపూర్‌ సాంప్రదాయ, మోడర్న్ లుక్‌ మెరిపులు కురిపిస్తుందని చెప్పగా, రష్మిక చాలా క్యూట్‌గా, సహజంగా ఉందని చెప్పింది. అందువల్ల ఎవరు అందంగా ఉందనేది వారి వ్యక్తిగత అభిరుచి, ఫ్యాషన్‌ స్టయిల్‌పై ఆధారపడి ఉందని చెప్పింది. ఇక ఫైనల్‌గా ఎవరు అనేది కచ్చితంగా చెప్పాల్సిన వచ్చినప్పుడు రష్మిక చాలా బాగా అందంగా ఉంది, చిరునవ్వుతో, సహజమైన అందంతోక్యూట్‌గా కనిపిస్తుందని చెప్పింది ఏఐ(చాట్‌ జీపీటీ). ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతుంది. అదే సమయంలో ఏఐ సర్‌ప్రైజింగ్‌ విషాయాలను వెల్లడించడం విశేషం. 
 

రష్మిక మందన్నా ఇప్పుడు భారీ సినిమాలతో బిజీగా ఉంది. వాటిలో `పుష్ప 2`, `రెయిన్‌బో`, `ది గర్ల్ ఫ్రెండ్‌`, `కుబేర`, `సికండర్‌` చిత్రాలు చేస్తుంది. జాన్వీ కపూర్.. తెలుగులో `దేవర`తోపాటు రామ్‌ చరణ్‌తో బుచ్చిబాబు సినిమాలో నటిస్తుంది. ఇటీవల విడుదలైన `దేవర`లోని `చుట్టమల్లే` అనే పాటలో జాన్వీ అందాల విందు హైలైట్‌గా నిలిచింది. 
 

Latest Videos

click me!