దేవర పాటలో ఎన్టీఆర్ వేసుకున్న డ్రెస్ కాస్ట్ తెలిస్తే షాక్ అవుతారు.. మరీ అంత తక్కువా..?

First Published | Aug 7, 2024, 4:32 PM IST

రీసెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ రెస్పాన్స్ సాధించింది దేవర ఫస్ట్ సాంగ్. ఈ సాంగ్ లో అన్నీ ప్రత్యేకతలే.. అందులో తారక్ వేసుకున్న షర్ట్ మరీ ప్రత్యేకం...? ఈ షర్ట్ కాస్ట్ ఎంతో తెలుసా..? 

పాన్ ఇండియా ఇమేజ్ తో దూసకుపోతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ రేంజ్ కు వెళ్ళిన తారక్..ఆతరువాత వరుస పాన్ ఇండియా సినిమాలను లైన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా.. కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. చాలా కాలంగా షూటింగ్ జరుగుతున్న ఈమూవీ ఫైనల్ స్టేజ్ కు వచ్చినట్టు తెలుస్తోంది. 

పవన్ కళ్యాణ్ ‌- రేణు దేశాయ్ తో కలిసి కూర్చున్న ఈ పాపను గుర్తుపట్టారా..?
 

అయితే దేవర నుంచి సాలిడ్ అప్ డేట్ కోసం ఎదరు చూస్తున్న ఆడియన్స్ కోసం.. అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు కొరటాల. దేవర నుంచి  క్రేజీ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ రొమాంటిక్ సాంగ్ లో తారక్ మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తుండగా.. జాన్వీ కపూర్ హాట్ నెస్ కు కుర్రాళ్ళు కళ్లు పేలిపోతున్నాయి. దేవర టీమ్ అనుకున్నదానికంటే ఎక్కువగా.. అంచనాలకు మించి ఈ సాంగ్ ఆకట్టుకుంది. 

విజయ్ తో ముద్దు వివాదం.. నయనతార తన భర్త విష్నేష్ ను అవమానించిందా..?


janhvi kapoor

ఇప్పటికే దేవర సాంగ్ కు  యూట్యూబ్ లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తుండటం గమనార్హం. చుట్టమల్లే సాంగ్ తెలుగు వెర్షన్ కు ఇప్పటివరకు 11 మిలియన్లు అంటే కోటి 10 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఎన్టీఆర్ గత సినిమాలకంటే కూడా ఈసినిమా పై ఎక్కువగా అంచనాలు పెరిగిపోయాయి. 

నవీన్ పోలిశెట్టికి పెళ్ళైయ్యిందా..? అందుకే ఆయన అక్కడి నుంచి రావడంలేదా..?

Devara

ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే.. ఈ సినిమాలో.. ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్ వేసుకున్న షర్ట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.  ఈసాంగ్ లో తారక్ ధరించిన షర్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ ఈకామర్స్ సైట్లలో ఈ షర్ట్ ను కొనుగోలు చేయడానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్  చాలా మంది ట్రై చేస్తున్నారు. అయితే విచిత్రం ఏంటంటే.. ఈషర్ట్ ధర చాలా తక్కువ రేటు ఉండటం. 

అసలు స్టార్ల్స్ వాడే చొక్కాలు కాని.. షూస్ కాని.. ఆకరుకు ఇంట్లో వేసుకునే చెప్పులు కూడా వేలల్లోనే ఉంటాయి. తక్కువ లో తక్కువ పదివేలకు తక్కువ ఉండవు. అటువంటిదిన ఈ షర్ట్ ధర ఆన్ లైన్ లో  499 రూపాయాలు చూపిస్తుంది. అంతే కాదు కొనాలీ అని ట్రై చేస్తున్న తారక్ ఫ్యాన్స్ కు షాక్ తగిలింది. ఆషర్ట్స్ అవుట్ ఆఫ్ స్టాక్ పడిపోయింది.   సోల్డ్ ఔట్ అయిన పరిస్థితి నెలకొంది. 
 

మరోవైపు దేవర సెకండ్ సింగిల్ చుట్టూ కొన్ని ట్రోల్స్ వస్తున్నా ఫ్యాన్స్ మాత్రం వాటిని పట్టించుకోకుండా సాంగ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. దేవర సెకండ్ సింగిల్ ఇతర భాషల వెర్షన్లు సైతం ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్నాయి. దేవర సీక్వెల్ షూట్ ఎప్పుడు మొదలవుతుందనే చర్చ జరుగుతుండగా త్వరలో ఈ ప్రశ్నలకు సంబంధించి జవాబు దొరికే అవకాశం అయితే ఉంది.

Latest Videos

click me!