Tollywood: హీరోల కంటే విలన్లే తోపు నటనతో మెప్పించిన మూవీస్.. రజినీకాంత్‌కే తప్పలేదు

Published : Mar 05, 2026, 06:42 PM IST

Tollywood: సినిమాలో హీరో ఎంత శక్తిమంతుడో, అతడిని ఎదిరించే విలన్ కూడా అంతే బలంగా ఉండాలి. కొన్ని చిత్రాల్లో విలన్లు తమ నటనతో ఏకంగా హీరోనే మించిపోయి ప్రేక్షకులను మెప్పించారు. రమ్యకృష్ణ 'నీలాంబరి' పాత్ర నుండిచి సోనూ సూద్ 'పశుపతి' వరకు.. 

PREV
15
హీరో మాత్రమే కాదు

సినిమా అంటే కేవలం హీరో మాత్రమే కాదు, ఆ హీరోను ఢీకొనే మొనగాడు కూడా అంతే బలంగా ఉండాలి. ప్రతినాయకుడి పాత్ర ఎంత బలంగా ఉంటే, కథానాయకుడి విజయం అంత గొప్పగా కనిపిస్తుంది. అయితే కొన్ని సినిమాల్లో విలన్ పాత్రలు, వారి నటన ఎంత వైవిధ్యంగా ఉంటాయంటే, ఒక్కోసారి హీరో కంటే వారే ఎక్కువగా గుర్తుండిపోతారు.

25
నీలాంబరి - నరసింహ మూవీ

రమ్యకృష్ణ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిన పాత్ర 'నరసింహ' చిత్రంలోని నీలాంబరి. నరసింహపై ఆమెకు ఉన్న మోజు, అహంకారం చివరికి ఆమె మరణానికి దారితీస్తాయి. ఈ పాత్రలో రమ్యకృష్ణ చూపించిన నటన భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యుత్తమ విలన్లలో ఒకటిగా నిలిచిపోయింది.

35
గబ్బర్ సింగ్ అహంకారం

షోలే చిత్రంలోని అంజద్ ఖాన్ పోషించిన గబ్బర్ సింగ్ పాత్ర ఒక ట్రెండ్ సెట్టర్. "అరే ఓ సాంబ.. కిత్నే ఆద్మీ థే" అనే డైలాగ్ విన్నప్పుడల్లా ఆ విలన్ అహంకారం, ఆ రాయిపై నిలబడి ఉన్న దృశ్యం మన కళ్ల ముందు మెదులుతుంది. డైలాగ్ చిన్నదే అయినా, దానిని పలికించిన తీరు ఆ పాత్రకు ప్రత్యేక గుర్తింపునిచ్చింది.

45
తెలుగు తెరపై మాస్ విలనిజం

మన టాలీవుడ్ ఇండస్ట్రీ విషయానికి వస్తే, నటుడు గోపీచంద్ ప్రారంభంలో విలన్ పాత్రలతో సంచలనం సృష్టించారు. 'జయం', 'నిజం', 'వర్షం' వంటి చిత్రాల్లో ఆయన పోషించిన విలన్ పాత్రలు హీరోలకు గట్టి పోటీనిచ్చాయి.

55
పశుపతి పాత్ర కూడా

అలాగే సోనూ సూద్ 'అరుంధతి' చిత్రంలో పోషించిన పశుపతి పాత్ర కూడా ఒక ప్రత్యేకం. ఆ పాత్రలోని క్రూరత్వం, మంత్రతంత్రాల నేపథ్యం ప్రేక్షకులను భయపెట్టడమే కాకుండా సినిమా విజయానికి ప్రధాన కారణమైంది. మొత్తానికి, అవకాశం రావాలే కానీ ప్రతినాయకుడి పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి హీరోలను మించిపోయే నటులు మన పరిశ్రమలో చాలా మంది ఉన్నారు. వీరు కేవలం విలన్లుగా మాత్రమే కాకుండా, సినిమా స్థాయిని పెంచే కీలక పాత్రధారులుగా నిలిచారు.

Read more Photos on
click me!

Recommended Stories