Hero Yash Wife: కేజీఎఫ్ హీరోగానే యశ్ ను తెలుగు ప్రేక్షకులు గుర్తు పడతారు. యశ్ ఇప్పుడు టాక్సిక్ సినిమాలో నటిస్తున్నాడు. అతని భార్య రాధికా పండిట్ కూడా హీరోయినే. కానీ పెళ్లయ్యక నటించడం మానేసింది. ఆమె యశ్ పెళ్లిపై షాకింగ్ కామెంట్లు చేసింది.
రాధికా పండిట్ ఒకప్పుడు కన్నడలో టాప్ హీరోయిన్. కానీ ఇప్పుడు ఫ్యామిలీతో బిజీగా మారిపోయింది. 2016లో యశ్‌ను పెళ్లి చేసుకుంది రాధిక. ఆ తరువాత ఐరా, యథర్వ్ అనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ ఇద్దరి ఆలనాపాలన చూసుకుంటూ సినిమాలకు దూరంగా ఉంటోంది ఈ నటి. సోషల్ మీడియాలో మాత్రం యాక్టవ్ గా కనిపిస్తుంది.
యశ్, రాధికా జంట 9 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ తొలిసాలి 2012లో వచ్చిన 'డ్రామా' సినిమాలో నటించారు. ఆ తర్వాత 'మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి' సినిమాల్లో మళ్లీ కలిసి నటించారు. ఆ సినిమాలో సమయంలో వీరి మధ్య ప్రమే చిగురించిందని చెబుతారు. పెద్దల అంగీకారంతోనే 2016 డిసెంబర్ 9న గోవాలో ఈ జంట పెళ్లి చేసుకుంది. ఆ తరువాత రాధికా పండిట్ సినిమాలకు దూరమైంది.
24
సోషల్ మీడియోలోన యాక్టివ్
రాధికా పండిట్ సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫ్యామిలీ ఫొటోలను, పిల్లలతో ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. భర్త యశ్, పిల్లలతో కలిసి టూర్లకు వెళ్లినప్పుడు ఆ ఫొటోలను కూడా పంచుకుంటుంది. అలా అభిమానులకు దగ్గరగానే ఉంటోంది రాధికా పండిట్.
34
పెళ్లయ్యాక ఇదే మారింది
కన్నడ క్యూట్ కపుల్ పేరు తెచ్చుకున్నారు హీరో యశ్ - రాధిక పండిట్. వారు తాజాగా ఒక ఇంటర్య్వూకు హాజరయ్యారు. అందులో యాంకర్ ‘మీ ఇద్దరికి పెళ్లి జరిగి 9 ఏళ్లు అయింది కదా… జీవితంలో ఏమైనా తేడా వచ్చింది?’ అని అడిగింది. దానికి రాధిక గట్టిగా నవ్వింది. తరువాత ‘పెళ్లయ్యాక మా ఇద్దరం పబ్లిక్ గా ధైర్యంగా ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నడవగలుస్తున్నాం’ అని చెప్పింది. ఆ జవాబు విని పక్కనే ఉన్న యశ్ షాక్ అయినట్టు ముఖం పెట్టాడు.
అదే ఇంటర్య్వూలో రాధికా పండిట్ మాట్లాడుతూ తన ప్రతి పుట్టినరోజు యశ్ గుర్తు పెట్టుకుని… అర్ధరాత్రి 12 గంటలకు కచ్చితంగా విష్ చేస్తాడని చెప్పింది. రాధిక ప్రస్తుతం నటనకు దూరంగా ఉండగా, యశ్ 'టాక్సిక్' సినిమా తాజాగా పూర్తి చేశాడు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా భారీ యాక్షన్ సినిమా అని తెలుస్తోంది.