రజినీకాంత్ జైలర్ మూవీని మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో..? బ్లాక్ బస్టర్ సినిమాకు ఏడాది పూర్తి..

First Published | Aug 14, 2024, 5:46 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ జైలర్.. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది పూర్తి అయ్యింది. ఇక ఈమూవీని మిస్ చేసుకున్న తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా..? ఎవరు కాదంటే.. ఈ కథ తలైవా దగ్గరకు వచ్చింది..? 

Jailer

దాదాపు దశాబ్ధానికి పైగా సాలిడ్ హిట్ లేక ఇబ్బందిపడ్డాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఇక ఆయన పని అయిపోయింది.. రజినీమార్కెట్ పడిపోయింది. ఎందుకు ఆయనతో సినిమాలు చేస్తున్నారు అంటూ..ప్రొడ్యూసర్లను భయపెట్టినవారు కూడా ఉన్నారు. అలాంటి వారి నోర్లు మూయిస్తు.. 70 ఏళ్లు దాటిన ఓ హీరో.. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఆ సినిమానే జైలర్. రజినీకాంత్ కు ప్లాప్ ల నుంచి ఊరటనీయ్యడమే కాదు. అనుకున్నదానికంటే డబుల్ ఫ్రాఫిట్స్ తో పాటు.. ఎక్కువ విజయాన్ని నమోదు చేసి.. తలైవాకు బూస్టప్ ను ఇచ్చింది. 

All So Read: శోభితకు నాగార్జున కండీషన్లు...? చైతును పెళ్ళాడాలంటే అవి తప్పనిసరిగా చేయాల్సిందేనా..?
 

Jailer

ఆ ఊపుతో సూపర్ స్టార్.. సూపర్ ఫాస్ట్ గా మరికొన్ని సినిమాలు కంప్లీట్ చేయడానికి రెడీ అయ్యాడు. నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని దాదాపు 200 కోట్ల బ‌డ్జెట్ తో సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు. నిజానికి అనిరుధ్ మ్యూజిక్ ఈసినిమాకు ప్రాణం పోసిందని చెప్పవచ్చు. రజినీకాంత్ ఎలివేషన్ సీన్లకు కుర్ర మ్యూజిక్ డైరెక్ట్ కొట్టిన ట్యూన్స్.. ఆడియన్స్ కు గూజ్ బాంమ్స్ తెప్పించాయి. అంతే కాదు తలైవా ఫ్యాన్స్ అయితే పూనకాలు వచ్చినట్టు ఊగిపోయారు. థియేటర్లు దద్దరిల్లిపోయాయి. 

All So Read: సావిత్రి నుంచి నయనతార వరకూ.. సౌత్ లో పవర్ ఫుల్ లేడీ సూపర్ స్టార్స్ వీళ్ళే..?
 


సెంటిమెంట్ సీన్స్ తో ప్యామిలీ ఆడియన్స ను కూడా థియేటర్లకు రప్పించింది జైలర్ సినిమా. మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ తో పాటు తెలుగు నుంచి సునిల్ ఇంపార్టెంట్ రోల్స్ లో నటించి మెప్పించారు. ఇక  ఈ మూవీలో వినాయకన్, వసంత్ రవి, ర‌మ్య‌కృష్ణ‌ నటించగా.. తమన్నా ఐటమ్ సాంగ్ తో అదరగొట్టింది. భారీ అంచ‌నాల న‌డుమ 2023 ఆగ‌స్టు 10న రిలీజ్ అయిన ఈసినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనంగా నిలిచింది. ఫైనల్ రన్ లో జైలర్ దాదాపు 700 కోట్లు వసూలు చేసింది. నిర్మాతలను దిల్ ఖుష్ చేసింది. 

All So Read: జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం.. ఆందోళనలో అభిమానులు.. ఏమయ్యింది..?
 

బడ్డెజ్ కంటే మూడు రెట్లు లాభాలు రావడంతో.. ప్రతీ ఒక్కరికి కాస్ట్లీ గిఫ్ట్స్ కూడా ఇచ్చాడు  ప్రొడ్యూసర్. రజినీకి మరో వంద కోట్లు రెమ్యూనరేషన్ కూడా ఇచ్చాడట. అయితే జైల‌ర్ సినిమా ఏడాది పూర్తి చేసుకున్న సందర్బంగా ఓఇంట్రెస్టింగ్ విషయం ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.  అదేంటంటే.. ఈసినిమాకు హీరోగా ఫస్ట్ ఛాయిస్ ర‌జ‌నీకాంత్ కాదట. ఈసినిమాకు మొద‌ట ఓ తెలుగు హీరోను అనుకున్నారట. అతను ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. ఈసినిమా కథను చిరుకు వినిపించాడట నెల్సన్. అయితే చిరంజీవికి ఈరేంజ్ యాక్షన్ ఓకే.. కాని దాంతో పాటు సాంగ్స్, డాన్స్, కూడా తగిన మోతాదులో ఉంటే బాగుంటుంది అనుకున్నారట చిరు. 

All So Read:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆ హీరోయిన్ పై మనసు పారేసుకున్నాడా..? అందుకే మూడు సార్లు ఛాన్స్ ఇచ్చాడా..?
 

అందుకే ఈసినిమాను సున్నితంగా రిజెక్ట్ చేశారట. ఇక ఆతరువాత తలైవాను ఒప్పించి.. కథలో కాస్త మార్పులు చేసి..  సెట్స్ ఎక్కించారు టీమ్. ఇలా ఈ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ ను మిస్ చేసుకున్నాడు చిరంజీవి. మరి ఈ విషయంలోనిజం ఎంతో తెలియదు కాని.. టాలీవుడ్ తో పాటు.. కోలీవుడ్ లో కూడా ఈ విషయంపై సినీజనాలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ కూలి సినిమాలో నటిస్తుండగా..? మెగాస్టార్ చిరంజీవి విశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర సినిమాను చేస్తున్నాడు. 

Latest Videos

click me!