నాగబాబు మీద గెలిచి చూపించిన నిహారిక..!

First Published | Aug 14, 2024, 5:39 PM IST

నాగబాబు కంటే నిహారిక తాను బెటర్ అని నిరూపించింది. తండ్రి ఓడిపోతే నిహారిక గెలిచి చూపించింది. నిహారికను వెనక్కి నెట్టాలని చూసిన మెగా ఫ్యామిలీ ఇప్పుడు మెచ్చుకోవాల్సిందే
 

Niharika Konidela


మెగా ఫ్యామిలీలో నిహారిక కొణిదెల రెబల్ అని చెప్పాలి. ఎందరు అడ్డుకోవాలని చూసినా హీరోయిన్ కావాలన్న తన కల నెరవేర్చుకుంది. పరిశ్రమకు రావాలన్న నిహారిక నిర్ణయం పై వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా మెగా అభిమానులు ఒప్పుకోలేదు. చిరంజీవి తమ్ముడు కూతురు హీరోయిన్ కావడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Niharika Konidela

అయినప్పటికీ లెక్క చేయకుండా నిహారిక హీరోయిన్ అయ్యింది. ఒక మనసు చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. నాగ శౌర్య హీరోగా నటించిన ట్రాజిక్ లవ్ డ్రామా పర్లేదు అనిపించుకుంది. అనంతరం హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి చిత్రాల్లో నిహారిక హీరోయిన్ గా నటించింది. చిరంజీవి పాన్ ఇండియా చిత్రం సైరా నరసింహారెడ్డిలో గెస్ట్ రోల్ చేసింది. 


Niharika Konidela

నటిగా నిహారికకు బ్రేక్ రాలేదు. దానితో వివాహం చేసుకుంది. కానీ ఆమె మనసు ఇండస్ట్రీ మీదే ఉంది. అనూహ్యంగా భర్తతో విడిపోయింది. విడాకులు అనంతరం నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. నటిస్తూనే నిర్మాతగా రాణించాలి అనుకుంది. ఒక ఆఫీస్ ఓపెన్ చేసి నూతన దర్శకులు, నటులు, రచయితలతో సంప్రదింపులు జరుపుతుంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లో తొలి ప్రయత్నంగా కమిటీ కుర్రోళ్ళు చిత్రం చేసింది. 

ఆగస్టు 9న కమిటీ కుర్రోళ్ళు హిట్ టాక్ తెచ్చుకుంది. అందరూ కొత్తవాళ్లతో తెరకెక్కిన ఈ విలేజ్ డ్రామా వరల్డ్ వైడ్ రూ. 8.49 కోట్ల గ్రాస్ రాబట్టింది. కమిటీ కుర్రోళ్ళు బ్రేక్ ఈవెన్ దాటేసింది. కమిటీ కుర్రోళ్ళు మూవీ బడ్జెట్ రూ. 5 కోట్ల లోపే. డిజిటల్, శాటిలైట్ రైట్స్ ద్వారా నిహారిక ఇంకొంత ఆర్జించనుంది. నిర్మాతగా నిహారిక సక్సెస్ అని చెప్పొచ్చు. 
 

ఈ క్రమంలో ఓ ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. నాగబాబు ఫెయిల్ అయితే ఆయన కూతురు నిహారిక సక్సెస్ అయ్యిందని అంటున్నారు. నాగబాబు నిర్మాత ఒక్క విజయం చూడలేదు. మెగాస్టార్ తమ్ముడిగా నాగబాబు ఒక బ్యానర్ ఏర్పాటు చేసి పలు చిత్రాలు నిర్మించాడు. చిరంజీవి హీరోగా రుద్రవీణ, త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు, బావగారూ బాగున్నారా... ఇలా పలు చిత్రాలు నిర్మించాడు. ఒక్కటి కూడా నాగబాబుకు బ్రేక్ ఇవ్వలేదు. అవన్నీ డిజాస్టర్స్ అయ్యాయి. 

చరణ్ హీరోగా తెరకెక్కిన ఆరెంజ్ డబుల్ డిజాస్టర్. ఆ సినిమా దెబ్బకు నాగబాబు ఫ్యామిలీ నడిరోడ్డు మీదకు వచ్చేసింది. ఆరంజ్ మిగిల్చిన నష్టాలు పూడ్చేందుకు నాగబాబు జబర్దస్త్ జడ్జిగా మారారు. నాగబాబు కూతురు నిహారిక మాత్రం తక్కువ బడ్జెట్ తో మూవీ తీసి ఎక్కువ లాభాలు ఆర్జిస్తోంది. కాబట్టి నాగబాబు నిర్మాతగా ఫెయిల్ నిహారిక సక్సెస్.. 

Latest Videos

click me!