50 ఏళ్ళ వయసులో తండ్రులైన వారు టాలీవుడ్‌ లో ఇంతమంది ఉన్నారా, షాకింగ్ లిస్ట్

Published : Oct 06, 2025, 12:59 PM ISTUpdated : Oct 06, 2025, 01:02 PM IST

సినీ తారలు కొంతమంది 50 ఏళ్ళ వయసు పైబడిన తర్వాత కూడా తండ్రులు అయ్యారు. కృష్ణంరాజు, ప్రకాష్ రాజ్, ప్రభుదేవా లాంటి వారు ఏ వయసులో తండ్రులు అయ్యారు అనే ఆసక్తికర వివరాలు ఈ కథనంలో ఉన్నాయి. 

PREV
18
Dil Raju and Krishnam Raju

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నటీనటులు కాస్త ఆలస్యంగానే వివాహాలు చేసుకుంటున్నారు. కెరీర్ కి ప్రాధాన్యత ఇవ్వడంతో పెళ్ళిళ్ళు ఆలస్యంగా జరుగుతున్నాయి. దీనితో సెలెబ్రిటీలు లేటు వయసులో తల్లిదండ్రులు అవుతున్నారు. 50 ప్లస్ ఏజ్ లో కూడా తండ్రులైన నటులు ఉన్నారు. దిల్ రాజు, ప్రకాష్ రాజ్, కృష్ణం రాజు లాంటి వారు 50 ఏళ్ళ తర్వాత కూడా తండ్రులు అయ్యారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

28
దిల్ రాజు 

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన సతీమణి అనిత మరణించిన తర్వాత తేజస్విని అనే మహిళని రెండో వివాహం చేసుకున్నారు. 2022లో దిల్ రాజు, తేజస్విని దంపతులకు కొడుకు జన్మించాడు. అప్పటికి దిల్ రాజు వయసు 50 ఏళ్ళు. 

38
ప్రకాష్ రాజ్ 

 విలక్షణ నటుడిగా భారత చిత్ర పరిశ్రమలో గుర్తింపు పొందిన ప్రకాష్ రాజ్ గురించి పరిచయం అవసరం లేదు. ప్రకాష్ రాజ్ 2010లో పోనీ వర్మని రెండో వివాహం చేసుకున్నారు. 2015లో ప్రకాష్ రాజ్, పోనీ వర్మ దంపతులకు 2015లో వేదాంత్ అనే కొడుకు జన్మించాడు. తొలి భార్యతో ప్రకాష్ రాజ్ కి ఆల్రెడీ పిల్లలు ఉన్నారు. వేదాంత్ జన్మించే సమయానికి ప్రకాష్ రాజ్ వయసు 50 ఏళ్ళు. 

48
ప్రభుదేవా 

ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా గుర్తింపు పొందిన ప్రభుదేవా తన మొదటి భార్య రామలత నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రభుదేవా.. హిమనీ సింగ్ ని రెండో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2023లో కుమార్తె జన్మించింది. దీనితో ప్రభుదేవా కూడా 50 ఏళ్ళ వయసులో తండ్రి అయినట్లు అయింది. 

58
సంజయ్ దత్ 

బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ తన మూడవ భార్య మనయత దత్ తో 2010లో కవలపిల్లలకు తండ్రి అయ్యారు. ఆ సమయంలో సంజయ్ దత్ వయసు 52 ఏళ్ళు. 

68
సైఫ్ అలీ ఖాన్

సైఫ్ అలీ ఖాన్ 2012లో కరీనా కపూర్ తో రెండో వివాహం జరిగింది. సైఫ్ కి అంతకు ముందే అమృత సింగ్ తో వివాహం జరిగింది. ఈ దంపతులకు సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ సంతానం ఉన్నారు. సైఫ్ కి కరీనాతో కూడా ఇద్దరు కుమారులు సంతానం కలిగారు. వీరికి చిన్న కుమారుడు జహంగీర్ 2021లో జన్మించాడు. ఆ సమయంలో సైఫ్ వయసు 50 ఏళ్ళు. 

78
కృష్ణంరాజు

దివంగత నటుడు, టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణం రాజు 1996లో శ్యామల దేవిని రెండో వివాహం చేసుకున్నారు. అప్పటికే కృష్ణం రాజు వయసు 50 ప్లస్. వీరికి ముగ్గురు కుమార్తెలు సంతానం. 

88
అర్బాజ్ ఖాన్ 

సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ఏకంగా 58 ఏళ్ళ వయసులో మరోసారి తండ్రి అయ్యారు. ఇటీవలే అర్బాజ్ ఖాన్, షురా దంపతులకు కుమార్తె జన్మించింది. అర్బాజ్ ఖాన్ కి ఇప్పటికే మలైకా అరోరాతో 22 ఏళ్ళ కొడుకు ఉన్నాడు. అర్బాజ్, మలైకా విడిపోయిన సంగతి తెలిసిందే. 

Read more Photos on
click me!

Recommended Stories