4000 కోట్ల భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు సౌత్ స్టార్ హీరో, దాదాపు 5 పాన్ ఇండియా సినిమాలతో సందడి చేయబోతున్నాడు. లేట్ అయినా తిరుగులేని ప్లానింగ్ తో రాబోతున్న ఆ హీరో ఎవరు?
దాదాపు 3 ఏళ్లుగా ఒక్క సినిమా కూడా థియేటర్ లో రిలీజ్ చేయలేదు సౌత్ స్టార్ హీరో. ప్రస్తుతం 4000 కోట్ల భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు. రాబోయే రోజుల్లో 5 భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీస్ లో నటిస్తున్నాడు. లేట్ అయినా సాలిడ్ గా రాబోతున్న ఆ హీరో ఎవరో కాదు కెజీఎఫ్ స్టార్ యష్
27
మూడేళ్లుగా కనిపించని యష్
కేజీఎఫ్ స్టార్ యశ్ 2-3 ఏళ్లుగా స్క్రీన్‌పై కనిపించలేదు, కానీ ఎప్పటికప్పుడు వార్తల్లో మాత్రం ఉంటున్నాడు. ఇటీవల అతని గురించి ఒక పెద్ద న్యూస్ వైరల్ అయ్యింది. దర్శకుడు పిఎస్ మిత్రన్ ఒక సై-ఫై సినిమా ఆఫర్ చేశాడని సమాచారం. మిత్రన్ స్క్రిప్ట్ కూడా పూర్తి చేశాడని అంటున్నారు.
37
యష్ నెక్ట్స్ మూవీ టాక్సీక్
యశ్ రాబోయే సినిమా టాక్సిక్. ఇందులో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్ ఉన్నారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇది మార్చి 19, 2026న విడుదల కానుంది
యశ్ సినిమా కేజీఎఫ్ రెండు భాగాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. రిపోర్టుల ప్రకారం, మూడో భాగం పనులు కూడా జరుగుతున్నాయి. కేజీఎఫ్ 3 కథ సిద్ధంగా ఉందని దర్శకుడు ప్రశాంత్ నీల్ కొన్ని నెలల క్రితం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. దీని షూటింగ్ 2026లో మొదలవ్వొచ్చు.
57
రామాయణం లో రావణుడిగా
దర్శకుడు నితేష్ తివారీ బాలీవుడ్ లో భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్ సినిమా రామాయణం. ఈసినిమా పార్ట్ 1లో యశ్ కనిపిస్తాడు. మొదటి భాగంలో అతని పాత్ర నిడివి తక్కువ. సినిమాలో రావణుడి పాత్రను యష్ పోషిస్తున్నాడు. అతను ఈ సినిమాకు సహ నిర్మాత కూడా. ఈ సినిమా 2026 దీపావళికి విడుదల కానుంది.
67
రామాయణం పార్ట్ 2లో
యశ్ రామాయణం పార్ట్ 2లో కూడా ఉన్నాడు. ఇందులో అతని పాత్ర నిడివి ఎక్కువ. ఈ సినిమాలో సాయి పల్లవి, రణబీర్ కపూర్, రవి దూబే, సన్నీ డియోల్ ప్రధాన పాత్రల్లో ఉన్నారు. రణ్ బీర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. ఈ సినిమా 2027 దీపావళికి విడుదల అవుతుంది. రామాయణం రెండు భాగాల బడ్జెట్ దాదాపుగా 4000 కోట్లు.
77
2007లో సినీ రంగ ప్రవేశం
యశ్ చిన్న హీరోగా 2007లో సినీ రంగ ప్రవేశం చేశాడు. జంబాడ హుడుగి, మొగ్గిన మనసు, రాకీ, గూగ్లీ, రాజా హులి, గజకేసరి, మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి, మాస్టర్‌పీస్, సంతు స్ట్రెయిట్ ఫార్వర్డ్ సహా 21 సినిమాల్లో నటించాడు. 2018లో వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 1తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందాడు.