Published : Dec 26, 2025, 02:04 PM ISTUpdated : Dec 26, 2025, 02:11 PM IST
ఈ ఏడాది చిన్న సినిమాలతో విజయం సాధించి క్రేజ్ పొందిన ఐదుగురు హీరోయిన్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ జాబితాలో కోర్ట్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిత్రాల నటీమణులు ఉన్నారు.
టాలీవుడ్ కి ఈ ఏడాది మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చాయి. కొన్ని పెద్ద సినిమాలు సక్సెస్ అయ్యాయి. కొన్ని చిత్రాలు దారుణంగా నిరాశ పరిచాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలనం సృష్టించిన చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది చిన్న సినిమాలతో విజయం సాధించిన టాప్ 5 హీరోయిన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
26
కోర్ట్ - శ్రీదేవి అప్పాల
నేచురల్ నాని నిర్మించిన కోర్ట్ చిత్రంలో ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి అప్పాల, శివాజీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో శ్రీదేవి అప్పాల పెర్ఫార్మెన్స్ కి యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు.
36
శుభం - శ్రీయ కొంతం
సమంత నిర్మించిన హారర్ కామెడీ చిత్రం శుభంలో శ్రీయ కొంతం హీరోయిన్ గా నటించారు. వైవిధ్యమైన పాత్రలో ఆమె నటన విశేషముగా ఆకట్టుకుంది. శ్రీయ కొంతంకి మంచి గుర్తింపు దక్కింది.
ఈ ఏడాది సంచలనం సృష్టించిన చిన్న సినిమాల్లో లిటిల్ హార్ట్స్ ఒకటి. యువనటుడు మౌళి తనూజ్ నటన ఈ మూవీకే హైలైట్ గా నిలిచింది. హీరోయిన్ గా నటించిన శివానీ నాగారం కూడా అదే స్థాయిలో పెర్ఫార్మెన్స్ అందించారు.
56
రాజు వెడ్స్ రాంబాయి - తేజస్విరావు
ఇటీవల విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి ఎమోషనల్ లవ్ స్టోరీగా విజయం సాధించింది. ఈ చిత్రంలో అఖిల్ రాజ్, తేజస్విరావు జంటగా నటించారు. తెలంగాణ అమ్మాయిగా తేజస్వి రావు నటన కట్టిపడేసేలా ఉంటుంది.
66
కన్యా కుమారి - గీత్ షైనీ
చిన్న సినిమాగా విడుదలైన కన్యాకుమారి చిత్రం ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతోంది. శ్రీకాకుళం నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో హీరోయిన్ గీత్ షైనీ తన పెర్ఫార్మెన్స్ అదరగొట్టేసింది.
మొత్తంగా ఈ ఏడాది విడుదలైన చిన్న సినిమాలతో ఈ ఐదుగురు హీరోయిన్లు ఆకట్టుకున్నారు. ముఖ్యంగా శ్రీదేవి అప్పాల, శ్రీదేవి నాగారం, తేజస్వి రావు యువతలో చెరగని ముద్ర వేశారు.