నాగార్జున సినిమాల్లో తనకు ఏమాత్రం నచ్చని ఏకైక మూవీ ఏదో తెలుసా?

Published : Dec 26, 2025, 12:24 PM IST

అక్కినేని వారసుడుగా ఇండస్ట్రీలోకి వచ్చి.. తన ట్యాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగాడు కింగ్ నాగార్జున. ఆయన కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ తో పాటు.. డిజాస్టర్స్ కూడా ఉన్నాయి. మరి నాగ్ సినిమాల్లో ఆయనకు అస్సలు నచ్చని మూవీ ఏంటో తెలుసా?

PREV
15
వారసత్వంగా ఇండస్ట్రీలోకి వచ్చి..

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వారసత్వంతో ఎంట్రీ ఇచ్చి.. స్టార్ గా మారిన హీరోలలో అక్కినేని నాగార్జున ఒకరు. తండ్రి వారసత్వం తీసుకున్నా.. తనదైన స్టైల్, మ్యానరిజం తో.. తనను తాను నిరూపించుకున్నాడు. ప్రత్యేకంగా అభిమానులను కూడా సంపాదించుకున్నాడు నాగార్జున. ఆయన చేసిన సినిమాలు ఆయనను స్టార్ హీరోగా నిలబెట్టడమే కాకుండా, ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి. కెరియర్ బిగినింగ్ నుంచి నాగార్జునన డిఫరెంట్ స్టోరీస్ ను సెలెక్ట్ చేసుకుంటూ.. దూసుకుపోయాడు. రొమాంటిక్ హీరోగా పేరున్న నాగ్ ను టాలీవుడ్ మన్మధుడు అని కూడా పిలుస్తుంటారు.

25
వరుసగా ఫ్లాప్ సినిమాలు

కాలక్రమంలో టాలీవుడ్‌లో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నాగార్జున తన స్టైల్ ను, కథలను మార్చుకుంటూ.. మాస్ సినిమాల వైపు కూడా మొగ్గు చూపారు. అయితే ఇటీవల కాలంలో నాగార్జున నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. వరుసగా ఫ్లాప్ సినిమాలు ఎదురవడం వల్ల ఆయన కెరియర్‌పై చర్చ మొదలైంది. ఎప్పుడూ డిఫరెంట్ సినిమాలను ట్రై చేసే నాగార్జున, తన తోటి హీరోలతో పోటీ పడలేకపోతున్నాడనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

35
కింగ్ నాగార్జున 100వ సినిమా

కింగ్ నాగార్జున ప్రస్తుతం సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈక్రమంలోనే ఆయన తన 100వ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో భారీ కంబ్యాక్ ఇవ్వాలని గట్టి ప్రయత్నంలో ఉన్నాడు. అందుకే 100 వ సినిమాను.. ఆయన చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు. కథ, దర్శకుడు, ప్రాజెక్ట్ స్థాయి విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే.. భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది

45
నాగార్జునకు నచ్చని సినిమా..

నాగార్జున కెరియర్‌లో భారీ డిజాస్టర్లుగా నిలిచినవాటిలో.. ఒక సినిమా ఆయనకు కూడా నచ్చలేదట. ఆసినిమా ఏదో కాదు.. భాయ్. అవును ఈ సినిమా నాగార్జున ఇమేజ్‌పై ప్రతికూల ప్రభావం చూపించిందని ఆయన అభిప్రాయం.. వీరభద్రం చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన భాయ్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలు చేసినందుకు నాగార్జున చాలా కాలం నిరాశపడ్డారంట. ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇక మొత్తానికి హిట్ కోసం వెయిట్ చేస్తున్న కింగ్ 100వ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. మరి ఈసినిమా అయినా నాగ్ కు హిట్ అందిస్తుందో లేదో చూడాలి.

55
66 ఏళ్ల కుర్రాడు

టాలీవుడ్ మన్మధుడు నాగార్జునకు పేరుకే 66 సంవత్సరాలు.. మనసు మాత్రం ఇంకా 30 దగ్గరే ఆగిపోయింది. నాగార్జునకు ఏజ్ పెరిగేకొద్ది పిట్ నెస్ తో పాటు గ్లామర్ కూడా పెరుగుతూ వస్తోంది. ఈ ఏజ్ లో కూడా ఫిట్ నెస్ ,జిమ్ ను మెయింటేన్ చేస్తూ.. ఇండస్ట్రీలో కూడా దూసుకుపోతున్నాడు నాగార్జున. అమ్మాయిల మనసులో కలల రాకుమారిడిగా మారిన నాగ్ కు టాలీవుడ్ లో మన్మధుడు అన్న పేరుంది. ఈమధ్యే 66 లోకి అడుగు పెట్టిన కింగ్ .. వయసు పెరుగుతున్నా కొద్ది గ్లామర్, ఫిట్నెస్ కూడా పెంచుకుంటూ.. అంతకు ముందు కంటే ఎక్కువ ఉత్సాహంతో దూసుకుపోతున్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories