వారణాసి లో మహేష్ బాబు తండ్రి పాత్రను మిస్సైన ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?

Published : Dec 16, 2025, 09:26 AM IST

Varanasi : మహేష్, రాజమౌళి కాంబో వారణాసి  షూటింగ్ సూపర ఫాస్ట్ గా జరుగుతోంది. ఈ సినిమాలో మహేష్, ప్రియాంక, ఫృథ్వీ తప్పించి, ఇతర నటులపై క్లారిటీ ఇ్వవలేదు జక్కన్న. మరీ ముఖ్యంగా మహేష్ బాబు తండ్రిగా నటిస్తున్నది ఎవరు? ఈ పాత్రను మిస్సై ముగ్గురు హీరోలెవరు?

PREV
15
సూపర్ ఫాస్ట్ గా వారణాసి షూటింగ్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ వారణాసి. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోన్న ఈసినిమా షూటింగ్ ఎలాంటి హడావుడి లేకుండా.. కామ్ గా పూర్తవుతోంది. జక్కన్న ఈసారి చాలా స్పీడ్ గా సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన కెరీర్ లోనే ఈసినిమా సూపర్ ఫాస్ట్ గా పూర్తి చేసిన రికార్డ్ సాధించబోతున్నట్టు తెలుస్తోంది. షూటింగ్ అయితే అయిపోతుంది కానీ.. ఇప్పటి వరకూ ఈసినిమా లో మహేష్, ప్రియాంక, పృథ్వీరాజ్ సుకుమారన్ తప్పించి, ఇతర పాత్రలపై రాజమౌళి ఎటుంటి అధికారిక ప్రకటన చేయలేదు, క్లారిటీ కూడా ఇవ్వలేదు. ఇంతకీ ఈసినిమాతో ఇంకా ఎవరెవరు నటిస్తున్నారు. ఈ సినిమాకు కీలకంగా నిలిచే మహేష్ తండ్రి పాత్రలో కనిపించబోయేది ఎవరు? ఆ పాత్రను మిస్సైన ముగ్గరు హీరోలు ఎవరో తెలుసా?

25
మహేష్ బాబు తండ్రి పాత్ర కోసం వేట

ఈ క్రమంలో మహేష్ బాబు తండ్రి పాత్ర కోసం వారణాసి టీమ్ చాలా హోమ్ వర్క్ చేసింది. అందుకోసం చాలామందిని టీమ్ సంప్రదించినట్టు తెలుస్తోంది. ముందుగా ఈ క్యారెక్టర్ కోసం టాలీవుడ్ సీనియర్ హీరో, కింగ్ అక్కినేని నాగార్జునను జక్కన్న టీమ్ అనుకున్నారట. నాగార్జున కూడా ముందుగా ఈ పాత్ర కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. ఆతరువాత ఎందుకో ఈ సినిమా నుంచి ఆయన తప్పుకున్నారన్న టాక్ వినిపించింది. ఆ తరువాత మహేష్ తండ్రి పాత్ర కోసం తమిళ స్టార్ హీరో విక్రమ్ ను కలిశారట వారణాసి టీమ్. చియాన్ విక్రమ్‌ ఈ క్యారెక్టర్ తనకు సూట్ కాదని భావించి తిరస్కరించినట్టు తెలుస్తోంది.

35
వారణాసిని మిస్సైన ముగ్గురు హీరోలు

ఇక నాగార్జు, విక్రమ్ తరువాత  ఫైనల్ గా వారణాసి బృందం ఇటీవల మాధవన్‌ను కూడా సంప్రదించింది. ఆయన ఈ పాత్ర చేయడానికి అంగీకరించడంతో పాటు లుక్ టెస్టులు కూడా నిర్వహించారు. అయితే లుక్ టెస్ట్ అనంతరం దర్శకుడు రాజమౌళి కి పూర్తి స్థాయిలో సంతృప్తి కలగకపోవడంతో, మాధవన్‌ను కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించినట్టు సమాచారం. మొన్నటి వరకూ ఈసినిమాలో మాధవన్ నటిస్తున్నాడని ప్రచారం జరిగింది. ముందుగా ఈసినిమాలో హనుమంతుని పాత్ర కోసం మాధవన్ ను తీసుకున్నారని అన్నారు.. ఆతరువాత హనుమాన్ పాత్రకు కాదు.. మహేష్ తండ్రి పాత్ర కోసం మాధవన్ ను తీసుకున్నారని ప్రచారంజరిగింది. కానీ ఇప్పుడు ఆయన కూడా ఈసినిమాలో నటించడంలేదని తెలుస్తోంది. ఇలా ముగ్గరు స్టార్ హీరోలు వద్దు అనుకున్న ముఖ్యమైన పాత్రలో ఎవరిని తీసుకున్నారో తెలుసా?

45
మహేష్ బాబుతో హిట్ కాంబినేషన్ ..

ఇక మమే చివరకు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌ను సంప్రదించగా, ఆయనకు నిర్వహించిన లుక్ టెస్ట్ రాజమౌళి విజన్‌కు పూర్తిగా మ్యాచ్ కావడంతో, మహేష్ బాబు తండ్రి పాత్రకు ఆయనను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అంతే కాదు ప్రకాష్ రాజ్ షూటింగ్ సెట్స్‌లోకి కూడా ఎంట్రీ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. మహేష్ బాబు, ప్రకాష్ రాజ్‌లది తండ్రి కొడుకులుగా హిట్ కాంబినేషన్. ఇప్పటి వరకు వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి. మహేష్ బాబు సినిమాల్లో ప్రధానంగా విలన్ పాత్రలు చేసిన ప్రకాష్ రాజ్, ఆతరువాతి కాలంలో తండ్రి పాత్రల్లో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ‘దూకుడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘మహర్షి’ వంటి సినిమాల్లో ఈ కాంబో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మరి వారణాసిలో ప్రకాష్ రాజ్ నిజంగా మహేష్ బాబు తండ్రిగా నటిస్తున్నాడా లేదా అనేది.. జక్కన్న అపీషియల్ గా అనౌన్స్ చేస్తేనే తెలుస్తుంది. ఇది నిజం అయితే రాజమౌళి ప్రకాష్ రాజ్ ను ఎలా చూపించబోతున్నాడు అనేది కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్.

55
రాజమౌళి కాంబినేషన్ లో రెండో సినిమా

ప్రకాష్ రాజ్ గతంలో ఎప్పుడూ రాజమౌళి సినిమాల్లో పెద్దగా కనపించలేదు. ఒక్క విక్రమార్కుడు సినిమాలో.. అది కూడా లిమిటెడ్ సీన్స్ ఉన్న డిఐజీ పాత్రలో ప్రకాశ్ కనిపించాడు. ఆతరువాత ఏ సినిమాలోను ప్రకాష్ రాజ్ కు అవకాశం రాలేదు. విలక్షణ నటుడిగా పేరున్న ప్రకాష్ రాజ్ కు జక్కన్న ఏ సినిమాలోను అవకాశం ఇవ్వకపోవడం ఆశ్చర్యకరమైన విషయమే. విక్రమార్కుడు తరువాత ఇన్నేళ్లకు మళ్లీ ఈ ఇద్దరూ కలిసి పనిచేస్తునట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయం రాజమౌళి ఇంత వరకూ అఫీషియల్ గా మాత్రం ప్రకటించలేదు. ఇదే నిజమయితే... మహేష్ బాబు, రాజమౌళి, ప్రకాష్ రాజ్ కాంబినేషన్ మరోసారి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ అవుతుందో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories