Karthika Deepam 2 Latest Episode: జ్యోకు చెమటలు పట్టించిన కాశీ- జ్యో ఆ ఇంటి బిడ్డ కాదన్న శ్రీధర్

Published : Dec 16, 2025, 07:58 AM IST

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (డిసెంబర్ 16వ తేదీ)లో జ్యో దొంగ లెక్కలు రాసి కంపెనీని లాస్ చేసిందన్న శ్రీధర్. జ్యోకు షాక్ ఇచ్చిన కాశీ. నువ్వు ఎక్కడికైనా పారిపో జ్యో అన్న పారు. జ్యోత్స్న ఆ ఇంటి వారసురాలు కాదన్న శ్రీధర్. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

PREV
17
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ మంగళవారం ఎపిసోడ్ లో కార్తీక్, శ్రీధర్ కలిసి టీ తాగుతూ ఉంటారు. ఫుడ్ ట్రక్ ఐడియా ఇంత ఫాస్ట్ గా సక్సెస్ అవుతుందని అనుకోలేదు. అర్జెంటుగా ఈ గుడ్ న్యూస్ అమ్మకు చెప్పాలి అంటాడు కార్తీక్. అప్పుడే వద్దు అంటాడు శ్రీధర్. ఎందుకు మాస్టారు. మీరు చెప్తారా? అంటాడు కార్తీక్. లేదు ఇంకా కొన్ని చోట్ల మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఫుడ్ మిగులుతోంది అంటాడు శ్రీధర్. సక్సెస్ ని ఎంజాయ్ చేయాలి మాస్టారు అంటాడు కార్తీక్.

నేను నీకు ఒక విషయం చెప్పాలిరా అంటాడు శ్రీధర్. కంపెనీకి నష్టాలు రావడానికి కారణం బిజినెస్ సరిగ్గా జరగకపోవడం కాదు. వచ్చిన లాభాలను లెక్కల్లో చూపించకపోవడం అని చెప్తాడు శ్రీధర్. షాక్ అవుతాడు కార్తీక్. 

మొన్నటి 2 కోట్ల స్కామ్ శాంపిల్ మాత్రమే. అలాంటివి జ్యోత్స్న చాలా చేసింది అని చెప్తాడు శ్రీధర్. ఎంత మాస్టారు అంటాడు కార్తీక్. లెక్కలు బయట పెడ్తే.. శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత అంటాడు శ్రీధర్. జ్యోత్స్న ఆ ఇంటి బిడ్డ కాదు అంటాడు శ్రీధర్. షాక్ అవుతాడు కార్తీక్.

27
పారును రెచ్చగొట్టిన జ్యో

మరోవైపు శ్రీధర్ కోసం కారు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు కాశీ. నీ మనుమడిని చూస్తే నీకు ఏం అనిపిస్తోంది గ్రానీ అంటుంది జ్యోత్స్న. కొన్ని జాతకాలను ఎవ్వరూ మార్చలేరు అంటుంది పారు. నువ్వు మార్చొచ్చు కదా అంటుంది జ్యోత్స్న. ఏం చేస్తే నీ మనుమడు ఆ ఉద్యోగం మానేస్తాడో ఆలోచించు అంటుంది జ్యోత్స్న. వెంటనే చీర కొంగులో దాచుకున్న డబ్బులు తీస్తుంది పారు.

37
కాశీని అవమానించిన పారు

కాశీ దగ్గరకు వెళ్లి.. ఒరేయ్ డ్రైవర్.. ఈ 50 రూపాయలు తీసుకొని బయటకు వెళ్లి టీ తాగి రారా అని చీప్ గా మాట్లాడుతుంది పారు. నేను డ్రైవర్ ను కాదు పీఏని అంటాడు కాశీ. డ్రైవర్ వి కాకపోతే ఇక్కడ ఏం చేస్తున్నావురా అంటుంది పారు. నువ్వు పీఏవి అయితే ఆఫీస్ లో పని చేయాలి. ఇక్కడ నీకు ఏం పని. మామ దగ్గర పీఏ గా పనిచేయాల్సిన కర్మ నీకేంటి? జాబ్ లేకపోతే ఖాళీగా ఉండు. ముందు ఈ జాబ్ మానేయ్ అని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది పారు. పారుకు వత్తాసు పలుకుతుంది జ్యోత్స్న.

47
జ్యోకు షాక్ ఇచ్చిన కాశీ

తప్పులు బయట పడనంత వరకు అందరూ నీలాగే నీతులు చెప్తారు. నా గురించి తర్వాత ఆలోచిద్దువు కానీ ముందు నిన్ను నువ్వు కాపాడుకో అని జ్యోత్స్నతో అంటాడు కాశీ. నీ తప్పుల గురించి త్వరలోనే బయటపడుతుంది అంటాడు. నా మనుమరాలు ఏం తప్పు చేసిందిరా అంటుంది పారు. దొంగ లెక్కలు రాసి డబ్బులు కొట్టేసింది అంటాడు కాశీ. వణికిపోతుంది జ్యోత్స్న. నువ్వు చేసిన స్కామ్ లన్నీ మా మామయ్య లెక్క కడుతున్నారు. మరో రెండు రోజుల్లో నిన్ను అందరి ముందు నిలబెడతారు అంటాడు కాశీ.

57
ఆ ఇంటి వారసురాలు కాదు

మరోవైపు జ్యోత్స్న ఆ ఇంటి వారసురాలు కాదు అంటాడు శ్రీధర్. నీకు ఎందుకు అలా అనిపించింది మాస్టారు అంటాడు కార్తీక్. తను నిజంగా శివన్నారాయణ మనుమరాలు అయితే ఈ ఆస్తి మొత్తం తనదే కదా.. అలాంటప్పుడు తను ఈ దొంగ లెక్కలు చేయాల్సిన అవసరం ఏంటి? నువ్వు నాతో మాట్లాడకపోయినా, నాకు దూరంగా ఉన్నా.. నాకు హాని చేయాలని అనుకుంటావా? అని అడుగుతాడు శ్రీధర్.

అనుకోను అంటాడు కార్తీక్. ఎందుకంటే నేను నీ తండ్రిని. మన మధ్య ఆ బంధం ఉంది. కానీ జ్యోత్స్న అలాంటి పనులు చేస్తుందంటే తను కచ్చితంగా ఆ ఇంటి వారసురాలు కాదు అంటాడు శ్రీధర్. కంగారు పడుతాడు కార్తీక్. ఇప్పటివరకు నాకు అనుమానం మాత్రమే ఉండేది. నీ కంగారు చూస్తుంటే అదే నిజమని అనిపిస్తోంది అంటాడు శ్రీధర్.

నలుగురికి పంచాల్సిన లాభాలను తన స్వార్థం కోసం వాడుకోవడం చాలా తప్పు. జ్యోత్స్నకు కచ్చితంగా శిక్ష పడాలి. ప్రూఫ్స్ తో సహా నువ్వు జ్యోత్స్నచేసిన తప్పులను అందరి ముందు బయటపెట్టు అంటాడు కార్తీక్. నిజం చెప్తే ఫ్యామిలీ ఎలా తీసుకుంటుందో అంటాడు శ్రీధర్. అన్నీ తాత చూసుకుంటాడు అని చెప్తాడు కార్తీక్.

67
నా కలలో వచ్చింది నిజం అయ్యేలా ఉంది

కాశీ మాటలను గుర్తుచేసుకుంటూ వణికిపోతుంది జ్యోత్స్న. తప్పు చేసేముందు నాకు చెప్పి చేయమని ఎన్నిసార్లు చెప్పాను అని జ్యోపై సీరియస్ అవుతుంది పారు. అసలు ఎంత కొట్టేశావ్? ఏం చేశావు అని అడుగుతుంది పారు. మళ్లీ నేనే సీఈఓ అవుతాను అనుకొని లెక్కలు కూడా చూసుకోలేదు గ్రానీ అంటుంది జ్యోత్స్న. నువ్వు ఇక్కడ ఉండొద్దు ఎక్కడికైనా పారిపో అంటుంది పారు.

మామయ్య సీఈఓ అయ్యాడు కదా.. చక్కగా ఆ పనిచేసుకోక పాత లెక్కలన్నీ ఎందుకు తీస్తున్నాడు అంటుంది జ్యోత్స్న. నీ దొంగ లెక్కలన్నీ మీ తాత ముందు పెడితే నీ పరిస్థితి ఏంటీ? అంటుంది పారు. నా కలలో వచ్చింది నిజం అయ్యేలా ఉంది. నిన్ను పోలీసులు తీసుకెళ్తారు. నువ్వు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నావు అంటుంది పారు. ఇంతలో కాఫీ కప్ తో దీప ఎంట్రీ ఇస్తుంది. ఇద్దరూ షాక్ అవుతారు.

77
నీ గురించే నా బాధ

నువ్వు ఎప్పుడు వచ్చావు? లోపలికి వచ్చేముందు తలుపు తట్టాలని తెలియదా అంటుంది పారు. తలుపు తీసే ఉంది అమ్మగారు అంటుంది దీప. మీరు ఇద్దురూ దేనికి అంత కంగారు పడుతున్నారు? మీ ముఖాల్లో భయం కనపడుతోంది ఎందుకు అని అడుగుతుంది దీప. 

నీ గురించే మా కంగారు అంటుంది పారు. నా గురించా.. నాకేమైంది అంటుంది దీప. మొన్న నువ్వు కింద పడబోయావు కదా.. అలాగే మళ్లీ జరుగుతుందని నా భయం అంటుంది పారు. నా బిడ్డను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అంటుంది దీప. నా కూతురు జోలికి వస్తే ఏం జరిగిందో తెలుసు కదా.. ఈ బిడ్డ జోలికి వచ్చినా అదే జరుగుతుంది అంటుంది దీప. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories