Illu Illalu Pillalu Today Episode Dec 16: అమూల్య ప్రేమ వేషాలు కళ్లారా చూసిన పెద్దోడు, నాన్నకి చెప్పేందుకు సిద్ధం

Published : Dec 16, 2025, 09:13 AM IST

Illu Illalu Pillalu Today Episode Dec 16: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో సాగర్ తాగి నర్మద ముందు ఓవరాక్షన్ చేయడం మొదలు పెడతాడు. పెద్దోడు అమూల్య విశ్వ కోసం చేసే పనులు కళ్లారా చూసేస్తాడు. వాటిని ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోండి 

PREV
14
తాగి తూగిన అన్నదమ్ములు

ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో సాగర్ తాగేసి గదిలోకి వస్తాడు. నర్మదా స్నానం చేసి తల తుడుచుకుంటూ ఉంటుంది. ఇక సాగర్ మల్లెపూలు తెచ్చి నర్మదకు ఇస్తాడు. సాగర్ ని తాగినట్టు గుర్తుపట్టేస్తుంది నర్మద. దాంతో రెండు దెబ్బలు వేస్తుంది. ఇక ఇద్దరి మధ్య కాసేపు రొమాంటిక్ సంభాషణ కొనసాగుతుంది. ఎప్పుడు ఏడుపు ముఖంతో ఉండే సాగర్ ఈ ఎపిసోడ్లో మాత్రం తాగేసి చాలా రొమాంటిక్ గా నటించాడు. కాసేపు ప్రేమ కవితలు చెప్పి టైం పాస్ చేశాడు. తర్వాత మంచం మీద పడి నిద్రపోతాడు. ఇక 

అక్కడ నుంచి సీన్.. ధీరజ్ దగ్గరికి మారుతుంది. ధీరజ్ కూడా బాగా తాగి గదిలోకి వచ్చి డ్యాన్సులు వేయడం మొదలు పెడతాడు. ధీరజ్ తాగేసి గోడకి ఉన్న ప్రేమ డ్రెస్సును చూసి తిడుతూ ఉంటాడు. ఈలోపు అక్కడికి ప్రేమ వచ్చేస్తుంది. ధీరజ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ వేషాలు వేస్తూ ఉంటాడు. ‘నీకు తిక్క, నీ బాబుకు తిక్క, నీ కుటుంబంలో అందరికీ తిక్క’ అంటూ ప్రేమను రెచ్చగొడుతూ ఉంటాడు. ఇద్దరు మళ్లీ ఒకరిపై ఒకరు అరుచుకుంటూ ఉంటారు. ప్రేమను పొట్టి దానా అని అంటాడు ధీరజ్. దాంతో విపరీతంగా కోపం వస్తుంది ప్రేమకు.

24
మరో పక్క వల్లీ ఏడుపు

ఇక ధీరజ్ లోని రొమాంటిక్ యాంగిల్ బయటకు వస్తుంది. కోపంలో కూడా భలే ముద్దొస్తున్నావ్.. క్యూట్ గా ఉన్నావు అంటూ ప్రేమ బుగ్గలు పట్టుకుంటాడు ధీరజ్. దాంతో ప్రేమ చాలా ఆశ్చర్య పడుతుంది. తన మనసులో ఉన్న మాటలు అన్నీ తాగేసి బయటికి చెప్పేస్తాడు ధీరజ్. తర్వాత ప్రేమకు ముద్దు పెట్టి కౌగిలించుకుంటాడు. దాంతో ప్రేమ షాక్ అవుతుంది. బ్యాగ్రౌండ్ లో ప్రేమ పాటలు వేసి ఆ సీను మొత్తం రొమాంటిక్ గా మార్చేశారు. ఇక వల్లి విషయానికి వస్తే రాత్రి బట్టలు ఉతికేందుకు సిద్ధమైపోతుంది. కానీ చలిలో బట్టలు ఉతకలేక తెగ ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. మరోపక్క నర్మద సాగర్, ప్రేమ ధీరజ్ ప్రేమ పాటలు, డ్యాన్సులు మొదలు పెట్టేస్తారు. నర్మద, సాగర్ డ్యాన్స్ ఇరగదీస్తారు. ప్రేమ వెంటపడుతూ ధీరజ్ ఏడిపిస్తూనే ఉంటాడు.

 మరో పక్క వల్లి మాత్రం ఏడుస్తూ ఉంటుంది. నేను కూడా మా ఆయనతో డాన్స్ చేస్తా అంటూ తన భర్త దగ్గరికి వెళుతుంది. గదిలో పెద్దోడు కూర్చొని చాలా సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వల్లి తిప్పుకుంటూ భర్త దగ్గరికి వెళుతుంది. కానీ పెద్దోడు ఏమాత్రం ఆమె వైపు చూడడు. వల్లి రాగానే ‘అమూల్య విషయం నాకు ఏమీ అర్థం కావడం లేదు’ అంటాడు. దాంతో వల్లి ఆనందం మొత్తం ఆవిరైపోతుంది. పెళ్ళాం రొమాంటిక్ గా చెయ్యేస్తే ఆ విషయం కూడా అర్థం కావడం లేదు నా భర్తకి అంటూ తలబాదుకుంటుంది. అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతుంది.

34
అమూల్య ప్రేమ వేషాలు

ఉదయం అయ్యాక పెద్దోడు ఇంటి ముందు కూర్చుని అమూల్య, విశ్వ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ‘నాకు తెలిసిన తర్వాత కూడా నాన్నకు చెప్పకపోవడం తప్పనిపిస్తోంది. విశ్వ పెద్ద చెత్త వెధవ. అసలే పగతో ఉన్నాడు. ఆ పగతో అమూల్య జీవితాన్ని రిస్క్ లో పడేస్తే’ అని ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయానికి అమూల్య వస్తుంది. విశ్వ ఇంటి వైపు చూస్తూ నేను కాలేజ్ కి బయలుదేరుతున్నాను అని అరుస్తూ ఉంటుంది. అది పెద్దోడు చూస్తాడు. కానీ పెద్దోడిని అమూల్య చూసుకోదు. విశ్వ ఇంటి వైపే చూస్తూ అమూల్య పదేపదే నేను కాలేజీకి బయలుదేరుతున్నాను అంటూ చెప్పడం పెద్దోడు గమనించేస్తాడు. ఇదంతా చూసి పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది.. అమూల్య జీవితానికి కోలుకోలేని నష్టం జరగవచ్చు.. ఇక ఆలస్యం చేయకుండా నాన్నకు చెప్పేయాలి అనుకుని పెద్దోడు బయలుదేరుతాడు.

44
నాన్నకు చెప్పేందుకు సిద్ధమైన పెద్దోడు

ఇంట్లోకి వచ్చి నాన్న నాన్న అంటూ పిలుస్తాడు. అయితే వేదవతి వచ్చి నాన్న పేపర్ తెచ్చుకోవడానికి బయటికి వెళ్లారని చెబుతుంది. తల్లికి అసలు విషయం చెబుదాం అనుకుంటాడు కానీ ఆగిపోతాడు పెద్దోడు. కానీ వేదవతి వదలకుండా ‘నువ్వు ఏదో విషయం దాస్తున్నావు. రాత్రి కూడా ఇలాగే టెన్షన్ పడ్డావు. మీ నాన్నకి ఏదో విషయం చెప్పబోయావు కానీ వల్లి కాలికి దెబ్బతగలడంతో అందరం ఆ విషయం మర్చిపోయాను. చెప్పు ఏమైంది’ అని గట్టిగా అడుగుతుంది వేదవతి. కానీ పెద్దోడు మాత్రం నాన్న వచ్చాకే మాట్లాడుతానని అంటాడు. పెద్దోడు ఇంట్లో ఉండి వాళ్ళ నాన్న కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. రామరాజు పేపర్ కొనుక్కొని తిరుపతి తో కలిసి ఇంటికి వస్తూ ఉంటారు. పెద్దోడు ఇంటి ముందు నిల్చుని వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ లోపు రామరాజు కూడా ఇంటికి వచ్చేస్తాడు. ఇక్కడితో ఎపిసోడ్ ముగిసిపోతుంది. పెద్దోడు వాళ్ళ నాన్నకి విషయం చెబుతాడో లేదో రేపటి ఎపిసోడ్లో తేలుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories