Actress: ఏడాదిలో మూడు సినిమాలు చేస్తే అన్నీ ఫ్లాపే.. అందం ఉన్నా అదృష్టం లేని చిన్నది.. ఎవరంటే.?

Published : Oct 11, 2025, 10:20 AM IST

Actress: ఈ హీరోయిన్ ఏడాదిలో మూడు సినిమాలు రిలీజ్ చేసింది. తీరా చూస్తే అవి మూడు బాక్సాఫీస్ దగ్గర ప్లాఫ్‌లుగా నిలిచాయి. తన అదృష్టాన్ని దక్షిణాది వైపున పెట్టుకుంది. మరి ఆమె ఎవరో తెలుసా.?

PREV
15
నెపో కిడ్స్ కూడా కష్టమే..

సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే.. అందంతో పాటు కూసింత అదృష్టం కూడా కలిసిరావాలి. అలాగే నెపో కిడ్స్ అయినంత మాత్రాన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకోలేరు. ఎప్పుడోకప్పుడు తన ఫేం కోల్పోవాల్సింది. ఈ బ్యూటీ పరిస్థితి కూడా అంతే.! ఏడాదిలో మూడు చిత్రాలు చేస్తే అన్నీ ఫ్లాపే.. ఇప్పుడు దక్షిణాదిపైనే తన ఆశలు పెట్టుకుంది. మరి ఆ భామ మరెవరో కాదు.. జాన్వీ కపూర్.

25
శ్రీదేవి కూతురుగా అరంగేట్రం

అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. 2018లో 'ధడక్' సినిమాతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసి.. మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత 'గుంజన్ సక్సేనా' మూవీతో నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది.

35
చేసినవి 15 చిత్రాలు.. హిట్స్ మాత్రం..

తన సినీ కెరీర్‌లో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేసినవి 15 చిత్రాలే అయినప్పటికీ.. హిట్స్ విషయానికొస్తే వేళ్ల మీద లేక్కపెట్టుకోవాలి. ఆమెకు బాలీవుడ్‌లో ఒకట్రెండు సినిమాలు హిట్ కాగా.. తెలుగులో చేసిన 'దేవర' మూవీ బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్ సాధించింది.

45
ఏడాదిలో మూడు సినిమాలు..

ఇక ఈ ఏడాది జాన్వీ కపూర్ నుంచి ఏకంగా మూడు సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఒకటి నీరజ్ ఘయ్వాన్ దర్శకత్వం వహించిన 'హోంబౌండ్' కాగా.. రెండోది సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా వచ్చిన 'పరమ్ సుందరి'.. మూడోది వరుణ్ ధావన్ హీరోగా నటించిన 'సన్నీ సంస్కారి కి తులసి కుమారి'.

55
అన్నీ ఫ్లాప్.. దక్షిణాదిపైనే ఆశలు

ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ప్లాఫ్స్‌గా మిగిలిపోయాయి. ఒక్క సినిమా కూడా జాన్వీని కాపాడలేకపోయాయి. దీంతో ఒక్క ఏడాదిలోనే మూడు ఫ్లాప్‌లు ఎదుర్కున్న జాన్వీ.. తన ఆశలన్నీ కూడా రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'పెద్ది' చిత్రంపైనే పెట్టుకుంది.

Read more Photos on
click me!

Recommended Stories