శ్యామ్ బెనెగల్.. కమర్షియల్ సినిమా రాజ్యమేలుతున్న సమయంలో ఇండియన్ సినిమా రూపురేఖలు మార్చిన దర్శకుడు, సమాంతర సినిమాతో ఇండియన్ సినిమాని కొత్త పుంతలు తొక్కించిన మేటి దర్శకుడు. తాను రూపొందించిన 24 సినిమాల్లో 14 సినిమాలకు జాతీయ అవార్డులు సాధించిన దర్శకుడు. భారతీయ సినిమాకి ఓ గౌరవాన్ని తీసుకొచిన లెజెండరీ దర్శకుడు శ్యామ్ బెనెగల్(90) నేడు (సోమవారం) కన్నుమూశారు. ముంబయిలోని వాకార్డ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఈ రోజు సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచినట్టు ఆయన కూతురు అధికారికంగా వెల్లడించింది.
Director Shyam Benegal passes away at 90
కిడ్నీ సమస్యతో కన్నుమూత..
శ్యామ్ బెనెగల్ ఇటీవలే(డిసెంబర్ 14న) తన 90వ పుట్టిన రోజుని జరుపుకున్నారు. సినిమా ప్రముఖలు, ఫ్రెండ్స్ తో ఈ వేడుక చేసుకున్నారు. ఇంతలోనే ఆయన యావత్ సినీ లోకాన్ని విషాదంలో ముంచెత్తారు. ఆయన చాలా రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారట. చాలా కాలంగా ఈ సమస్య వేధిస్తున్నా, ఇటీవల తీవ్రమైందని, దీని కారణంగానే ఆయన కన్నుమూసినట్టు ఆయన కూతురు పీటీఐతో తెలిపారు.
జాతీయ అవార్డులతో శ్యామ్ బెనెగల్ సంచలనం..
శ్యామ్ బెనెగల్ బెంగాల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నా, ఆయన హిందీ, బెంగాలీ, మరాఠీలో ఆయన సినిమాలు చేశారు. ఫిల్మ్ మేకర్ గా ఆయనకు 18 జాతీయ అవార్డులు రావడం విశేషం. పలు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, నంది అవార్డులు కూడా వరించాయి. శ్యామ్ బెనెగల్ సినిమాలే కాదు, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్స్, టీవీ సీరిస్‌లు కూడా రూపొందించారు. ఆయన సమాజంలోని సమస్యలను, సామాజిక అంశాలను, సమాజంలోని లోపాలను ఎత్తి చూపుతూ సినిమాలు రూపొందించారు. ప్రశంసలందుకున్నారు. సత్యజిత్ రే తర్వాత ఆ స్థాయి లెజెండరీ దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారు.
శ్యామ్ బెనెగల్ మన తెలుగువారు కావడం విశేషం..
శ్యామ్ బెనెగల్ బెంగాలీ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నా, ఆయన తెలుగు వారు కావడం విశేషం. ఆయన పుట్టింది హైదరాబాద్‌లోనే, అల్వాల్ ప్రాంతంలో ఉండేవారు. కొంకణి భాష మాట్లాడే చిత్రపుర్ సరస్వత బ్రహ్మిణ్ ఫ్యామిలీలో జన్మించారు. ఆయన అసలు పేరు శ్యామ్ సుందర్ బెనెగల్. ఆయన తండ్రి కర్నాటక నుంచి హైదరాబాద్‌కి వలస వచ్చారు. నాన్న శ్రీదర్ బెనెగల్ ఫోటోగ్రాఫర్, ఆయన వద్ద ఉన్న కెమెరాతో చిన్నషార్ట్ ఫిల్మ్స్ తీయడంతో కెరీర్‌ని ప్రారంభించారు శ్యామ్ బెనెగల్. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలోనే చదువుకున్నారు. ఎంఏలో ఎకనామిక్స్ చేశారు. ఆ తర్వాత సినిమాల్లోకి వెళ్లారు. ఆయన హైదరాబాద్ ఫిల్ సోసైటీని కూడా ఎస్టాబ్లిష్ చేశారు.
యాడ్స్ లో కాపీ రైటర్‌గా శ్యామ్ బెనెగల్..
ప్రారంభంలో ముంబయిలో అడ్వటైజర్ కంపెనీలో కాపీ రైటర్‌గా పనిచేశారు. క్రమంగా క్రియేటివ్ హెడ్‌గా మారారు. గుజరాతీలో తన మొదటి డాక్యుమెంటరీని రూపొందించారు. పేరు `ఘేర్ బెథా గంగా`. ఇది చేసిన పదేళ్లకి ఆయన సినిమాని రూపొందించారు. అంటే ఈ లోపు ఆయన ఇరవైకి పైగా డాక్యుమెంటరీలు రూపొందించారు. 1974లో `అంకుర్` అనే సినిమాని రూపొందించారు. అనంత్ నాగ్, షబానా అజ్మీ ఇందులో జంటగా నటించారు. ఈ మూవీ సంచలనాలు సృష్టించింది. తొలి చిత్రంతో యావత్ దేశాన్ని తనవైపు తిప్పుకున్నారు. తొలి చిత్రంతోనే జాతీయ అవార్డుని అందుకున్నారు.
శ్యామ్ బెనెగల్ సినిమాలు..
ఇలా `చరణ్‌దాస్ ఛోర్`, `నిశాంత్`, `మంథన్`, `భూమిక`, `కొండురా`, `జునాన్`, `కల్యూగ్`, `ఆరోహణ్`, `మండి`, `త్రికాల్`, `సుస్మన్`, `అంతర్నాద్`, `సూర్ కా సత్వన్ గోడా`, `మమ్మో`, `సర్దారి బేగమ్`, `ది మేకింగ్ ఆఫ్ ది మహాత్మ`, `సమర్`, `హరిభారి`, `జుబేదా`, `నేతాజి సుభాష్ చంద్రబోస్‌ః ది ఫర్‌గాటెన్ హీరో`, `వెల్‌కమ్ టూ సజ్జంపూర్`, `వెల్ డన్ అబ్బా` చిత్రాలు చేశారు. చివరగా గతేడాది `బుజిబ్‌ః ది మేకింగ్ ఆఫ్ నేషన్` అనే మూవీని రూపొందించారు. వీటిలో దాదాపు అన్నీ పారలల్ మూవీస్ కావడం విశేషం. అయితే ఈ చిత్రాలు కమర్షియల్‌గానూ సంచలనాలు సృష్టించడం మరో విశేషం.
read more: ఎన్టీఆర్ మాకు ఏ సాయం చేయలేదు, అభిమాని కౌశిక్ తల్లి ఆవేదన.. తెరపైకి సంచలన పుకార్లు
also read: నిర్మాతలకు ఎగ్జిబిటర్లు షాక్, రేవంత్‌రెడ్డికి మద్దతు.. `పుష్ప 2` దెబ్బకి అంతా తలకిందులు ?