ఎన్టీఆర్‌ మాకు ఏ సాయం చేయలేదు, అభిమాని కౌశిక్‌ తల్లి ఆవేదన.. తెరపైకి సంచలన పుకార్లు

First Published | Dec 23, 2024, 10:36 PM IST

ఎన్టీఆర్‌ అభిమాని కౌశిక్‌ క్యాన్సర్‌తో పోరాడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి సాయం చేస్తానని తారక్‌ ఇప్పటి వరకు ఎలాంటి సాయం చేయలేదట. 
 

Pushpa 2 allu arjun

ప్రస్తుతం రాష్ట్రంలో అల్లు అర్జున్‌ వివాదం హాట్‌ టాపిక్‌గా నడుస్తుంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందడం, ఆమె కొడుకు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండటంతో, అల్లు అర్జున్‌పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేయడం, దీనికి బన్నీ కౌంటర్‌ ఇవ్వడం హాట్‌ టాపిక్‌ అవుతుంది. బాలుడు శ్రీతేజ ప్రాణాలతో పోరాడుతుండటంతో అందరిని ఈ ఘటన కలచివేస్తుంది. ఈ ఘటన హీటెక్కిస్తుండగా, ఇప్పుడు మరో ఘటన తెరపైకి వచ్చింది. 

తిరుపతికి చెందిన ఎన్టీఆర్‌ అభిమాని కౌశిక్‌ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న ఘటన కలకలం రేపుతుంది. చాలా రోజులు క్రితం కౌశిక్‌ అనే కుర్రాడు క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌ కోసం ఆసుపత్రిలో చేరాడు. ఎన్టీఆర్‌పై తన అభిమానం చాటుకున్నారు. ఎన్టీఆర్‌ అన్నని చూడాలని ఎంతగానో కోరుకున్నాడు. ఈ విషయం ఎన్టీఆర్‌కి చేరింది. ఆయన ఫోన్‌లో కౌశిక్‌తో మాట్లాడాడు. ధైర్యం చెప్పాడు. తాను అండగా ఉంటానని, తాను చూసుకుంటానని కూడా చెప్పాడు. అయితే ఆ అభిమానికి ఎన్టీఆర్‌ ఎలాంటి ఆర్థిక సాయం చేయలేదట. 
 


తాజాగా కౌశిక్‌ తల్లి సరస్వతి మీడియా ముందుకు వచ్చింది. ఆమె తన కొడుకు ప్రాణాలతో పోరాడుతున్నాడని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయించండి సర్‌ అంటూ వేడుకుంది. 20లక్షలు కట్టాలని ఆసుపత్రి వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయని, తాను అంత కట్టే పరిస్థితి లేదని తెలిపింది. దయజేసి ఎవరైనా సాయం చేయండి సార్‌ అంటూ వేడుకుంది. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ గతంలో 2.5లక్షలు ఆర్థికసాయం చేశారని, మరికొందరు సాయం చేయడానికి ముందుకు వచ్చారని, వారందరికి ధన్యవాదాలు తెలిపారు. 
 

టీటీడీ వాళ్లు, కొందరు ఎన్టీఓ సంస్థలు, డోనర్స్ కలిసి ఇంతకాలం సహాయంచేశారని, దాని వల్లే రెండేళ్లుగా తమ అబ్బాయికి ట్రీట్‌మెంట్‌ ఇప్పించామని తెలిపింది. ఇంకా తాను ఆసుపత్రిలో ఉండలేను, డిప్రెషన్‌లోకి వెళ్లిపోతున్నా, ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లు మమ్మీ అని ఏడుస్తున్నాడు, ఇరవై లక్షలు చెల్లిస్తేనే డిశ్చార్జ్ చేస్తామని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయని, ఇప్పటి వరకు సహాయం చేశారు, ఈ ఒక్క సాయం చేయండి సర్‌ అంటూ ఆమె వేడుకుంది. ఇప్పుడు ఆమె వీడియో వైరల్‌ అవుతుంది. 
 

NTR, SS Rajamouli, Devara

కౌశిక్‌ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఆయనకు చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ పూర్తి అయ్యింది. ఈ విషయాన్ని కౌశిక్ తల్లి సరస్వతి విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. తమకు సాయం చేయాలని చెబుతూ, ఎన్టీఆర్‌ ఇప్పటి వరకు సాయం చేయలేదని, ఇకనైనా సాయం చేయాలని ఆమె వేడుకుంది. కౌశిక్‌ తారక్‌కి పెద్ద అభిమాని అని, ఫోన్ లో ఆయన డైలాగులు, వీడియోలే ఉంటాయని, తాను కూడా భవిష్యత్‌లో ఇలా కావాలని కలలు కంటుంటాడని తెలిపింది. తన కొడుక్కి సాయం చేయాలని ఆమె కోరుకుంటుంది.

అయితే ఈ వీడియో మరో రూపంలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇప్పటి వరకు అల్లు అర్జున్‌ని టార్గెట్‌ చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ని టార్గెట్‌ చేస్తున్నారా? ఇన్నాళ్లు స్పందించని కౌశిక్‌ తల్లి ఇప్పుడు బయటకు రావడంతో ఆమె వెనుక ఎవరైనా ఉన్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది ఏపీకి సంబంధించిన సంఘటన కావడం గమనార్హం. 

read more: అల్లు అర్జున్‌ మా టార్గెట్‌ కాదు, దాడులు చేస్తే సహించం, ఇండస్ట్రీ ఇక్కడే ఉంటుందిః మంత్రి కోమటిరెడ్డి క్లారిటీ

also read: ఏపీకి వెళ్లి ఏం చేస్తాం, పవన్‌ కళ్యాణ్‌ కి స్టార్‌ ప్రొడ్యూసర్‌ కౌంటర్‌.. తప్పు తెలుసుకుని ఏం చేశాడంటే ?

Latest Videos

click me!