అల్లు అర్జున్ పై మరో కేసు, వదలని కాంగ్రెస్ నేతలు!

First Published | Dec 23, 2024, 8:53 PM IST


సంధ్య థియేటర్స్ తొక్కిసలాట ఘటనలతో మహిళ మృతి చెందగా, అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు. కాగా అల్లు అర్జున్ పై మరొక కేసు నమోదు అయ్యింది. 
 

అల్లు అర్జున్ వర్సెస్ తెలంగాణ గవర్నమెంట్ అన్నట్లు పరిస్థితి తయారైంది. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ పై తీవ్ర విమర్శలు చేశాడు. అనుమతులు లేకున్నా సంధ్య థియేటర్ కి వెళ్లిన అల్లు అర్జున్, ఒక మహిళ మృతికి కారణం అయ్యాడంటూ ఫైర్ అయ్యారు. అరెస్ట్ అయిన అల్లు అర్జున్ బెయిల్ పై విడుదల కాగా చిత్ర ప్రముఖులు ఆయన్ని కలిసి సంఘీభావం తెలిపారు. దీనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. 

అల్లు అర్జున్ ఇంటి పై దాడి ఘటన సంచలనం రేపింది. ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ(JAC) సభ్యులు ఈ దాడికి తెగబడ్డారు. అల్లు అర్జున్ ఇంటి ఆవరణలోకి ప్రవేశించిన సభ్యులు విధ్వసం సృష్టించారు. ఈ దాడికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అల్లు అరవింద్ ఈ దాడిపై స్పందించారు. మేము సంయమనం పాటిస్తున్నాము. చట్టం ప్రకారం ముందుకు వెళతామని మీడియాకు స్పష్టం చేశారు. 


  ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలకు, టికెట్స్ ధరల పెంపుకు అనుమతి లేదని ప్రకటించడం ద్వారా... టాలీవుడ్ తో అమీతుమీకి సిద్ధం అని సీఎం రేవంత్ రెడ్డి సందేశం పంపారు. రేవంత్ రెడ్డి విమర్శల నేపథ్యంలో అల్లు అర్జున్ మీడియా ముందుకు వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండానే, కౌంటర్లు ఇచ్చారు. కావాలని చేసింది కాదు. ఇది అనుకోని ప్రమాదం. తప్పుడు ప్రచారం ద్వారా నా వ్యక్తిత్వాన్ని దెబ్బ తీస్తున్నారు. శ్రీతేజ్ ఆరోగ్యం, భవిష్యత్తు పట్ల నాకు పూర్తి బాధ్యత ఉందని అన్నారు. 

తాజాగా అల్లు అర్జున్ పై మరొక కేసు నమోదు అయ్యింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ మల్లన్న ఫిర్యాదు చేశారు. పుష్ప 2 మూవీలో అల్లు అర్జున్ పోలీస్ అధికారి స్నానం చేస్తున్న స్విమ్మింగ్ ఫూల్ లో మూత్రం పోస్తాడు. ఇది పోలీసు వ్యవస్థను అవమానించడమే. పుష్ప 2 హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. 

mallanna

సంధ్య థియేటర్ ఉదంతం జరిగిన నాటి నుండి మల్లన్న హీరో అల్లు అర్జున్ పై ఫైర్ అవుతున్నారు. అల్లు అర్జున్ ప్రచార యావతో చేసిన తప్పు ఒకరి ప్రాణాలు తీసిందని ఆరోపణలు చేస్తున్నారు. ఇక సంధ్య థియేటర్ వివాదం అంతకంతకు పెరుగుతూ పోతుంది. అల్లు అర్జున్ కి లేచి జాతీయ అవార్డు కూడా వెనక్కి తీసుకోవాలని కొందరు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. 

Latest Videos

click me!