బాషా రేంజ్ లో ఊహించుకున్నారు, పవన్ కళ్యాణ్ మూవీ ఫ్లాప్ కావడంతో జాగ్రత్త పడిన చిరంజీవి.. ఏం చేశారో తెలుసా

Published : Oct 10, 2025, 02:46 PM IST

పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ చిత్రం సూపర్ హిట్ కావలసింది అని, ఒక్క కారణం వల్ల నెగిటివ్ టాక్ వచ్చింది అని డైరెక్టర్ వీరశంకర్ అన్నారు. అదేవిధంగా ఆ మూవీ చిరంజీవికి ఉపయోగపడింది అని తెలిపారు. 

PREV
15
పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ మూవీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ ఖుషి వరకు తిరుగులేని విధంగా సాగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కి ఫ్లాపులు మొదలయ్యాయి. పదేళ్ల తర్వాత గబ్బర్ సింగ్ రిలీజ్ అయ్యే వరకు పవన్ కి బ్లాక్ బస్టర్ హిట్ లేదు. 2004లో పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ అనే చిత్రంలో నటించారు.

25
బాషా రేంజ్ లో ఊహించుకున్నారు 

వీర శంకర్ దర్శకత్వంలో గుడుంబా శంకర్ మూవీ తెరకెక్కింది. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఈ చిత్రానికి నిర్మాత. వీర శంకర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గుడుంబా శంకర్ మూవీ ఫ్లాప్ కావడానికి కారణం పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే అని అన్నారు. ' గుడుంబా శంకర్ మూవీని మంచి కామెడీ టైమింగ్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో తెరకెక్కించాం. పవన్ కళ్యాణ్ అభిమానులు టైటిల్ చూసి బాషా రేంజ్ లో ఉంటుందని ఊహించుకుని వచ్చారు. కానీ అందులో కామెడీ, ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉండడం వాళ్ళకి నచ్చలేదు. మరో బాషా అనుకుని వస్తే ఇలాంటి సినిమా ఇచ్చారు ఏంటి అని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు. 

35
ఫ్యాన్స్ వల్లే గుడుంబా శంకర్ ఫ్లాప్ 

కానీ రెండో వారం నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఇష్టపడడం ప్రారంభించారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి మూవీ బాగా నచ్చింది. కమర్షియల్ గా గుడుంబా శంకర్ సేఫ్ మూవీ. ఫ్యాన్స్ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయకుండా ఉండి ఉంటే ఖుషిని మించే హిట్ అయ్యేది. రిలీజ్ కి ముందు ఇది కామెడీ, ఫ్యామిలీ అంశాలు ఉన్న ఎంటర్టైన్మెంట్ మూవీ అని చెప్పకపోవడమే మేము చేసిన తప్పు' అని వీర శంకర్ తెలిపారు. 

45
అలెర్ట్ అయిన చిరంజీవి 

గుడుంబా శంకర్ రిజల్ట్ చూసి చిరంజీవి గారు జాగ్రత్త పడ్డారు అని వీర శంకర్ అన్నారు. గుడుంబా శంకర్ రిలీజ్ అయిన నెల రోజుల గ్యాప్ లో శంకర్ దాదా ఎంబీబీఎస్ రిలీజ్ అయింది. అది కూడా కామెడీ ప్రధానంగా ఉండే వినోదాత్మక చిత్రమే. గుడుంబా శంకర్ కి వచ్చిన టాక్ చూసి శంకర్ దాదా ఎంబీబీఎస్ ఎంటర్టైనింగ్ మూవీ అని రిలీజ్ ముందే చెప్పేశారు. దీనితో ఫ్యాన్స్ అదే తరహా అంచనాలతో వెళ్లి సినిమాని ఎంజాయ్ చేసినట్లు వీర శంకర్ తెలిపారు.

55
మణిశర్మ సంగీతం 

ఆ విధంగా తమ్ముడి ఫ్లాప్ మూవీ అన్నయ్యకి ఉపయోగపడింది. గుడుంబా శంకర్ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఈ మూవీలో ప్రతి సాంగ్ సంగీత ప్రియులని ఉర్రూతలూగించే విధంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ కి జోడిగా ఈ మూవీలో మీరా జాస్మిన్ నటించింది. 

Read more Photos on
click me!

Recommended Stories