కె ర్యాంప్ X డ్యూడ్.. కిరణ్ అబ్బవరం ఆవేదనకి మైత్రి నిర్మాత ఇచ్చిన కౌంటర్ సరైనదేనా ?

Published : Oct 10, 2025, 12:29 PM IST

కిరణ్ అబ్బవరం నటించిన 'కె ర్యాంప్' మూవీ అక్టోబర్ 18న రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో కిరణ్ అబ్బవరం తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.  

PREV
15
కిరణ్ అబ్బవరం 'కె ర్యాంప్' రిలీజ్ కి రెడీ 

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం గతేడాది 'క' చిత్రంతో సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ఇటీవల విడుదలైన దిల్ రూబా చిత్రంతో ఫ్లాప్ ఎదురైంది. కిరణ్ అబ్బవరం నటించిన 'కె ర్యాంప్' మూవీ అక్టోబర్ 18న రిలీజ్ కి రెడీ అవుతోంది. కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా ఈ చిత్రంలో జంటగా నటించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. 

25
కె ర్యాంప్ X డ్యూడ్ 

కె ర్యాంప్ మూవీకి పోటీగా ఒక రోజు ముందు అంటే అక్టోబర్ 17న తమిళ క్రేజీ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ చిత్రం రిలీజ్ అవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. దీనితో తమిళంతో పాటు తెలుగులో కూడా గ్రాండ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. మైత్రి సంస్థ మూవీ కావడంతో ఏపీ తెలంగాణ లలో డ్యూడ్ చిత్రానికి భారీ సంఖ్యలో థియేటర్స్ వెళ్లనున్నాయి. దీనితో కిరణ్ అబ్బవరం ఓ ఇంటర్వ్యూలో ప్రదీప్ రంగనాథన్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

35
తమిళ హీరోకి థియేటర్లు దొరుకుతున్నాయి 

కిరణ్ అబ్బవరం కామెంట్స్ పై టాలీవుడ్ లో పెద్ద చర్చే జరుగుతోంది. 'ప్రదీప్ రంగనాథన్ లాంటి తమిళ హీరోకి తెలుగులో కావలసినన్ని థియేటర్లు దొరుకుతున్నాయి. నా సినిమాని నేను తమిళంలో రిలీజ్ చేస్తే థియేటర్లు అసలు దొరకవు. 'క' మూవీని తమిళంలో రిలీజ్ చేయాలని ప్రయత్నించాను. కానీ థియేటర్లు ఇవ్వలేమని నిర్మొహమాటంగా చెప్పేశారు' అని కిరణ్ అబ్బవరం ఆవేదన వ్యక్తం చేశారు. 

45
మైత్రి నిర్మాత కౌంటర్ 

కిరణ్ అబ్బవరం కామెంట్స్ పై డ్యూడ్ మూవీ నిర్మాత మైత్రి రవిశంకర్ రియాక్ట్ అయ్యారు. కిరణ్ అబ్బవరంకి ఆయన సుతిమెత్తగా కౌంటర్ ఇచ్చారు. డ్యూడ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రవిశంకర్ మాట్లాడారు. 'తమిళనాడులో దీపావళి పెద్ద పండుగ. పైగా అక్కడ ఉన్న థియేటర్లు మనతో పోల్చితే తక్కువే. సినిమాకి వచ్చే ఫస్ట్ డే టాక్ ని బట్టే థియేటర్లు అడ్జెస్ట్ అయిపోతుంటాయి. బ్లాక్ బస్టర్ కంటెంట్ ఉన్న సినిమాకి రెండవ రోజు నుంచి ఎక్కువ థియేటర్లు దొరుకుతాయి. అదేమీ పెద్ద సమస్య కాదు. 

55
బెస్ట్ కంటెంట్ ఇవ్వాలి 

పండగకి సినిమాలు ఒకేసారి రిలీజ్ కావడం సహజం. కంటెంట్ బావున్న సినిమా, ఫస్ట్ డే టాక్ బావున్న సినిమాకి రెండో రోజు నుంచి థియేటర్లు పెరుగుతాయి. కాబట్టి థియేటర్లు దొరకడం లేదు అని ఊరికే మాట్లాడడం కరెక్ట్ కాదు. బెస్ట్ కంటెంట్ ఇవ్వండి.. థియేటర్లు పట్టుకుపోండి. మా డ్యూడ్ మూవీ అద్భుతంగా ఉండబోతోంది. దీనిని మించిన కంటెంట్ తో ఏ మూవీ వచ్చినా థియేటర్లు అడ్జెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం' అని రవిశంకర్ తెలిపారు. 

Read more Photos on
click me!

Recommended Stories