అక్కినేని మూడో తరం వారసుడు, నవయువ సామ్రాట్ నాగచైతన్య. తాత, తండ్రి బాటలో హీరోగా కొనసాగుతోన్న చైతుకు తెలుగులో రెండు సినిమాలు బాగా నచ్చాయట. ఆ సినిమాలను దాదాపు 100 సార్లు చూసి ఉంటారట. ఇంతకీ ఆ సినిమాలేంటి? అందులో అంత స్పెషల్ ఏముంది?
నాగచైతన్య అక్కినేని వారసుడిగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు. మంచి మంచి సినిమాలతో తెలుగు పరిశ్రమలో దూసుకుపోతున్నాడు. కానీ తన తండ్రిలా ఇప్పటి వరకూ టైర్ 1 హీరోల లిస్ట్ లోకి రాలేకపోయాడు. టైర్ 2 హీరోగానే కొనసాగుతున్నాడు. కమర్షియల్ సినిమాలు చేసినా, అందులో ఎటువంటి వల్గారిటీ లేకుండా చూసుకుంటాడు చైతూ. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు నాగచైతన్య. మంచి మంచి కథలను ఎంచుకుని సినిమాలు చేస్తున్నాడు. నాగచైతన్య చేసిన సినిమాలలో కొన్ని కమర్షియల్ గా సక్సెస్ అవ్వకపోయినా.. ఆడియన్స్ లో మాత్రం మంచి సినిమాలుగా గుర్తింపు మాత్రం వస్తోంది. కెరీర్ లో ఎన్నో ప్రయోగాలు చేసిన నాగచైతన్య, రీసెంట్ గా వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు.
26
నాగచైతన్యకు నచ్చిన రెండు సినిమాలు
సినిమా వాతావరణంలో పెరిగాడు నాగచైతన్య. చిన్నప్పటి నుంచి సినిమాలు, షూటింగ్స్ చూస్తూ ఎదిగాడు. ఇటు తండ్రి, అటు మామ ఇద్దరు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అవ్వడం, ఇద్దరు తాతలు ఇండస్ట్రీ పెద్దలుగా ఉండటంతో తెలియకుండానే సినిమాలపై చైతూకు అవగాహన ఏర్పడింది. చిన్నతనం నుంచి ఎన్నో సినిమాలు చూస్తూ పెరిగిన నాగచైతన్యకు బాగా నచ్చిన సినిమాలు ఏంటో తెలుసా? రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చైతూ ఈ విషయాలను వెల్లడించాడు. తనకు నిన్నే పెళ్లాడత సినిమాతో పాటు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా అంటే చాలా ఇష్టమని చైతూ అన్నారు. ఈ రెండు సినిమాలకు కనీసం 100 సార్లకు పైగా చూసి ఉంటానన్నారు నాగచైతన్య.
36
తండ్రి, మామ సినిమాలంటే ఇష్టం.
నాగచైతన్య తన తండ్రి నాగార్జున, మేనమామ వెంకటేష్ సినిమాలు ఎక్కువగా చూసేవారు. అందులో రొమాంటిక్ కామెడీ సినిమాలను నాగచైతన్య ఇష్టంగా చూసేవారు. నాగార్జున కూడా ఎక్కువ రొమాంటిక్ సినిమాలతో టాలీవుడ్ మన్మధుడు అన్న పేరు తెచ్చుకున్నాడు. అందులో భాగంగానే నాగ్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ కమ్ రొమాంటిక్ మూవీ నిన్నే పెళ్లాడత చైతూకు బాగా నచ్చేసింది. ఈసినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు నాగార్జున, టబు మధ్య లవ్ సీన్స్ ఆడియన్స్ కు గిలిగింతలు పెడతాయి. ఈసినిమా చాలామందికి ఆల్ టైమ్ ఫ్యావరెట్ గా నిలిచింది. ఈక్రమంలో నాగచైతన్యకు కూడా నిన్నే పెళ్లాడత సినిమా ఫ్యావరెట్ గా మారింది.
నాగచైతన్యకు తన తండ్రి నాగార్జునతో ఎంత అనుబంధం ఉందో, మేనమామ వెంకటేష్ తో కూడా అంతే అనుబంధం ఉంది. అంతే కాదు అంతకు మించి వీరు మంచి స్నేహితులుగా ఉన్నారు. చాలా సందర్భాల్లో నాగచైతన్య మామ గురించి చెప్పిన విషయాలు వైరల్ అయ్యాయి, అటు వెంకటేష్ కూడా నాగచైతన్య తనతో ఎంత ప్రెండ్లీగా ఉంటాడనే విషయాన్ని కొన్ని ఇంటర్వ్యూలలో వివరించారు. ఈక్రమంలో నాగచైతన్య చిన్నతనం నుంచి వెంకీతో కలిసి సినిమాలు చూసేవారు. ఆయన నటించని సినిమాల్లో ఇంట్లో ఇల్లాలు , వంటింట్లో ప్రియురాలు సినిమా తనకు ఎంతో ఇష్టమని చైతూ రీసెంట్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సినిమాలో కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్ అద్భుతంగా ఉంటుందని అన్నారు చైతూ. ఈ కారణంగానే నిన్నే పెళ్లాడతా, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలను దాదాపు 100 సార్లు చూసినట్టు చెప్పారు.
56
జగపతి బాబు ఇంటర్వ్యూలో
టాలీవుడ్ ఫ్యామిలీ హీరో జగపతి బాబు హోస్ట్ గా జయమ్ము నిశ్చయంబుర కార్యక్రమం జీ5 లో ప్రసారం అవుతోంది. ఈ ప్రోగ్రామ్ లో ఎంతో మంది సెలబ్రిటీలు పాల్గోన్నారు. అందులో భాగంగా నాగచైతన్య కూడా ఈ కార్యక్రమానికి వచ్చి, ఎన్నో విషయాలు పంచుకున్నారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి వివరించిన నాగచైతన్య, నెక్ట్స్ సినిమాల గురించి, ఫ్యామిలీ లైఫ్ గురించి కూడా ఎన్నో విషయాలు వెల్లడించారు. కెరీర్ లో తాను చేయాల్సిన పాత్రలు కొన్ని ఉన్నాయన్న చైతూ.. తండ్రిలాగే మైథలాజికల్ క్యారెక్టర్ ను పర్ఫెక్ట్ గా చేసి చూపించాలన్న కోరికను వెల్లడించారు.
66
నాగచైతన్య సినిమాలు
ఈమధ్య కాలంలో తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు నాగ చైతన్య. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈసినిమాతో తొలిసారి 100 కోట్ల మార్క్ ను క్రాస్ చేశాడు చైతూ. ఇక ప్రస్తుతం ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండుతో ఓ మిథికల్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు చైతూ. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం చైతూ కెరీర్‌లో 24వ సినిమాగా తెరకెక్కుతుండగా.. తన 25వ మూవీ కోసం భారీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈసారి కిషోర్ అనే కొత్త దర్శకుడితో తన 25వ చిత్రం చైతూ చేయబోతున్నాడని టాక్. కిషోర్ చెప్పిన కథ చైతన్యకి బాగా నచ్చడంతో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.