మగధీర, ఈగ కంటే ఆర్ఆర్ఆర్ గొప్ప చిత్రం కాదు..నా మైండ్ పోయింది అందుకే, బాలీవుడ్ డైరెక్టర్ కామెంట్స్

Published : Nov 25, 2025, 09:15 AM IST

Rajamouli Movies: మగధీర, ఈగ కంటే ఆర్ఆర్ఆర్ చిత్రం అంత గొప్ప చిత్రమేమీ కాదని ఓ బాలీవుడ్ దర్శకుడు అన్నారు. ఆ దర్శకుడు ఎవరు ? ఎందుకు అలా అన్నారో ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
రాజమౌళి వారణాసి మూవీ 

దర్శక ధీరుడు రాజమౌళి ఈసారి తన సినిమాతో గ్లోబల్ ఆడియన్స్ ని మెప్పించడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో జక్కన్న తన సత్తాని ప్రపంచానికి పరిచయం చేశారు. ఇప్పుడు మహేష్ బాబుతో అంతర్జాతీయ ప్రమాణాలతో వారణాసి అనే చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఆస్కార్ కొల్లగొట్టిన రాజమౌళి. వారణాసి చిత్రంతో పూర్తి స్థాయిలో హాలీవుడ్ ఆడియన్స్ మనసులు దోచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రం దాదాపు 1500 కోట్ల బడ్జెట్ లో రూపొందుతోంది. 

25
ఆర్ఆర్ఆర్ పై బాలీవుడ్ డైరెక్టర్ కామెంట్స్ 

ఆర్ఆర్ఆర్ చిత్రం వెస్ట్రన్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేసింది. అందులో యాక్టన్ సీన్లు, డ్యాన్సింగ్ మూమెంట్స్ ఇంగ్లీష్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం గురించి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

35
ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఎంజాయ్ చేయలేకపోయా 

అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ నేను పుష్ప సినిమా చూశాను చాలా బాగా ఎంజాయ్ చేశాను. అదే విధంగా ఆర్ఆర్ఆర్ కూడా చూశాను. కానీ రాజమౌళి ఈగ చిత్రాన్ని ఎంజాయ్ చేసినంతగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఎంజాయ్ చేయలేకపోయాను. రాజమౌళి సినిమాని భారీ స్థాయిలో తెరకెక్కించడం, ఆ విజువల్స్ నాకు బాగా నచ్చుతాయి. ఆ విధంగా బాహుబలి నాకు బాహుబలి నచ్చింది. ఆర్ఆర్ఆర్ లో యాక్షన్ సీన్లు బాగా నచ్చాయి. 

45
ఈగ, మగధీర కంటే గొప్ప చిత్రం కాదు 

ముఖ్యంగా ఇంటర్వెల్ లో వచ్చే యానిమల్స్ సీన్ చూసినప్పుడు ఒక మనిషి ఇలా ఎలా ఆలోచించగలుగుతాడు ? అని అనిపించింది. ఆ సీన్ చూసి నా మైండ్ పోయింది. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా మొత్తంగా తీసుకుంటే.. ఈగ, మగధీర, బాహుబలి కంటే గొప్ప చిత్రం కాదు. కానీ ఆర్ఆర్ఆర్ చిత్రం అమెరికా, యూరప్ దేశాలలో చూపిన ప్రభావం ఎక్కువ. వాళ్ళు రాజమౌళి అనే కొత్త ఫిలిం మేకర్ గురించి ఈ చిత్రంతో తెలుసుకున్నారు. 

55
వాళ్ళకి బాగా కనెక్ట్ అయింది 

ఆర్ఆర్ఆర్ లో యాక్షన్ సీన్లు మాత్రమే కాదు డ్యాన్స్ సీక్వెన్స్ కూడా అద్భుతం. అందుకే వెస్ట్రన్ ఆడియన్స్ కి ఈ మూవీ బాగా కనెక్ట్ అయింది. యుఎస్, యూరప్ లలో నేను ఒకటి గమనించాను. అక్కడ ఆడియన్స్ ఏదైనా పార్టీ చేసుకుంటుంటే తప్పనిసరిగా ఆర్ఆర్ఆర్ సినిమాలోని కొన్ని సీన్లు అయినా చూస్తారు. అంత క్రేజీగా ఆర్ఆర్ఆర్ మూవీ మారిపోయింది అని అనురాగ్ కశ్యప్ తెలిపారు. 

Read more Photos on
click me!

Recommended Stories