టాప్‌ 5 ఓటీటీ మూవీస్‌.. లాస్ట్ లో జాలీ ఎల్‌ఎల్‌బీ 3, నెంబర్‌ 1గా బాక్సాఫీసు సంచలనం

Published : Nov 25, 2025, 08:13 AM IST

గత వారం ఓటీటీలో టాప్‌ 5 సినిమాలు ఏంటో ఓర్మాక్స్ మీడియా ప్రకటించింది. ఇందులో బాలీవుడ్‌ మూవీ `జాలీ ఎల్‌ఎల్‌బీ 3` లాస్ట్ లో ఉంది. మరి టాప్‌ 1లో ఉన్న సినిమా ఏంటో తెలుసా? 

PREV
16
ఓటీటీ టాప్‌ 5 మూవీస్‌

ఓర్మాక్స్ మీడియా ప్రతి వారం ఓటీటీలో ఎక్కువగా చూసిన సినిమాల లిస్ట్ ఇస్తుంది. గత వారంలో ఏ సినిమాని ఎక్కువగా చూశారో తాజాగా లిస్ట్ విడుదల చేసింది. ఇందులో తెలుగు సినిమా ఒక్కటి కూడా లేదు. కన్నడ సంచలం టాప్‌లో దూసుకుపోతుంటే, కోలీవుడ్‌ జెంజీ మూవీ టాప్‌ 2లో ఉంది. హిందీ ఫిల్మ్ లాస్ట్ లో ఉంది. మరి ఆ సినిమాలేంటి? వాటిని ఎంత మంది చూస్తున్నారనేది తెలుసుకుందాం. 

26
టాప్‌ 1లో కాంతార చాప్టర్‌ 1

ఓర్మాక్స్ మీడియా ప్రకటించినదాన్ని బట్టి ఓటీటీలో టాప్‌లో దూసుకుపోతున్న చిత్రాల్లో `కాంతార చాప్టర్‌ 1` నెంబర్‌ 1లో ఉంది. రిషబ్‌ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా నటించింది. హోంబలే ఫిల్మ్స్ ఈ మూవీని నిర్మించడం విశేషం. ఈ చిత్రం దసరా కానుకగా విడుదలై ఎనిమిది వందల కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. ఈ ఏడాది అత్యధిక బాక్సాఫీసు కలెక్షన్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ఓటీటీలోనూ సత్తా చాటుతోంది. అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోన్న ఈ సినిమాకి 2.8 మిలియన్‌ వ్యూస్‌ రావడం విశేషం.

36
టాప్‌ 2లో `డ్యూడ్‌`

ఓటీటీలో ఈ వారం ఎక్కువగా చూసిన చిత్రాల్లో `డ్యూడ్‌` ఉంది. ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్‌గా నటించింది. శరత్‌ కుమార్‌ కీలక పాత్ర పోషించారు. దీపావళి కానుకగా విడుదలైన ఈ మూవీ థియేటర్లలో బాగానే ఆడింది. దాదాపు వంద కోట్ల వరకు వసూలు చేసింది. ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్ములేపుతోంది. నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ అవుతోన్న ఈ మూవీ గత వారం 2.4 మిలియన్‌ వ్యూస్‌తో టాప్‌ 2లో ఉంది. జెంజీ కామెడీ మూవీకి కీర్తీశ్వరన్‌ దర్శకత్వం వహించగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం.

46
టాప్‌ 3లో సూపర్‌నేచురల్‌ హర్రర్‌ థ్రిల్లర్‌

బాలీవుడ్‌ మూవీ `బరాముల్లా` మూవీ టాప్‌ 3లో ఉంది. సూపర్‌నేచురల్‌ హర్రర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీకి ఆదిత్య సుహాస్‌ జంభాలే దర్శకత్వం వహించారు. జీయో స్టూడియోస్‌ నిర్మించింది. ఇందులో మానవ్‌ కౌల్‌, భాషా సాంబ్లి ప్రధాన పాత్రలు పోషించారు. నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ అవుతోన్న ఈ మూవీ మంచి వ్యూస్‌తో దూసుకుపోతుంది. గత వారం దీనికి 2.2 మిలియన్‌ వ్యూస్‌ రావడం విశేషం.

56
టాప్‌ 4లో హాలీవుడ్‌ మూవీ

హాలీవుడ్‌ చిత్రాలు ఇప్పుడు మన వద్ద విశేష ఆదరణ పొందుతున్నాయి. థియేటర్లలో వందల కోట్లు వసూలు చేస్తున్నాయి. అందులో `జురాసిక్‌ పార్క్` సిరీస్‌ చిత్రాలకు విశేష ఆదరణ దక్కుతుంది. తాజాగా `జురాసిక్‌ వరల్డ్ రీబర్త్` మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది. జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ మూవీ 2 మిలియన్‌ వ్యూస్‌తో ఇండియా ఓటీటీలో టాప్‌ 4లో నిలవడం విశేషం.

66
టాప్‌ 5లో అక్షయ్‌ కుమార్‌ `జాలీ ఎల్‌ఎల్‌బీ 3`

ఇక బాలీవుడ్‌ మూవీ `జాలీ ఎల్‌ఎల్‌బీ 3`  ఈ లిస్ట్ లో టాస్ట్ లో ఉంది. నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ మూవీ 1.6 మిలియన్‌ వ్యూస్‌తో ఐదో స్థానంలో నిలిచింది. ఇందులో అక్షయ్‌ కుమార్‌, హర్షద్‌ వార్సి ప్రధాన పాత్రలు పోషించగా, సుభాష్‌ కపూర్‌ దర్శకత్వం వహించారు. కోర్ట్ రూమ్‌ కామెడీ చిత్రంగా రూపొంది థియేటర్లలోనూ మంచి ఆదరణ పొందీ మూవీ. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories