ప్రభాస్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌లతో నటించి షేక్‌ చేసిన ఈ చిన్నారి ఎవరో తెలుసా? పడిలేస్తున్న కెరటం

First Published | Nov 19, 2024, 9:33 PM IST

నాగచైతన్య సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ప్రభాస్‌, ఎన్టీఆర్‌, బన్నీ చరణ్‌ల సరసన నటించి స్టార్‌ హీరోయిన్‌ చిన్న నాటి అరుదైన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆమె ఎవరో తెలుసా?

నటి చిన్ననాటి ఫోటోలు

హీరోయిన్లకు క్రేజ్‌ ఎక్కువ కాలం ఉండదు. దాన్ని సరిగ్గా వాడుకున్నవారే స్టార్‌ హీరోయిన్ అవుతారు. ఈ కోవలోకే వస్తుంది పూజా హెగ్డే. నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయినా టాలీవుడ్ మార్కెట్ కారణంగా స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

పూజా చిన్ననాటి ఫోటో

టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉన్న పూజా హెగ్డే.. కోలీవుడ్‌లోనూ టాప్ హీరోలతో సినిమాలు చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ చైల్డ్ హుడ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 2012లో మిస్కిన్ దర్శకత్వంలో వచ్చిన 'ముగమూడి'తో కోలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్‌గానూ వెండితెరకు పరిచయం అయ్యింది. 


పూజా చిన్ననాటి ఫోటో

రెండేళ్ల గ్యాప్‌ తర్వాత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. నాగచైతన్యతో `ఒక లైలా కోసం` సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. అదే ఏడాది వరుణ్‌ తేజ్‌తో `ముకుంద` చిత్రంలో నటించింది పూజా. 

పూజా అరుదైన ఫోటోలు

తెలుగులో రెండు సినిమాలు గొప్పగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో బాలీవుడ్‌ షిఫ్ట్ అయ్యింది. `మొహెంజోదారో` చిత్రంలో హృతిక్‌ రోషన్‌తో కలిసి నటించింది. ఆ మూవీ సైతం నిరాశ పరిచింది. మళ్లీ గ్యాప్‌. కానీ అల్లు అర్జున్‌ లైఫ్‌ ఇచ్చాడు. `డీజే` చిత్రంతో మళ్లీ టాలీవుడ్‌ రీఎంట్రీ ఇచ్చింది. 

పూజా అరుదైన ఫోటోలు

ఎన్టీఆర్‌తో `అరవింద సమేత`, బన్నీతో మరోసారి `అల వైకుంఠపురములో` తో వరుసగా విజయాలు అందుకుంది. స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. మహేష్‌తో `మహర్షి`, అఖిల్‌తో `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` సినిమాలు చేసి ఆకట్టుకుంది. వరుణ్‌ తేజ్‌తో చేసిన `గద్దల కొండ గణేష్‌` యావరేజ్‌గా ఆడింది.

పూజా హెగ్డే

ఈ క్రమంలో కోలీవుడ్‌లో విజయ్ సరసన 'బీస్ట్'లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. అదే ఏడాది టాలీవుడ్‌లో ప్రభాస్ తో `రాధేశ్యామ్‌` సినిమా చేసింది, అది కూడా డిజాస్టర్.  అంతేకాదు రామ్‌ చరణ్‌తో చేసిన `ఆచార్య` కూడా డిజాస్టర్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా పడిపోయింది పూజా. ఓ రకంగా జీరో అయిపోయింది. అటు కోలీవుడ్‌, ఇటు బాలీవుడ్‌ సినిమాలు కూడా పరాజయం చెందడంతో ఎంత క్రేజ్‌ వచ్చిందో, అంతే పడిపోయింది. 

తలపతి 69 హీరోయిన్ పూజా

ఇప్పుడు నెమ్మదిగా పుంజుకుంటుంది. సూర్య 44లో హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే విజయ్ సరసన 'తలపతి 69'లోనూ నటిస్తోంది. హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తర్వాత విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారు.దీంతోపాటు తెలుగులో నాగచైతన్యతో ఓ సినిమా చేయబోతుంది. మొత్తంగా పడి లేచిన కెరటంలా రాబోతుంది పూజా. మళ్లీ సక్సెస్‌ కొట్టి పుంజుకుంటుందా అనేది చూడాలి. 

read more:ఫారెన్‌లో నాగార్జునకి చుక్కలు చూపించిన నయనతార, ఫోన్‌ వస్తే వణికిపోయేవారట.. ఆ బ్యాడ్‌ డేస్‌ని స్వయంగా చూశాడట

also read: నటి కస్తూరి సంపాదన ఎంతో తెలుసా? చిన్నప్పట్నుంచే రిచ్‌.. ఫ్యామిలీ డిటెయిల్స్

Latest Videos

click me!