1000 కోట్ల సినిమా చేసినా సింపుల్ గా కనిపించే డైరెక్టర్ చిన్ననాటి ఫోటో, ఎవరో గుర్తు పట్టారా..?

First Published | Nov 19, 2024, 8:46 PM IST

ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తు పట్టారా..? చాలా సంపుల్ గా మెయింటేన్ చేసే ఓ స్టార్ డైరెక్టర్ అతను. వెయ్యి కోట్ల సినిమా చేసిన ఈ చిన్నారి దర్శకుడు ఎవరో చెప్పుకోండి చూద్దాం. 
 

Tollywood Top Directors Age


 ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజ్ బాగా నడుస్తోంది. రాజమౌళి బాహుబలి తరువాత పాన్ ఇండియా జపం చేస్తున్నారు సౌత్ మేకర్స్. మరీ ముఖ్యంగా మన తెలుగు పరిశ్రమ నుంచి ప్రతీ సినిమా పాన్ ఇండియాను ఇంప్రెస్ చేస్తోంది. ఇప్పటికే ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ , అల్లు అర్జున్ లాంటి హీరోలు దేశ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ను సంపాదించేశారు. 

కాగా తమిళ, కన్నడ, మలయాళపరిశ్రమ నుంచి కూడా పాన్ ఇండియాను సంతృప్తి పరచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు స్టార్ హీరోలు. ఈక్రమంలో దర్శకులు కూడా పాన్ఇండియా రేంజ్ లో ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక పాన్ ఇండియా  బాక్సాఫీస్ వద్ద సౌత్ మూవీస్ సత్తా చాటుతున్న క్రమంలో మన దర్శకులు డిమాండ్ కూడా బాలీవుడ్ లో పెరిగిపోయింది. 

Also Read: కిరణ్ అబ్బవరం కి అల్లు అర్జున్ బహిరంగ క్షమాపణ. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..?

బాలీవుడ్ స్టార్స్ సైతం దక్షిణాది దర్శకులతో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇప్పుడు ఫోటోలో కనిపిస్తున్న ఈచిన్నారి గురించి మాట్లాడుకుందాం ఇతను ఓ కుర్ర దర్శకుడు. చేసింది తక్కువ సినిమాలే అయినా.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోలకు మార్గదర్శకుడిగా మారాడు. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ గర్వించేలా సినిమా చేశాడు. ఇక వరుసగా నాలుగు హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన ఈ వ్యక్తి.. 

Also Read: కొడుకు గుగన్ దాస్ వింత అలవాటు గురించి శివ కార్తికేయన్ చెప్పిన సీక్రెట్
 


Atlee Kumar

తాజాగా బాలీవుడ్ లో కూడా సంచలనం అయ్యాడు. షారుఖ్ ఖాన్ తో సినిమా చేసి.. వెయ్యి కోట్ల కలెక్షన్ మార్క్ ను దాటించాడు. ఇంతకీ అతను ఎవరో ఇప్పటికే అర్ధం అయ్యి ఉంటుంది. అతనే డైరెక్టర్ అట్లీ.దర్శకుడు శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అట్లీ.. రోబో సినిమాకు శంకర్ దగ్గర తన ప్రతిభ చూపించాడు. ఇక 2013లో ఆర్య హీరోగా  రాజారాణి సినిమా ద్వారా దర్శకుడిగా మారిన అట్లీ.. ఈనినిమాతో అటు తమిళ పరిశ్రమలో.. ఇటు తెలుగు పరిశ్రమలో కూడా మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. 
 

Atlee

ఈసినిమాకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో చెప్పడం కష్టం. ఈసినిమా ప్రభావంతో స్టార్ హీరోలు అట్లీకి అవకాశాలు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈక్రమంలోనే  విజయ్ దళపతి, సమంత జంటగా అట్లీ రూపొందించిన తేరి అద్భుతమైన హిట్ అయ్యింది. ఇలా తమిళంలో వరుస సినిమాలతో స్టార్ డైరెక్టర్ అయ్యాడు అట్లీ. విజయ్ తో తేరి తరువాత మెర్సల్, బిగిల్ సినిమాలు చేశాడు అట్లీ.  ఆ తర్వాత బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో కలిసి జవాన్ సినిమాను తెరకెక్కించాడు. 

Atlee, Pooja Vibes

నయనతార, విజయ్ సేతుపతి కీలకపాత్రలు పోషించిన ఈ మూవీ పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాదు.. ఏకంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. వరుస ప్లాపులతో అల్లాడిపోతున్న షారుఖ్ కు మంచి కమర్షియల్ హిట్ ఇచ్చాడు. ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న దర్శకుడు అట్లీ. అతడితో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ స్టార్స్ క్యూ కడుతున్నారు. అట్లీ మాత్రం నెక్ట్స్ అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. 

Latest Videos

click me!