ఫారెన్‌లో నాగార్జునకి చుక్కలు చూపించిన నయనతార, ఫోన్‌ వస్తే వణికిపోయేవారట.. ఆ బ్యాడ్‌ డేస్‌ని స్వయంగా చూశాడట

Published : Nov 19, 2024, 08:56 PM IST

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ఇప్పుడు బిజీయెస్ట్ హీరోయిన్‌ అయితే. ఒకప్పుడు ఆమె నాగార్జునకి చుక్కలు చూపించిందట. అదికూడా ఫారెన్‌ లో. ఆ విషయాలను నాగ్‌ వెల్లడించారు.  

PREV
15
ఫారెన్‌లో నాగార్జునకి చుక్కలు చూపించిన నయనతార, ఫోన్‌ వస్తే వణికిపోయేవారట.. ఆ బ్యాడ్‌ డేస్‌ని స్వయంగా చూశాడట
nayanthara

నయనతార ప్రస్తుతం సౌత్ లేడీ సూపర్‌ స్టార్‌గా రాణిస్తుంది. స్టార్‌ హీరోలకు దీటుగా సినిమాలు చేస్తుంది. ఆమె సినిమాలు పెద్ద పెద్ద హీరోల మూవీస్‌కి పోటీగా విడుదలై కలెక్షన్లని రాబడుతుండటం విశేషం. అయితే నయనతార జీవితంలో చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. మూడు సార్లు లవ్‌ ఫెయిల్యూర్స్ అయ్యాయి. ఈ క్రమంలో ఆమె ఎంతో స్ట్రగుల్‌ అయ్యింది. కానీ దాన్ని తట్టుకుని నిలబడింది. లేడీ సూపర్‌ స్టార్‌గా పేరు తెచ్చుకుంది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

25

ఇదిలా ఉంటే నయనతార హీరో నాగార్జునకి చుక్కలు చూపించిందట. ఫారెన్‌లో షూటింగ్‌కి వెళితే ఓ రకంగా భయపెట్టేసిందట. ఆమెకి ఫోన్‌ వస్తే చాలు నాగ్‌తోపాటు టీమ్‌ మొత్తం వణికిపోయేవాళ్లట. షూటింగ్‌ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉండేదట. దాన్ని నాగార్జున స్వయంగా ఫేస్‌ చేశాడట. ఆయనే ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఇప్పుడు ఆమె పరిస్థితిని చూస్తుంటే హ్యాపీగా ఉందన్నాడు. మరి అంతగా నాగ్‌ని నయన్‌ ఎందుకు భయపెట్టింది, అసలు అప్పుడు ఏం జరిగిందనేది చూస్తే. 
 

35

నాగార్జునతో నయనతార మొదటిసారి `బాస్‌` సినిమాలో నటించింది. ఇది పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత కొంత గ్యాప్‌ తర్వాత `గ్రీకు వీరుడు` సినిమాలో నటించింది. ఈ మూవీ షూటింగ్‌ విదేశాల్లో జరిగింది. కొన్ని పాటలు కూడా అక్కడ షూట్‌ చేశారు. అయితే ఆ సినిమా షూటింగ్‌ సమయంలోనే నయనతార లవ్‌ ఎఫైర్లతో బిజీగా ఉందట. అవి బ్రేకప్‌ అయి బాగా డిస్టర్బర్‌గా ఉండేవట. శింబుతో, ఆ తర్వాత ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారం నడిపించిన విషయం తెలిసిందే. కానీ కరెక్ట్ గా నాగ్‌తో సినిమా సమయంలోనే ఈ బ్రేకప్‌ వ్యవహారాలు నడిచేవి. ప్రభుదేవాతో ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ అయ్యింది. దీంతో నయనతార చాలా సఫర్‌ అయ్యిందట. ఫ్రీగా ఉండేది కాదని, తరచూ ఏదో ఒక ఫోన్‌ వచ్చేదట. ఆ ఫోన్‌ వస్తే బాగా అరిచేదని, ఫైరింగ్‌ లో ఉండేదట. 
 

45

నయనతారకి ఫోన్‌ వస్తే చాలు ఆమె మూడ్‌ మొత్తం మారిపోయేదని, దీంతో టీమ్‌ మొత్తం భయపడిపోయేవారట. తరచూ ఇలానే జరుగుతుండటంతో ఎట్టకేలకు నాగార్జున ఆమెని అడిగాడట. సమస్య ఏంటి ? ఆమె ఈ విషయాలు చెప్పారట. తాజాగా నయనతార కెరీర్‌పై డాక్యుమెంటరీని రూపొందించారు. `Nayanthara 'Beyond the Fairytale` పేరుతో దీన్ని రూపొందించారు. ఇందులో నాగార్జున ఈ విషయాలను పంచుకున్నారు.  ఈ వరుస హార్ట్ బ్రేక్స్ తర్వాత నయనతార మారిపోయింది. విఘ్నేష్‌ శివన్‌తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. రెండేళ్ల క్రితం వీరి మ్యారేజ్‌ జరిగింది. వీరికి ఇద్దరు కవల పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆమె హ్యాపీగా ఉండటం చాలా సంతోషంగా ఉందని చెప్పారు నాగార్జున. 
 

55

నయనతార, నాగార్జున కలిసి నటించిన `బాస్‌`, `గ్రీకు వీరుడు` రెండు సినిమాలు పరాజయం చెందాయి. కానీ వీరిద్దరికి మాత్రం మంచి జోడీ అనే పేరు వచ్చింది. ఇక నయనతార ప్రస్తుతం ఓ వైపు ఫ్యామిలీని టేక్‌ కేర్‌ చేస్తూనే, మరోవైపు సినిమాలు చేస్తుంది. ఆమె చేతిలో ప్రస్తుతం ఐదారు సినిమాలున్నాయి. 

read more:ఆయన వల్లే సినిమాలు మానేశా, లవ్‌ ఎఫైర్స్ గురించి సంచలన నిజాలు బయటపెట్టిన నయనతార

also read: నటి కస్తూరి సంపాదన ఎంతో తెలుసా? చిన్నప్పట్నుంచే రిచ్‌.. ఫ్యామిలీ డిటెయిల్స్

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories